Krishnamma Kalipindi Iddarini: గేమ్ స్టార్ట్ చేద్దామని ఉజ్వల అంటుంది. ముందు గౌరీ ఈశ్వర్ తోని స్టార్ట్ చేద్దాం అంటుంది.ఇక్కడ కూడా గౌరీ ఏముందా ఛీ ఎదవ జీవితం,అటు మొగుడి దగ్గర ప్రేమ లేదు ఇటు కోడలిగా విలువలేదు అని అఖిల అనుకుంటుంది. కానివ్వండి కానివ్వండి నువ్వు గౌరీ కళ్ళలోకి చూసుకుంటూ తినిపించుకోవాలి అని ఉజ్వల అంటుంది. దేవుడి దయవల్ల నాకు కళ్ళు లేవు కాబట్టి నీ కళ్ళల్లోకి చూసే భారం తప్పింది లేదంటే ని కళ్ళల్లోకి చూడగానే నువ్వు చేసిన మోసమే గుర్తొస్తుంది ఆ బాధ భరించలేక నరకంతో చచ్చిపోయేవాడిని అని ఈశ్వర్ అనుకుంటాడు. కానివ్వండి బావ అని ఉజ్వల అంటుంది.

గౌరీ అఖిల నీ ఇంట్లో నుంచి తరిమేసే కుట్ర చేస్తాను అని చెప్పి ఈ పిల్ల ఏంటి ఇలా ఫ్రూట్స్ తినిపించే ప్రోగ్రాం పెట్టింది అని సౌదామిని అనుకుంటుంది.నీకు ఇలా తినిపించాలి అంటే బాధతో మనసు నలిగిపోతుంది కానీ అందరి సంతోషం కోసం నాలో నేను బాధను భరించక తప్పడం లేదు అని ఈశ్వర్ అనుకుంటాడు. మీరెంత బాధపడుతున్నారో నాకు అర్థం అవుతుందా అండి నేను మీ జీవితంలో సంతోషం అవ్వాలనుకున్నాను కానీ మీ బాధకు నేనే కారణం అవుతాను అని అనుకోలేదు తట్టుకోలేకపోతున్నాను అని గౌరీ అనుకుంటుంది. ఈశ్వర్ తినిపించబోతాడు. హలో బావ ఏంటిది తినిపించుకోవాల్సింది చేతితో కాదు నోటితో అని ఉజ్వల అంటుంది.

ఉజ్వల ఏంటిది అర్థం లేకుండా అని ఈశ్వర్ అంటాడు. నీ మీద ఉన్న ప్రేమకి గుర్తుగా ఇవన్నీ అందమైన జ్ఞాపకాలుగా గుర్తుండి పోవాలి కానీ నువ్వు చేసిన మోసం కారణంగా చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి అని ఈశ్వర్ అనుకుంటాడు. ఈశ్వర్ తినిపించు నాన్న అని సునంద అంటుంది. ఈశ్వర్ తినిపిస్తాడు. గౌరీ ఇప్పుడు నీ వంతు అని ఉజ్వల అంటుంది. చ మనసు ఇలా కంట్రోల్ తప్పుతుంది ఏంటి నువ్వు నా మనసుని గాయం చేయకుండా ఉండి ఉంటే ఇది మనకు మధురమైన జ్ఞాపకం కానీ భరించలేనంత బాధగా మార్చేసావు నువ్వు అని ఈశ్వర్ అనుకుంటాడు. మై డియర్ మొగుడా ఆ కారణం ఈ కారణం చెప్పి నాకు దూరంగా ఉంటావా ఇప్పుడు చూడు నిన్ను ఎలా దగ్గర చేసుకుంటాను, ఉజ్వల ముందు నేనే తినిపిస్తా అని అఖిల అంటుంది.

నా కొడుకు కోడలు మధ్య ఉన్నాను బంధం చూసినా కడుపు నిండిపోయింది మీరు జీవితాంతం ఇలాగే సంతోషంగా ఉంటారని అని నమ్మకం నాకు కుదిరింది అని సునంద అంటుంది. వీళ్ళు పైకి కనిపిస్తున్నట్టుగా మనసులో హ్యాపీగా లేరు ఇది మనకి భయంకరమైన ఆయుధం ఇకముందు మొదలు పెడతాను అసలు సిసలు అయినా ఆటను అని ఉజ్వల తన మనసులో అనుకుంటుంది. ఈశ్వర్ వెళ్లి వాంతు చేసుకుంటాడు. ఏవండీ మీరు నా మీద ఎంత కోపని చూపించిన భరిస్తాను కానీ నీకేమైనా అయితే మాత్రం నేను తట్టుకోలేను మీరు వాంత్ ఎందుకు చేసుకున్నారు కడుపులో ఏమైనా ఇబ్బందిగా ఉందా టాబ్లెట్ తెప్పించమంటారా ఎందుకైనా మంచిది హాస్పిటల్ కి వెళ్దామా అని గౌరీ అంటుంది. నన్ను ముట్టుకోవద్దని చెప్పాను కదా నమ్మిన వ్యక్తి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తే తన చేతితో అమృతం ఇచ్చిన సరే విషం లాగే అనిపిస్తుంది నా పేరు ఈశ్వర్ అయిన ఆ ఈశ్వరుడిలా విషాన్ని గొంతులో దాచుకునే శక్తి నాకు లేదు అందుకే నువ్వు పండ్లు తినిపించిన విషయాన్ని కక్కేసాను అని ఈశ్వర్ అంటాడు.

ఆ గౌరీ ఈశ్వర్ ఎక్కడున్నారు అని ఉజ్వల చూస్తోంది, వీళ్ళిద్దరూ నిజంగా ప్రేమగా ఉన్నారు లేదంటే ప్రేమగా ఉంటున్నట్టు నటిస్తున్నారు తెల్సుకోవాలి అంటే నేను ప్రతిక్షణం వాళ్ళని నీడలాగా వెంటాడుతూనే ఉండాలి ఉజ్జల వస్తుంది.ఏమి ఆశించని స్వచ్ఛమైన ప్రేమను పెళ్లి అంటారు నేను ఆ స్వచ్ఛమైన ప్రేమతో మీ జీవితంలోకి వచ్చాను అంతే తప్ప మోసం అనే మాట ఆలోచన నా కళ్ళోకి కూడా రావండి నా ప్రాణం పోయినా మిమ్మల్ని మీ నమ్మకాన్ని మోసం చేయను అని గౌరీ అంటుంది. దయచేసి మాట్లాడకు నువ్వు నా పక్కన ఉంటే నువ్వు నాకు చెప్పకుండా దాచిన నిజాలు గుర్తుకు వస్తాయి నా దగ్గర ఏ విషయాన్ని దాచను అని నాకు మాట ఇచ్చావు, ఒకవైపు నా తమ్ముడు నాకోసం తన ప్రేమను త్యాగం చేసి వానిలో వాడే కుమిలిపోతున్నాడు అని బాధ మరోవైపు మా అమ్మకు నా మీద ఉన్న ప్రేమని మీరు అవకాశం తీసుకున్నారు అని మరో బాధ ఇవన్నీ గుర్తుకొచ్చి నన్ను చంపేస్తున్నాయి నీకు దండం పెడతాను వీలైనంత వరకు నువ్వు నాకు దూరంగా ఉండు నువ్వు నీ ఊపిరి నాకు వినపడకూడదు, నా మనసుని చంపేసావు దయచేసి మనిషిని కూడా చంపేయకు అని ఈశ్వర్ అంటాడు. ఏవండీ మీరంతా మాట అనకండి నా ప్రాణం పోతుంది, విషయం ఏంటో చెప్పుకునే అవకాశం ఇవ్వండి అని గౌరీ అంటుంది.

అవసరం లేదు ప్రాణం పోయిన తర్వాత ఆక్సిజన్ తీసుకొచ్చి ప్రయోజనం లేదు నమ్మకం చచ్చిపోయాక సంజాయిషీ చెప్పి ప్రయోజనం లేదు నువ్వేం చెప్పినా చేసిన మోసం సమర్ధించుకుంటావే తప్ప అందులో ఏమాత్రం నిజం ఉండదని నీకు తెలుసు అని ఈశ్వర్ అంటాడు. నన్ను అపార్థం చేసుకుంటున్నారు అండి నేను మిమ్మల్ని మోసం చేయలేదు, మా ప్రేమ అగ్ని కంటే పవిత్రం దయచేసి అర్థం చేసుకోండి అని గౌరీ అంటుంది. ఇంతకుముందు నేను కూడా అది నిజమనే అనుకున్నాను కానీ నువ్వు నా నమ్మకాన్ని ఆ మంటల్లోనే కాల్ చేసావు నువ్వేం చేసినా నా మనసు అతుక్కోదు తెలుసుకో అని ఈశ్వర్ వెళ్ళిపోతాడు. ఈశ్వర్ వెళ్ళిపోవడం ఉజ్వల చూస్తుంది,నేను ఊహించినట్టు వీళ్ళ మధ్య ప్రేమ లేదు ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి అని ఉజ్వల అనుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.