Krishnamma Kalipindhi Iddarini: పెద్దపెద్ద వస్తువులు కొట్టేస్తే దొరికిపోతాం, చిన్న వస్తువులు కొట్టేయాలి, అబ్బా వెండి గిన్నెలు ఎవరు చూడట్లేదు కదా అని వాటి దగ్గరికి వెళుతుంది అఖిల. ప్రసాదం నా కడుపులోకి వెండి గిన్నెలు నా రూమ్ లోకి, దొంగతనం చేశాక చెయ్ దురద తగ్గిపోయి ఎంత హాయిగా ఉందో, ఒసే అఖిల మూడో కంటికి తెలియకుండా వెన్న తీయడం ఆ కృష్ణయ్య ఎక్స్పెక్ట్ అయితే నాలుగో కంటికి తెలియకుండా వంటకం ఎక్స్పెట్టే శభాష్ అని వ్యక్తి తనను తన పొగుడుకుంటుంది. ఇంతలో ఉజ్జల వచ్చి చూస్తుంది, ఏదో వస్తువుని పొంగు చాటున దాచుకుంది ఏంటో చూద్దాం అని వెళుతుంది.ఏంటి అఖిల ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. ఏం లేదు నడుస్తున్నానట్లా చెప్తుంది. నీ సారీ సూపర్ ఉంది అని ఉజ్వల చెప్తుంది.

అందుకే కట్టుకున్నా అని అఖిల అంటుంది. ఈసారి ఒకటి అయితే బార్డర్ ఇంకో ఎత్తు అని చూస్తుంది,. ఏంటి ఈ అమ్మాయికి తెలిసిపోయింది నేను దొంగతనం చేశానని అని అఖిల మనసులో అనుకుంటుంది. ఎందుకలా తిరుగుతున్నావ్ నేనే చూపిస్తాను చూడాలి తన చీర బార్డర్ చూపిస్తుంది. సరే బాగుందా ఇక నేను వెళ్తాను అని వెళ్ళిపోతున్న అఖిల. ఈ పిల్ల ఏదో కొట్టేసింది కానీ తన చేతిలో లేదేంటి అని అనుకుంటుంది ఉజ్వల. అఖిల రూమ్ లోకి వెళ్లి అబ్బో జస్ట్ మిస్ ఉజ్వలకి తెలిసిపోయింది అంటే ఇంట్లో పెద్ద రచ్చ జరిగిపోయేది, వీటిని ఎక్కడ దాచాను అని దాచిపెడుతుందా అఖిల.కట్ చేస్తే, ఒక స్టేజ్ లో ఈశ్వర్ నీ పెళ్లి చేసుకోను అని సునంద అత్త తో చెప్పిన గౌరీ ఆ తరువాత ఈశ్వర్ తో పెళ్లికి ఒప్పుకోవడానికి దాని చెల్లికి ఆదిత్యతో పెళ్లి అవుతుంది అన్న ఒకే ఒక్క కారణం, గౌరీ కి దాని కాపురం తో పాటు దాని చెల్లెలి కాపురం కూడా అంతే ముఖ్యం అఖిలను ఇంట్లో నుండి తరిమేసాం అనుకో ఆటోమెటిగ్గా గౌరీ కూడా వెళ్ళిపోతుంది అని ఉజ్వల చెబుతుంది.

ఇదిగో ఉజ్వల శత్రువు బలహీనత అంటున్నావ్ గౌరీ అంటున్నావు మధ్యలో అఖిల అంటున్నావ్ ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు కొంచెం క్లారిటీగా చెప్పవే ప్లీజ్ అని సౌదామిని అడుగుతుంది. ఆ అఖిల కి దొంగతనాలు బుద్ధి ఉంది అని ఉజ్వల చెబుతుంది. అవునా నువ్వు చెప్పేది నిజమా అని సౌదామిని అడుగుతుంది. అవును మమ్మీ ఇందాక పిల్ల ఏదో ఒక వస్తువు కొట్టేసి కొంగు చాటున దాచుకోవడం నేను చూశాను నన్ను చూసి కంగారు పడడం నేను గమనించాను అని ఉజ్వల చెబుతుంది. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు అన్నట్టు ఇంత గొప్ప ఇంటికి కోడలైనా సరే దానికి దొంగతనాల అలవాటు పోలేదు అన్నమాట అని సౌదామని అంటుంది. ఆ అఖిల ని మనం ఏదో ఒక దొంగతనంలో పట్టుకొని ఇరికించాము అనుకో సునంద అత్త దాని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది దాంతో చెల్లెలి వెనుక అక్క కూడా ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది అని ఉజ్వల చెబుతుంది. అవును బేబీ నువ్వు చెప్పింది 100% కరెక్ట్, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఏర్పాటు చేసి ఆ ఫంక్షన్ లో ఆ అఖిలతో దొంగతనం చేసేలా చేద్దాం, అందరి ముందు దాని దొంగతనం బయటపెట్టి అక్కా చెల్లెలి ఇద్దరినీ కలిపి ఒకేసారి తన్ని తరిమేద్దాం అని సౌదామిని అంటుంది.

కట్ చేస్తే సునంద గౌరీ ఈశ్వర్ ఎక్కడ అని అడుగుతుంది. గౌరీ ఈశ్వర్ ని తీసుకురావడానికి వెళ్ళింది అక్క అని చెప్తుంది సునంద వాళ్ళ చెల్లెలు. ఏమండీ భోంచేద్దాం రండి అని గౌరీ అడుగుతుంది. అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు వెళ్దాం రండి. ఈశ్వర్ లేస్తాడు. గౌరీ చెయ్యి పట్టుకుంటుంది. నేనేమైనా చిన్న పిల్లవాడిన అని అంటాడు.మీరు ఎప్పటికీ చిన్న పిల్లాడే అని అంటుంది గౌరీ. దీన్ని నడిపించడం అనరు కలిసి నడవడం అంటారు. అందరూ ఉన్నారు కాబట్టి నేనేమీ మాట్లాడను సైలెంట్ గా ఉంటాను అని నువ్వు ఇలా చేస్తున్నావ్ కదా అని ఈశ్వర్ అంటాడు. మీరు నన్ను ద్వేషించిన సరే నా భర్తని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత, అందుకే నా మనసు చెప్పినట్టు వింటానే తప్ప అందరి ముందు నటించాల్సిన అవసరం లేదు, పదండి అని తీసుకెళ్తుంది గౌరీ. ఏ గౌరీ నువ్వు వచ్చినప్పటి నుంచి నా మనవడు నీ కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు, అప్పుడప్పుడు మాతో గడపమని చెప్పమ్మా అని వాళ్ళ తాతయ్య అంటాడు. అవును మామయ్య పెళ్లి కానంత వరకే అమ్మ పెళ్లయిన తర్వాత ఇలా భార్య కొంగు పట్టుకుని తిరుగుతారు, నీ పెద్ద కోడలు నా కొడుకు బాధ్యత కూడా తీసుకుంది అని సునంద అంటుంది. కడుపునిండా తిన్న తర్వాత అరగకపోతే కడుపు మంట రావాలి కానీ ఈ పొగడ్తలు వినలేక కడుపు మండిపోతుంది అని అఖిల తన మనసులో అనుకుంటుంది. తను నా మీద చూపిస్తున్న ప్రేమంతా నిజం అనుకొని సంతోష పడుతున్నావు కానీ తను చేసిన మోసానికి నేను మాత్రం తనతో సంతోషంగా లేనమ్మా అని ఈశ్వర్ అనుకుంటాడు తన మనసులో. ఏవండీ ఏంటి ఆలోచిస్తున్నారు తినండి అని అంటుంది గౌరీ. మంచితనం ముసుగులో నువ్వు మా వాళ్ళని మోసం చేయడం తట్టుకోలేకపోతున్నాను అనుకుంటూ ఈశ్వర్ చెయ్యి చారులో పెడతాడు చెయ్యి కాలుతుంది. గౌరీ వెన్న తెచ్చి చేతికి రాస్తుంది.

నాకు తెలుసండి నేను వండిన భోజనం తినకూడదనే కదా ఇలా చేశారు అని గౌరీ అనుకుంటుంది. నా మీద కోపాన్ని నీ మీద ఎందుకు చూపించుకున్నారండి. ఏవండీ మంట కాస్తయినా తగ్గిందా అని అడుగుతుంది గౌరీ. చెయ్యి మంటగా ఉంది నేను తినలేనమ్మ అని వెళ్ళిపోతూ ఉంటాడు ఈశ్వర్. నీకు తినిపించడానికి నీ భార్య గౌరీ లేదా అంటాడు వాళ్ళ తాతయ్య. నీ చేతి వంట తినకూడదని నేను చేయి కాల్చుకున్నాను కానీ ఇప్పుడు నీ చేతితో అన్నం తినాల్సి వస్తుంది నా బ్యాడ్ లక్ అనుకుంటాడు ఈశ్వర్. గౌరీ ఈశ్వర్ కి తినిపిస్తుంది. అది చూసి అఖిల ఏం మొగుడివి రా బాబు నువ్వు అని ఆదిత్య గురించి అనుకుంటుంది. నా మొగుడికి నేనే చేయి కాల్ ఎలా చేస్తాను అప్పుడు నేను కూడా నా మొగుడికి ప్రేమ గోరుముద్దలు తినిపిస్తాను, ముట్టుకోగానే కాలిపోయేలా ఏముంది అని వెతుకుతుంది అఖిల, చారు బీభత్సంగా వేడిగా ఉంది అంటుంది, ఇప్పుడు ఈ చారుని మా ఆయనకి పోస్తున్నట్టు చెయ్ మీద పోసేస్తాను ఆయన చేయి కాలి లబోదిబో నేను తినలేను అంటాడు, మీరు ఇబ్బంది పడడం నేను చూడలేను నేను తినిపిస్తాను అని ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తాను, ఏమండీ చారు ఇంకొంచెం వేయనా అని అడుగుతుంది అఖిల. ఆ వద్దు చాలు అంటాడు ఆదిత్య. నా ప్లాన్ అంతా పాడు చేశారు అని అఖిల అనుకుంటుంది.

ఇవన్నీ నా భార్య నుంచి నేను కోరుకున్న అందమైన జ్ఞాపకాలు, ఈ జ్ఞాపకాలు సొంతం అనుకుంటూ ఆనందపడాలో లేక బాధపడాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే ప్రతిక్షణం నువ్వు నా నమ్మకాన్ని మోసం చేశావు అన్న విషయం గుర్తుకొస్తుంది, అందుకే ఈ అపురూపమైన జ్ఞాపకాలు జీవిత జ్ఞాపకాలుగా మారుతున్నాయి అని ఈశ్వర్ అనుకుంటాడు. నా స్వచ్ఛమైన ప్రేమ కూడా మీకు అబద్ధంలా కనిపిస్తుంది, మీ మనసులో ఆ అపార్థం తొలగిపోయిన రోజు మీరు ఇప్పుడు చేదు జ్ఞాపకాలు అనుకుంటున్నవన్నీ అపురూపమైన జ్ఞాపకాలుగా పదిలంగా దొరుకుతాయి అని గౌరీ అనుకుంటుంది. ఇదేంటే మనం వీళ్ళు ఎంత దూరం చేద్దాం అన్న వీళ్ళు రోజు రోజుకి అంత దగ్గర అవుతున్నారు అని సౌదామిని ఉజ్వలతో చెప్తుంది.ప్రతి కలయిక ఎప్పుడో ఒకచోట విడిపోవడానికి నాంది వీళ్ళ కలయిక కూడా అంతే నువ్వు తిను అని ఉజ్వల చెప్తుంది. నువ్వు కూడా తిను గౌరీ అని సునంద అంటుంది.