Krishnamma Kalipindi Iddarini: అఖిల లేచి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం పదండి అంటుంది. పోలీస్ స్టేషన్ కి ఎందుకు నా మీద కేసు ఏంటి అంటాడు ఆదిత్య. మీరు నా గొంతు కోశారు కదా అందుకని అంటుంది అఖిల. నీ గొంతు బానే ఉంది కదా మరి నీ గొంతు కోసం అంటే ఏంటి. గొంతు కోయడం అంటే కత్తితోనే రంపంతోనో కసకస కోయడం కాదు మీరు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని నాతో బకెట్లు బకెట్లు కన్నీరు కారించడం. ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా నీకు నువ్వు అడిగినప్పుడు చెప్పాను కదా నేను నిన్ను మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకుంటున్నాను అని ఇప్పుడు మళ్లీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్. మన మధ్య ఉన్న ఈ దూరం చూసే అంటుంది అఖిల. నిన్న రాత్రి మనకి మొదటి రాత్రి మనిద్దరం అన్యోన్యంగా సంతోషంగా ఉండాలి కానీ మనిద్దరికీ ఏదో ఆస్తి పంపకాల్లో గొడవైనట్టు నువ్వు ఆ దిక్కున నేను నీ దిక్కున పడుకున్నాను అసలు నేను పడుకోను కూడా పడుకోలేదు,అర్థమైంది ఈ దెబ్బతో నాకు క్లియర్ గా అర్థమైంది నేనంటే మీకు అసలు ఇష్టం లేదు ఏదో మొహమాటానికి మొక్కుబడిగా నాకు తాళి కట్టారు మీరు అసలు నన్ను పెళ్ళాం గా చూడడం లేదు.

అలాంటిది ఏమీ లేదు నువ్వు అనవసరంగా పిచ్చిపిచ్చిగా ఊహించుకోకు. మీరు నన్ను పెళ్ళాం గా చూస్తే గాలి కూడా దూరం అంత దగ్గరగా ఉండాలి కానీ మీరు ఏదో భూకంపం వచ్చి భూమి బద్దలైపోయినట్టు అంత దూరాన పోయి పడుకున్నారు నా చేతితో మీకు పాలిస్తే ఏదో ఆమదం తాగినట్టు మొహం పెట్టారు. చెప్పండి ఎందుకు మీరు నన్ను దూరం పెడుతున్నారు నేను మీ పక్కనుంటే ఎందుకు చిరాగ్గా మొహం పెడుతున్నారు నాకు కారణం చెప్పండి ఇప్పుడు, సమాధానం చెప్పరా అలాగే చెప్పకండి అని వెళుతుంది. ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతాడు ఆదిత్య. మీ అమ్మ దగ్గరికి, మీరు నన్ను అసలు ఎందుకు దూరం పెడుతున్నారు అడిగి తెలుసుకుంటాను. నువ్వు వెళ్లి మా అమ్మతో చెప్తే ఇంట్లో అనవసరంగా గొడవలు జరుగుతాయి. చెప్పి తేల్చుకోకపోతే నేను రోజు ఏడుస్తూ బాధపడాలి.

నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు కానీ సడన్గా పెళ్లి జరిగేసరికి నేను అనుకున్న ప్లాన్స్ అన్ని తలకిందులుగా అయిపోయాయని కాస్తా డిస్టబెన్స్ లో ఉన్నాను, ఆ డిస్టబెన్స్ లో ఉన్నాను తప్ప నీతో మంచిగా ఉండకపోవడం వెనుక ఏ కారణం లేదు. నాకు కాస్త టైం ఇవ్వు నేను నీకు దగ్గరవడానికి ప్రయత్నిస్తాను. భవిష్యత్తులో ఏదైనా తేడా వచ్చిందనుకో ఈ అఖిల విశ్వరూపం చూస్తారు అని వెళ్ళిపోతుంది. దేవుడా నాతో నా మనసుతో ఎందుకిలా ఆడుకుంటున్నావో తెలియట్లేదు అని ఆదిత్య అనుకుంటాడు. కట్ చేస్తే, ఈశ్వర్ గౌరీ మీద కోపంతో దాంతో తెగదింపులు చేసుకొని వెళ్ళిపోతాడు, ఆదిత్య కూడా అఖిలను వదిలేస్తాడు అప్పుడు ఆదిత్యతో నా కూతురు పెళ్లి రూట్ క్లియర్ అయిపోయినట్టే అని ఈశ్వర్ వాళ్ళ అత్తయ్య అనుకుంటుంది. ఇదేంటి ఈశ్వర్ రగిలిపోతున్న అగ్రిపర్వతంలో వస్తాడు అనుకుంటే నవ్వుతూ వస్తున్నాడు అని అనుకుంటుంది. ఇంతలో గౌరీ హాల్లోకి వస్తుంది, ఈ పిల్ల ఏడ్చి ఏడ్చి మొహం వాచి కళ్ళు ఉబ్బిపోయి ఉంటే అనుకుంటే చిరునవ్వులతో మొహం వెలిగిపోతుంది అని అనుకుంటుంది ఈశ్వర్ వాళ్ళ అత్తయ్య. అత్తయ్య మమ్మల్ని ఆశీర్వదించండి అని గౌరీ అంటుంది.

ఏవండీ ఆశీర్వాదం తీసుకోండి. గౌరీ నీ పక్కన నిల్చడమే నాకు ఇష్టం లేదు కానీ మా అమ్మని బాధ పెట్టకుండా ఉండడం కోసం ఇష్టం లేకపోయినా సరే నీతో కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్నాను అని ఈశ్వర్ అనుకుంటాడు. నామీద కోపం అర్థం ఉంది న్యాయం అంతకన్నా ఉంది. పరిస్థితులకు నా వాళ్లకు తలవంచాను కానీ ఇప్పుడు మీ ముందు దోశి లాగా తలదించుకొని ఉన్నాను అని గౌరీ అనుకుంటుంది. మీకు కూడా పండంటి బిడ్డ పుట్టాలని మీ అత్తయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని దుర్గాభవాని అంటుంది. ఆదిత్య అఖిల కూడా వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈశ్వర్ అమృత మాటలు నమ్మాడా లేదంటే నమ్మి కూడా నాకు చూపు లేదు కాబట్టి ఒక తోడు కావాలని మౌనంగా ఉన్నాడా అని సౌదామిని అనుకుంటుంది. అటు పెళ్లి ఆపటానికి ఇటు శోభనం ఆపటానికి నేను వేసిన ప్లాన్లు అన్ని ఎటు పనికిరాకుండా అయ్యాయి అని సౌదామిని పక్కకు వెళ్లి అనుకుంటుంది. కట్ చేస్తే ఈశ్వర్ సునంద గౌరీ అఖిల ఆదిత్య అందరు గుడికి వస్తారు.అమ్మ నువ్వు గౌరీని నాకంటే ఎక్కువ నమ్మి మోసపోతున్నావు అని ఈశ్వర్ తన మనసులో అనుకుంటాడు.

పంతులుగారు నా కొడుకులకు బంగారం లాంటి భార్యలు దొరికారు అందుకే వాళ్ళ చేత కొన్ని పూజలు చేద్దామని వచ్చాను అని సునంద చెప్తుంది. ఏంటి గౌరీ ఆలోచిస్తున్నావ్ ఈశ్వర్ ని తీసుకెళ్ళు అంటుంది సునంద. నువ్వు నా చేయి పట్టుకుంటే కంపరంగా ఉంది సహించ లేక పోతున్నాను కానీ మా అమ్మ కోసం భరిస్తున్నాను అని ఈశ్వర్ తన మనసులో అనుకుంటాడు. ని నీడే నన్ను తాక కూడదు అనుకున్నాను అలాంటిది నీ చేతులను తాకుతాయా అని ఈశ్వర్ అనుకుంటాడు. నిన్ను నా జీవితంలో నుంచి పంపాలనుకున్నా సరే దూరం పెట్టలేక పోతున్నాను అని గౌరీ తో అంటాడు. నా మనసులో నువ్వు లేవు నా జ్ఞాపకాల్లో నువ్వు లేవు. నేను నీ మెడలో తాళి కట్టినా సరే మన మధ్య భార్యాభర్తల బంధం లేదు.మన బంధం ముగిసిపోయిన అధ్యాయం అని ఈశ్వర్ అంటాడు.