గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య రీసెంట్గా `కృష్ణ వ్రింద విహారి` అనే మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఇందులో షెర్లీ సెటియా హీరోయిన్గా నటించింది.
రాధిక, రాహుల్ రామకృష్ణ, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమా.. సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
దీంతో నాగశౌర్య బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబడుతూ దుమ్ము దులిపేస్తున్నారు. కేవలం మూడు రోజుల్లోనే సగానికి పైగా టార్గెట్ ను సైతం రీచ్ అయ్యాడు. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 95 లక్షలు, రెండో రోజు రూ. 1.19 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న ఈ చిత్రం.. మూడొవ రోజు రూ. 1.13 కోట్ల షేర్ ని రాబట్టింది. ఇక ఏరియాల వారీగా `కృష్ణ వ్రింద విహారి` 3 డేస్ టోటల్ వసూళ్లను ఓసారి గమనిస్తే..
నైజాం: 1.31 కోట్లు
సీడెడ్: 25 లక్షలు
ఉత్తరాంధ్ర: 28 లక్షలు
తూర్పు: 22 లక్షలు
పశ్చిమ: 15 లక్షలు
గుంటూరు: 23 లక్షలు
కృష్ణ: 20 లక్షలు
నెల్లూరు: 11 లక్షలు
——————————
ఏపీ+తెలంగాణ మొత్తం= 2.75 కోట్లు(4.70కోట్లు~ గ్రాస్)
——————————
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 13 లక్షలు
ఓవర్సీస్: 52 లక్షలు
——————————–
టోటల్ వరల్డ్ వైడ్: 3.40 కోట్లు(6.20 కోట్లు~ గ్రాస్)
——————————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 5.20 కోట్ల దాకా బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ.5.60 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అవ్వాలంటే మొదటి మూడు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా.. ఇంకా రూ. 2.20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంది. అయితే టాక్ అనుకూలంగా ఉండటంతో లాంగ్ రన్లో నాగశౌర్య ఈ టార్గెట్‌ను అందుకోవడం ఖాయమని అంటున్నారు.