Krishnamma Kalipindi Iddarini ఆగస్టు 16 ఎపిసోడ్ 86: కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ ఈ రోజు ఎపిసోడ్ ఇలా మొదలవుతుంది… నావన్నీ పాతకాలపు చింతకాయ మాటలు అన్నావు కానీ ఇప్పుడు ఏమైంది చూడు అని సౌదామని అంటుంది. ఇప్పుడు ఏమైంది నా ప్లాన్ కి అని ఉజ్వల అంటుంది. ఇంకా ఏమైంది అని అంటావేంటి వాళ్ల మధ్య దూరం ఉందో లేదో అని తెలుసుకోవడానికి ఫ్రూట్స్ తినిపించుకోవాలని అన్నావు కానీ వాళ్లు ప్రేమగా ఫ్రూట్స్ తినిపించుకుంటుంటే నాకైతే వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదని అనిపిస్తుంది అని సౌదామిని అంటుంది.మమ్మీ నేను వేసిన ప్లాన్ కి మనకు మంచి బ్రహ్మాండమైన ఉపాయం దొరికింది గౌరీ ఈశ్వరుల మధ్య ఉన్న అబేదాన్ని పెంచుతాను అక్కాచెల్లెళ్ల కాపురాన్ని బూడిది అయ్యేలా చేస్తాను అక్క చెల్లెలు ఇద్దరినీ ఇంట్లో నుంచి తరిమేసి నేను ఆదిత్య పెళ్ళాన్ని అయిపోయి ఈ ఇంట్లో చక్రం తిప్పాలని నేను అనుకుంటున్నాను అని ఉజ్వల అంటుంది.

ఇంతలో వాళ్ళ మామయ్య అత్తయ్య అక్కడికి వచ్చి ఏంటి ఉజ్వల దేని గురించి బలంగా నిర్ణయం తీసుకున్నాను అని అంటున్నావు అని అడిగింది సునంద. అంటే అదేమీ లేదు వదినా మనల్ని దగ్గరికి తీసిన అత్తయ్య మామయ్యలకి మనం రుణపడి ఉందాం అని అంటుంది ఉజ్వల అని సౌదామిని అంటుంది.మీలో వచ్చిన ఈ మార్పు కి చాలా సంతోషంగా ఉందమ్మా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. సౌదామిని పిల్లల పెళ్లి విషయంలో గొడవలు జరుగుతుండగా నీకు చీర పెట్టలేకపోయాను కానీ ఇప్పుడు పెడుతున్నాను ఈ చీర తీసుకో అమ్మ అని ఇస్తుంది సునంద ఉజ్వల నువ్వు నా కూతురు లాంటి దానివే నీకు ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని సునంద అంటుంది.

అత్తయ్య మామయ్యలా ఆశీర్వాదం తీసుకో ఉజ్వల అని సౌదామిని అంటుంది. చల్లగా ఉండమ్మా అని ఆశీర్వదించి అక్కడ నుండి వెళ్ళిపోతారు సునంద వాళ్ళ ఆయన. నువ్వు నాకు పెళ్లి చేయడం కాదు నేనే నీ కోడల్ని అవుతాను చూస్తూ ఉండు అని ఉజ్వల మనసులు అనుకుంటుంది. కట్ చేస్తే చూస్తుంటే ఆదిత్య అఖిలలు సంతోషంగానే ఉన్నట్టు అనిపిస్తుంది సంతోషంగా ఉన్నారా లేదంటే మాలాగే నటిస్తున్నారా అని గౌరీ అనుకుంటుంది.నాకు ముందే ఆ విషయం తెలిస్తే రోజు ఎంతో కొంత వాన్ని ఓదారుస్తూ ఉండేవాన్ని కానీ గౌరీ చెప్పిన అబద్ధం వల్ల నాకు నా తమ్ముని ఓదార్చే అవకాశం లేకుండా పోయింది వాడిలో వాడు ఇంకా ఇంకా బాధ పడడానికి కారణం అయ్యింది ఆ గౌరీ అని ఈశ్వర్ అంటాడు. అఖిల ఆదిత్య సంతోషంగా ఉంటే ఆయన కొంత అయినా సంతోషంగా ఉంటాడు వాళ్ల మధ్య అన్యోన్యత ఉందో లేదో ముందు అఖిలని అడిగి తెలుసుకోవాలి అని గౌరీ అనుకుంటుంది. ఇద్దరూ అనుకోని ఎదురుపడతారు గౌరీ చూసుకోకుండా ఈశ్వర్ నీ గుద్దుతుంది.

నువ్వు కావాలనే నన్ను గుద్ధావు ఇంకేం నాకు చెప్పకు అని ఈశ్వర్ అంటాడు. ఏవండీ కావాలని నేను ఎందుకు గుద్దుతానండి నన్ను నమ్మండి అని గౌరీ అంటుంది. మోసం చేశానని బిడియం లేకుండా ఇంకా నాకే ఎదురు చెబుతావా అని ఈశ్వర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నన్ను దూరం పెట్టి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటున్నారు మన ఇద్దరి మధ్య ఈ దూరం ఎప్పటికీ పోతుందో అని గౌరీ అనుకుంటుంది. కట్ చేస్తే నేను ఇంటికి కోడల్ని అయిన తర్వాత చేయాలని అనుకున్నదేంటి చేస్తున్నదేంటి గౌరీని ఇంటికి పనిమనిషిని చేసి నేను మహారాణిని అవుదామనుకున్నాను కదా కానీ మొగుడు పెళ్ళాలు ఇద్దరు సంతోషంగా ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాను నా మొగుడు ఏమో నాకు దూరంగా ఉన్నాడని ఏడుస్తున్నాను ఛీ ఎదవ జీవితం అని అఖిల అనుకుంటుంది.

అఖిల అంటూ గౌరీ అక్కడికి వస్తుంది అఖిల ఏం చేస్తున్నావు అని గౌరీ అడిగింది. కురుక్షేత్ర యుద్ధంలో కాలు విరగొట్టుకొని వచ్చాను ఇప్పుడే అని అఖిల అంటుంది. పెళ్లయిన కొత్తజంట ఎలా ఉంది అని తెలుసుకుందామని నేను వస్తే నువ్వు వెటకారంగా మాట్లాడతావ్ ఏంటి అని గౌరీ అంటుంది. అవును నేను ఇంటికి కోడలు మహారాణి అవుదాం అనుకుంటే అది చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నట్టు ఉన్నావ్ అని అఖిల అంటుంది.ఏంటి అఖిల ఆ మాటలు నువ్వు నా చెల్లెలివి నీ జీవితం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని నేను ప్రతిక్షణం కోరుకుంటాను నీకు ఏదైనా కష్టం వస్తే నేను తల్లడిల్లి పోతాను నీ బాధ్యతలన్ని అమ్మ నాకు అప్పగించింది నువ్వు ఇక్కడ సంతోషంగా ఉన్నావా లేదా నీ భర్త తోటి సుఖంగా ఉన్నావా లేదా అని తెలుసుకోవడం నా బాధ్యత చెప్పు అఖిల మీరిద్దరూ అన్యోన్యంగా ఉన్నారా ఆదిత్య నీతో ప్రేమగా మాట్లాడుతున్నాడా అని గౌరీ అడిగింది.

చాలా సంతోషంగా మాట్లాడుతున్నాడు అంతేకాదు తను నన్ను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండడం లేదు మా ఆయన నా మీద చూపించే ప్రేమతో తడిసి ముద్దయిపోతున్నాం అనుకో అని అఖిల అంటుంది. అఖిల నీకు ఎలాంటి కష్టం వచ్చినా నాకు చెప్పు సరేనా అని గౌరీ వెళ్ళిపోతుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే నాది నేనే చూసుకుంటాను నీకెందుకు చెబుతానే అని అఖిల మనసులు అనుకుంటుంది. హమ్మయ్య ఆదిత్య సంతోషంగా ఉన్నాడనే మా ఆయనకు తెలిస్తే నన్ను కూడా ద్వేషించడు అప్పుడు ఆయనకు నేను అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తనకి నచ్చ చెబుతాను అని గౌరీ అనుకుంటుంది. కట్ చేస్తే అటు అమృతను మర్చిపోలేక పోతున్నాను ఇటు అఖిలతో జీవితాన్ని పంచుకోలేకపోతున్నాను ఈ నరకం ఏంటో నాకు అర్థం కావడం లేదు అసలు నా లైఫ్ ఏంటో నాకు అంతకన్నా అర్థం కావట్లేదు అని ఆదిత్య అనుకుంటాడు.

ఆదిత్య అనుకుంటూ ఈశ్వర్ అక్కడికి వస్తాడు అమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పింది అందుకే నేను వెతుక్కుంటూ వచ్చాను రా అని ఈశ్వర్ అంటాడు. నన్ను వెతుక్కుంటూ వచ్చావా ఎందుకు అన్నయ్య అని ఆదిత్య అంటాడు.ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నావురా అని ఈశ్వర్ అంటాడు. ఏమీ లేదు అన్నయ్య జీవితం గురించి భయం వేస్తుంది అని ఆదిత్య అంటాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.