Krishna Mukunda Murari: మురారి భవాని దేవితో ఆదర్శిని తీసుకొచ్చే బాధ్యత నాది అని మాట ఇస్తాడు. ఆదర్శ్ ని ఎలాగైనా ఒప్పించి ఇంటికి తీసుకు వస్తాను అని అంటాడు నాకు తెలుసు వాడు నా మాట వింటాడు అని వాళ్ళ పెద్దమ్మతో అంటాడు. కానీ మనసులో మాత్రం వాడు రాకుండా ఉండిపోవడానికి మాత్రం కారణం నేనే అని మనసులో అనుకుంటాడు. ఎలాగైనా సరే ఆదర్శ్ ని ఇంటికి తీసుకురావాలి అని మురారి డిసైడ్ అవుతాడు.

ఇక కృష్ణని హాస్పిటల్ దగ్గర దించాలని తనకోసం వెతుకుతూ ఉంటాడు. కృష్ణ అని పెద్దగా పిలవగానే రేవతి వస్తుంది. అమ్మ కృష్ణ ఎక్కడా అని అడిగాగా అలేఖ్య అక్కడికి వచ్చి ముకుందా కృష్ణ ఇద్దరు కలిసి వెళ్లారు అని చెబుతుంది. ఆ మాటకు రేవతి వెంటనే వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు నీకు తెలుసు నాకు చెప్పు అని అడుగుతుంది. నిజంగా నాకు తెలియదు అత్తయ్య అని అలేఖ్య అంటుంది . ముకుందా కృష్ణకు నిజం చెప్పాలని తీసుకువెళ్లింద ఏమున్నా నాతో చెప్పు అని రేవతి అడుగుతుంది. నిజంగానే నాకు తెలియదు అత్తయ్య అని అలేఖ్య అంటుంది. నిజం నీకు తెలుసని నాకు తెలిస్తే అప్పుడు నీ సంగతి చెబుతాను. ఇక్కడ మురారి ఉన్నాడు కాస్త కేర్ ఫుల్ గా ఉండు అని రేవతి అలేఖ్యకి వార్నింగ్ ఇస్తుంది.

ఏంటి ముకుందా ఏదో సీక్రెట్ చెప్పానని ఇక్కడికి తీసుకువచ్చావు. ఏంటా సీక్రెట్ అని కృష్ణ అడుగుతుంది. ప్రరిణి ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా మురారి నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ కదా నీకు మురారిని ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా అని అడగగా.. ఏసిపి సార్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా.. తెలుసు ఆ అమ్మాయి పేరేంటి ఎలా ఉంటుంది ఎందుకు వాళ్ళు విడిపోయారని కృష్ణ అడుగుతుంది. ఇంతకు ఆ అమ్మాయికి పెళ్లయిందా అంటే.. పెళ్లి అయింది అని ముకుందా చెప్పగానే కృష్ణ ఊపిరి పీల్చుకుంటుంది. రాధా మురారిని ఎంతగానో ప్రేమిస్తుంది. పరిస్థితులు కారణంగా వాళ్ళు విడిపోయిన.. నీకంటే ఎక్కువగా మురారిని తనే ప్రేమిస్తుంది. ఇప్పటికీ తను మురారినే ప్రేమిస్తుంది మురారి కోసం ప్రాణ త్యాగం చేయడానికి కూడా తను సిద్ధంగా ఉంది అని ముకుందా చెప్పగానే కృష్ణ పకపకా నవ్వుతుంది.

మురారి కోసం ప్రాణ త్యాగం చేస్తుందా అంటూ నవ్వేస్తుంది ఏంటి నీకు నీ ప్రేమ తక్కువగా కనిపించిందా రాధ ప్రేమ ఎక్కువగా కనిపించిందా అని ముకుందా అడుగుతుంది. లేదు ముకుందా ఇప్పటికీ కూడా నా ప్రేమే ఎక్కువ నేను ప్రేమించినంతగా ఏసీబీ సార్ ని ఇంకా ఎవ్వరూ ప్రేమించరు. ఆయనకు ఏం ఇష్టమో ఎప్పుడు ఎలా ఉంటారో ఏసిపి సార్ కి తెలియదు కానీ ఆయన గురించి నాకు తెలుసు అని కృష్ణ అంటుంది. నేను ప్రాణ త్యాగం చేయను ఎందుకంటే నేనే లేకపోతే ఆయన్ని ప్రేమగా చూసుకునేది ఎవరు? ఆయనకు నా అంత ప్రేమను ఎవరు అందిస్తారు అని కృష్ణ అంటుంది. ప్రేమలో స్వార్థం ఉంది కృష్ణ కానీ రాదా అలా కాదు నిస్వార్ధంగా మురారిని ప్రేమించింది, తననే గుడ్డిగా నమ్మింది తనకోసం ఏమైనా చేస్తుంది. కానీ నువ్వు అలా కాదు కదా అని ముకుంద అంటుంది. నీకంటూ ఒక ఆశయం ఉంది పేదలకు సేవ చేయాలని, గొప్ప సంకల్పం ఉంది కానీ రాధకి అలా కాదు మురారినే తన లోకం, తన సర్వస్వం.. తనకి ప్రతిదీ మురారిని అని కృష్ణ ముందు ముకుందా బాధపడుతూ చెబుతుంది.

అంటే ఇప్పుడు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు ముకుందా? మీ రాధ కోసం నేను నా ఏసిపి సార్ ని వదులుకోవాలా అని కృష్ణ సూటిగా ముకుందని ప్రశ్నిస్తుంది. నువ్వు డాక్టర్ వి కృష్ణ కానీ రాదా అలా కాదు తనకి ఇంత మురారినే తనకోసం నువ్వు మురారివిని త్యాగం చేయొచ్చు కదా రెండు మనసులు ప్రశాంతంగా ఉంటాయి అని ముకుందా అడుగుతుంది చెప్పు కృష్ణ అని అనగానే.. కోపంగా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా ముకుందా మురారిని వదిలేయడం అంటే నేను నా ప్రాణాల్ని వదిలేయడమే అని కృష్ణ చెబుతుంది. కృష్ణ తన మెడలో ఉన్న తాళిబొట్టుని తీసి చూపిస్తూ దీని విలువ ఏంటో నీకు తెలీదా ముకుందా నువ్వు కాబట్టి ఏమి మాట్లాడటం లేదు అదే ఇంకొకరు అయ్యి ఉండుంటే వాళ్ళ చంప పగలగొట్టి ఉండే దానిని అని కృష్ణ ముకుంద కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.

వెళ్లి నీ రాధకి చెప్పు ఏసిపి సార్ నా వాడు.. తను ఒకప్పటి ప్రియురాలు అయితే నేను తాళి కట్టించుకున్న భార్యని. ప్రియురాలు తిరిగి వదిలేసినట్టు భార్య భర్తని వదిలేయదు. అది ఎప్పటికీ జరగదని నీ రాధకు చెప్పు ముకుందా అని కృష్ణ అంటుంది. ఇంకో విషయం ముకుందా? ఇంకెప్పుడు నా కాపురంలో నిప్పులు పోయాలని చూడకు. నేను ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతానో నాకే తెలీదు. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే నా భర్త ప్రాణ స్నేహితుడి భార్యవి అని కూడా చూడను. నేను ఏం చేస్తాను నాకే తెలియదు ముకుందా అని కృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో ముకుందా మురారి దగ్గరకు వెళ్లి నేను కృష్ణకు మన ప్రేమ విషయం చెప్పేసాను అని చెబుతుంది. నువ్వు నాకు కావాలి మురారి నువ్వు లేకుండా నేను ఉండలేను అని మురారిని గట్టిగా హత్తుకుంటుంది ముకుంద అది కృష్ణ చూస్తుందా లేదా అనేది తరువాయ భాగంలో చూడాలి.