టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తాజా చిత్రం `కృష్ణ వ్రింద విహారి`. శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమాకు అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించాడు. ఇందులో షిర్లే సెటియా హీరోయిన్‌గా నటిస్తే.. బ్రహ్మాజీ, రాధికా శరత్ కుమార్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్‌ను షురూ చేసిన మేకర్స్.. తాజాగా `కృష్ణ వ్రింద విహారి` ట్రైలర్ ను బయటకు వదిలారు. కోమాలో ఉన్న డాక్టర్(వెన్నెల కిషోర్) బయటకు రావడం తన జీవితానికి చాలా ముఖ్యమని హీరో చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంది.

అయితే ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఓ అబ్బాయి.. ఉద్యోగం రిత్యా పట్టణానికి వచ్చి, అక్కడ ఒక సూపర్ ఫాస్ట్ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ తర్వాత అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అన్నదే సినిమా కథగా ట్రైలర్ బట్టీ తెలుస్తోంది. ఇందులో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అబ్బాయిగా నాగ శౌర్య, మోడ్రన్ అమ్మాయిగా షిర్లే కనిపించబోతున్నారు.
ఇక `ఎఫ్ 2 లో వెంకీ మామ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్. ప్రపంచంలో బాధలు అన్నీ వాళ్ళే భరిస్తున్నారని అంటారే? మరి, వాళ్ళను భరిస్తున్న మనల్ని ఏమనాలి?` అంటూ నాగ శౌర్య చెప్పే డైలాగ్ ట్రైలర్ లో హైలైట్‌గా నిలిచింది. విజువల్స్, బ్యాకగ్రైండ్ మ్యూజిక్ వంటి అంశాలు కూడా బాగున్నాయి. మొత్తానికి అదిరిపోయిన ట్రైలర్.. సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. మరి ఆ అంచనాలను నాగశైర్య అందుకుని ఈసారైనా హిట్ కొడతాడేమో చూడాలి.