Krishnamma Kalipindi Iddarini మీరు అందరూ కలిసి మా అమ్మని పిచ్చిదాన్ని చేసి ఆడించారు అని ఈశ్వర్ అంటాడు.ఏవండీ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు నేను చెప్పేది ఒకసారి వినండి అని గౌరీ అంటుంది.తెచ్చి ఇస్తావా నీవల్ల జరిగిన నష్టాన్ని నా తమ్ముడు కోల్పోయిన ప్రేమను తెచ్చి ఇస్తావా వాడు అనుభవిస్తున్న నరకాన్ని పోగొడతావా చెప్పు ఇప్పుడు సంజయ్సులు చెప్పి ఏం ప్రయోజనం నీలాంటి మంచి అమ్మాయిని నాకల్లారా చూడలేకపోతున్నానే అని ఇంతకు ముందు చాలా సార్లు బాధపడ్డాను కానీ ఒక రకంగా నాకు చూపు లేకపోవడం మంచిది అనిపిస్తుంది నన్ను ఇంతలా మోసం చేసిన నీ మొహం చూడకుండా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అబద్ధాలు చెప్పి నమ్మించడం చాలా తప్పు గౌరీ నాకు అసహ్యం వేస్తుంది ఒక మనిషి మీద కోపం వస్తే ఎప్పుడో ఒకప్పుడు పోతుంది కానీ ఒక మనిషి మీద అసహ్యం వేస్తే జీవితాంతం అలాగే ఉండిపోతుంది నీ మీద నాకు అలాంటి అసహ్యమే ఉంది ఇద్దరు మనుషులు లైఫ్ లాంగ్ హ్యాపీగా కలిసి ఉండాలంటే నమ్మకం ఉండాలన్నదే నా నమ్మకం నా నమ్మకంలో నువ్వు ఓడిపోయావు నా మనసులో భార్య స్థానాన్ని కోల్పోయావు నా ప్రేమను వాడుకొని నా తమ్ముడు జీవితాంతం బాధపడడానికి కారణమైన నిన్ను ఈ జన్మలో క్షమించను నిన్ను నా భార్యగా చూడను అని ఈశ్వర్ అంటాడు.

ఏవండీ మీరు అలా అనకండి ఒక్కసారి నేను చెప్పేది వినండి అని మళ్ళీ మళ్ళీ గౌరీ అడుగుతుంది.మాట్లాడకు ఇంతకు మించి నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకు ఇంతకు ముందు నువ్వు మాట్లాడుతుంటే చాలా ఆనందంగా అనిపించేది కానీ ఇప్పుడు చాలా కంపరంగా ఉంది చూడు నాకు అబద్దాలు చెప్పే వాళ్ళు అంటే చిరాకు మోసం చేసే వాళ్ళు అంటే అసహ్యం అలాంటి వాళ్లని నా కళ్ళ ముందు ఒక్క క్షణం కూడా ఉంచను కానీ నిన్ను ఎందుకు ఊరుకున్నాను తెలుసా మా అమ్మ కోసం నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటానని అనుకుంటుంది ఈ విషయం తెలిస్తే మా అమ్మ తట్టుకోలేదు కానీ నలుగురి మధ్యలో మనం భార్యాభర్తలం కానీ నాలుగు గోడల మధ్య మనం అపరిచితులం అని ఈశ్వర్ అంటాడు.

ఆ మాటలు విన్న గౌరీ ఏడుస్తూ కుమిలిపోతుంది.గౌరీ ఏడుస్తుండగా ఈశ్వర్ మాత్రం తల దిండు తీసుకొని వెళ్ళిపోతూ గౌరితో ఇలా అంటాడు మా అమ్మ కోసం మనం భార్యాభర్తలాగా నటించాలి అర్థమైందా అని ఈశ్వర్ తలగడ నేల మీద వేసుకొని పడుకుంటాడు.కానీ గౌరీ మాత్రం అలాగే ఏడుస్తూ ఉండి పోతుంది.కట్ చేస్తే అఖిల శోభనం గదిలో కూర్చుని స్వీట్లన్ని ఎంత బాగున్నాయో అనుకుంటూ స్వీట్లు అన్ని మెక్కుతుంది స్వీట్లు తింటూ అఖిల పాల గ్లాస్ తీసి అమ్మో మా అమ్మ ఇద్దరినీ తాగమన్నది కానీ ఆదిత్య బాత్రూం వెళ్లి మూడు గంటలు అయింది ఇంకా రాలేదు దగ్గరికి వెళ్లి ఏవండీ అని పిలుస్తుంది ఎంతసేపు బాత్రూం వెళ్తారండి రండి నీకు మలబద్దకం అనే రోగం ఏమన్నా ఉందా ఇంతసేపు రావట్లేదు అని అఖిల పిలుస్తుంది.అలాంటిది ఏమీ లేదు అని ఆదిత్య బయటికి పరిగెత్తుకుంటూ వస్తాడు.

మీరు రండి అని అఖిల తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి ఈ పాలు మీరు సగం తాగి మిగిలిన సగం నాకు ఇవ్వండి చెరి సగం పంచుకోవాలి అంట అని అమ్మ చెప్పింది అని అఖిల అంటుంది.నాకొద్దు అని ఆదిత్య అంటాడు.అదేం కుదరదు మీరు తాగాల్సిందే అని అఖిల ఆదిత్య చేత సగం పాలు తాగించి తాను సగం తాగేస్తుంది ఏవండీ అని అఖిల ఆదిత్య చెయ్యిని పట్టుకుంటుంది. దానితో ఆదిత్య చిరాకు పడి లేచి తలగడ తీసుకొని వెళ్లి కింద పడుకుంటాడు.కట్ చేస్తే ఇంతలో తెల్లవారింది ఈశ్వర్ బయట కూర్చుని గౌరీ నువ్వు నన్ను ఇంత దారుణంగా మోసం చేసావంటే నమ్మలేకపోతున్నాను గౌరీ అనుకుంటూ బాధపడతాడు నేను ఈ బాధను భరించలేకపోతున్నాను జీవితాంతం ఎలా కలిసి ఉండగలం అని ఈశ్వర్ పరి పరి విధాల ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటాడు ఇంతలో వాళ్ళ అమ్మ వస్తుంది ఈశ్వర్ ఏంటి నాన్న ఇక్కడ కూర్చున్నావు అని వాళ్ళ అమ్మ అడుగుతుంది నా సంగతి సరే అమ్మ నువ్వేంటి ఇంత పొద్దుగాల లేచావు అని ఈశ్వర్ అంటాడు.నా సంగతి పక్కన పెట్టు నాన్న నువ్వేంటి ఇంత పొద్దున్నే నిద్ర లేచి ఒంటరిగా కూర్చున్నావు అని వాళ్ళ అమ్మ మళ్లీ అడిగింది.

అదేమీ లేదమ్మా లోపల ఉక్కపోతలా ఉంటే ఇలా బయటకి వచ్చి కూర్చున్నాను ఎవరో నన్ను వెనక పట్టుకొని లాగేసినంత బాధ అనిపించింది అందుకే ఇలా చల్లగాలికి వచ్చి బయట కూర్చున్నాను అని ఈశ్వర్ అంటాడు.అదేమీ లేదు నాన్న నీకు చిన్నప్పటినుంచి ఏసి లో ఉన్నావు కదా ఈ వాతావరణం తట్టుకోలేవు అని వాళ్ళ అమ్మ అంటుంది.తప్పదమ్మా పరిస్థితులకు అనుగుణంగా తట్టుకోవాలి అని ఈశ్వర్ అంటాడు ఇదంతా దూరం నుంచి చూస్తున్న గౌరీ ఇలా అనుకుంటుంది.

నిజం చెప్పలేదని నా మీద కోపం చూపిస్తారు అనుకున్నాను కానీ భార్యని కాదని నన్ను ద్వేషిస్తాడని అనుకోలేదమ్మా అమ్మ ఇది నేను కాదనలేనని కష్టం నా అంతట నేనే గెలవాల్సిన యుద్ధం కానీ నా బాధంతా ఒక్కటే అమ్మ ఆయన బాధలో నుంచి బయట పడి సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాను నువ్వు నాకు అండగా ఉండి నన్ను గెలిపించమ్మా అని అమ్మవారిని వేడుకుంటుంది గౌరీ.దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మళ్ళీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం