Krishnamma kalipindhi iddarini: గిఫ్ట్ కింద పడగానే గౌరీ ఏం జరిగిందని లేచి చూస్తుంది ఎందుకు లేచారు ఏమైనా కావాలా అండి అని గౌరీ అడుగుతుంది.జనరల్ గా చేసిన పాపాలు శాపాలుగా వెంటాడుతాయి కానీ నా విషయంలో నేను ప్రేమించిన ప్రేమ నాకు శాపంగా మారింది నీకు ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని గుర్తుకొచ్చినప్పుడు నా మనసంతా ఆనందంతో నిండిపోతుందని అనుకున్నాను కానీ ఇలా బాధతో మిగిలిపోతుంది అని నేను అనుకోలేదు నీ మీద నేను పెంచుకున్న ప్రేమ వదిలించుకోవాలని నీ నుంచి ఎంత దూరంగా వెళ్ళిపోదామని చూసిన సరే నీ జ్ఞాపకాలు నాకు గుర్తు చేస్తూనే ఉన్నాయి నన్ను ఇంకా బాధ లోకి నెట్టు వేస్తున్నాయి ఈ చిత్రవధను భరించడం నావల్ల అవ్వట్లేదు అని ఈశ్వర్ బయటికి వెళ్లిపోతాడు.

ప్రేమంటే రెండు గుండెలు కలిసి చేసే సవ్వడి అని మీరు ఒకప్పుడు నాకు చెప్పారు మరి ఇప్పుడు మీ కోపాన్ని ఈ గుండె పడుతున్న సవ్వడి మీకు ఎందుకు వినిపించడం లేదండి నేను మీకు నిజం చెప్పకుండా దాచడం ముమ్మాటికి తప్పే మీ దగ్గర ఏ నిజాన్ని దాచను అని నేను నీకు మాట ఇచ్చాను కానీ నేను ఏ పరిస్థితిలో ఆ పని చేయవలసి వచ్చిందో నాకు చెప్పుకునే అవకాశం ఇస్తే మన ఇద్దరి మనసులోని నరకం సంతోషంగా మారుతుంది అండి అని గౌరీ ఏడుస్తూ అనుకుంటుంది. కట్ చేస్తే ఏదో పక్క దేశములో పడుకున్నట్టు పడుకున్నావ్ ఏంటి మొగుడా మన ఇద్దరి మధ్య గాలి కూడా దూరనంత గా దగ్గర చేస్తాను చూడు అని అఖిల కాలు మీద వేస్తుంది. కాలు వేయగానే ఆదిత్య కు మేలుక వస్తుంది గురక పెట్టడం కాలు వేయడం అబ్బా బాబోయ్ అన్ని మంచి లక్షనాలే ఉన్నాయిగా అని కాలు తీసి ఆదిత్య పడుకుంటాడు.మళ్లీ అఖిల కాలు చేయి వేస్తుంది. అయ్యో బాబోయ్ మేడమ్ గారికి కాలు చెయ్యి వేసి అలవాటు నిద్దట్లో ఉన్నట్టుంది అని ఆదిత్య అనుకుంటాడు.

వలపు బాణాలు వేయమని అమ్మ చెప్పింది కానీ ఏ బాంబులు వేసిన చెలించేలా లేడుగా కర్మ అని నెత్తి కొట్టుకుంటుంది అఖిల. కట్ చేస్తే ఇంతలో తెల్లవారింది ప్రతిరోజు నువ్వే పూజ చేస్తావు కదా మరి ఈరోజు ఎవరు చేశారు అని సునంద వాళ్ళ ఆయన అంటాడు. ఇంకెవరు మన కోడలు చేసి ఉంటుంది అని సునంద అంటుంది. అవును వదిన గారు మీ చిన్న కోడలు చేసింది అఖిల రోజు పొద్దున్నే లేచి పూజ చేసి గుమ్మం ముందు ముగ్గులు పెట్టనిది దానికి పొద్దుపోదు అనుకోండి అని భవాని అంటుంది. ఇంతలో వాళ్ళ మామగారు వచ్చి పూజ చేసింది అఖిల కాదు గౌరీ అని అంటాడు. మీరు సరిగ్గా చూశారో లేదో మామయ్య గారు అఖిలే చేసింది అని మళ్లీ భవాని అంటుంది.నేను కూడా చూశాను గౌరీ నే పూజ చేసింది అని వాళ్ళ అత్తయ్య అంటుంది. నీ చిన్న కూతురుకి పది అయ్యేదాకా పడుకోవడం అలవాటు గౌరీ నే పూజ చేసింది గౌరీ కి అన్ని మంచి అలవాట్లే ఉన్నాయి కానీ అఖిలకు అలా లేవు కానీ మీరు ఎందుకు ఇద్దరిని వేరువేరుగా పెంచారు ఒకేలా ఎందుకు పెంచలేదు అఖిలకి కూడా ఇంటి బాధ్యతలు నేర్పించవచ్చు కదా అని సునంద అంటుంది.

అయ్యో బాధ్యతల విషయంలో గౌరీ కంటే అఖిల ముందుంటుందండి కాకపోతే చిన్నపిల్ల అని కాస్తంత గారాబంగా పెంచాను అంతే అని భవాని అంటుంది. ఇంతలో గౌరీ తాతగారు మీకు కాఫీ తీసుకొచ్చాను మీరు కాఫీ తాగి టాబ్లెట్ వేసుకొని అలా వాకింగ్ చేసి రండి అని గౌరీ అంటుంది. ఈ తాతయ్య ఆరోగ్య విషయంలో నీకెందుకు అమ్మ ఇంత శ్రద్ధ అని వాళ్ళ తాతయ్య అంటాడు. మావయ్య గారు అత్తయ్య గారు అందరూ కాఫీ తీసుకోండి అని గౌరీ అందరికీ కాఫీ ఇస్తుంది. మిమ్మల్ని అందరిని తన బుట్టలో వేసుకోవాలని ఇవన్నీ చేస్తుంది కానీ ఇవన్నీ మీకు ఏమీ అర్థం కావు నాకు అర్థమైంది నేను మీకు చెప్పలేకపోతున్నాను అని ఈశ్వర్ తన మనసులోఅనుకుంటాడు. ఏవండీ మీకు ఫిల్టర్ కాఫీ అని గౌరీ ఇస్తుంది. నీ చేత్తో కాఫీ నాకు అక్కర్లేదని చెప్పాలని ఉంది కానీ అందరి ముందు చెప్పలేక తీసుకుంటున్నాను అని ఈశ్వర్ తన మనసులోఅనుకుంటాడు. ఒరేయ్ మనవడా నీ పద్ధతేమి నాకు నచ్చట్లేదు అందరి కోసం ఇంత శ్రమపడి తీసుకొస్తే నువ్వు కొంచెం కూడా మెచ్చుకోవట్లేదు ఏంట్రా అని వాళ్ళ నాయనమ్మ అడుగుతుంది. అవును నాన్న చాలా బాగుందని నువ్వు ఒకసారి చెప్తే గౌరీ కూడా సంతోషిస్తుంది కదా అని సునంద అంటుంది. వదినని అందరూ పొగుడుతుంటే లోలోపలే సంతోష పడిపోతున్నాడేమో బయటికి చెప్పడం లేదు కదా అన్నయ్య అని ఆదిత్య అంటాడు. అవును అంతే అని ఈశ్వర్ అంటాడు. ఆ గౌరీ తీసుకువచ్చింది నాలుగు కాఫీలు రెండు టీలు ఏదో ప్రపంచ యుద్ధాన్ని గెలుసుకొచ్చినట్టు వీళ్ళు మెచ్చుకుంటున్నారు అని అఖిల మనసులో తిట్టుకుంటుంది. వదిన గారు ఇంక నేను బయలుదేరుతాను అని భవాని అంటుంది. అదేంటండీ అప్పుడే వెళ్ళిపోతాను అంటున్నారు ఇంకో నాలుగు రోజులు ఉండొచ్చు కదా అని సునంద అంటుంది.

అంటే ఇంటిదగ్గర మా ఆయనకు భోజనానికి ఇబ్బంది అవుతుంది అందుకని వెళ్తున్నాను అని భవాని అంటుంది. మంచిదమ్మా వెళ్లిరా అని సునంద వాళ్ళ ఆయన అంటాడు. గౌరీ భగవంతుడు నీకు దేవాలయం లాంటి ఇంటికి కోడలు చేశాడు దేవుడు లాంటి భర్తను ఇచ్చాడు సంతోషంగా ఉండు అమ్మ చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో అని భవాని అంటుంది. అలాగే అమ్మ నువ్వేం దిగులు పడకు అని గౌరీ అంటుంది. అమ్మడు నువ్వు మన ఇంట్లో చేసినట్టే ఇక్కడ కూడా అందరికీ పనులు చేసి పెట్టి మంచిగా ఉండమ్మా అని అఖిలతో అని వెళ్ళొస్తానమ్మ జాగ్రత్త అని భవాని వెళ్ళిపోతుంది.అమ్మ మనవరాలా కషాయం చాలా అద్భుతంగా ఉందమ్మా అని వాళ్ళ అమ్మమ్మ అంటుంది.లెమన్ టీ అయితే మధురంగా ఉంది అమ్మ గౌరీ ఈశ్వర్ కి ఎలాంటి భార్య వస్తుందోనని దిగులు పడ్డాను ఈశ్వర్ కు తగ్గ భార్యవు వచ్చావు ఈ ఇంటికి తగినట్టుగా ఉన్నావు అని వాళ్ళ అత్తయ్య మెచ్చుకుంటుంది.మీకీ సంతోషం కొన్నాళ్లే బాగా సంతోషపడండి అని తన మనసులో ఉజ్వల అనుకుంటుంది.దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మళ్ళీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం