Kirshnamma Kalipindi Iddarini సెప్టెంబర్ 11: నేను ఈ దొంగతనం చేయలేదని అఖిల అంటుంది.అఖిల నువ్వే దొంగతనం చేసావని మీ బావగారు ఆదిత్య నమ్ముతున్నారు నేను అడిగినప్పుడే చెబితే బాగుండేది కదా అని గౌరీ అంటుంది.ఇంత గొప్ప ఇంటికి కోడలు కావాలన్నదే నా కోరిక అంతేకానీ దొంగతనం చేసి ఈ ఇంటి నుండి నేనే ఎందుకు దూరమైపోతాను ఇంత చెప్పినా మీరు నమ్మట్లేదు కాబట్టి అమ్మ మీద ఒట్టు నేను ఈ దొంగతనం చేయలేదు అక్క అని అఖిల అంటుంది నోరు ముయ్ నువ్వే దొంగతనం చేసావని వాళ్ళు అంటున్నారు అని గౌరీ అంటుంది.

అయ్యో భగవంతుడా నేను ఈ దొంగతనం చేయలేదని నెత్తి నోరేసి మొత్తుకుంటున్నా మీరు నమ్మట్లేదు కదా నా తాళి బొట్టు మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను ఈ దొంగతనం నేను చెయ్యలేదు అక్క అసలు దాని గురించి నాకు అసలు ఏమీ తెలియదు అని అఖిల అక్కడి నుండి వెళ్ళిపోతుంది.అయితే మరి ఈ దొంగతనం ఎవరు చేసి ఉంటారు మా మీద ఈ దొంగతనం మోపి మమ్మల్ని దొంగలుగా చేయాలనుకున్న వారు ఎవరు అని గౌరీ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అఖిల రూపంలో ఒక ఉంగరం దొరుకుతుంది ఇది ఎవరిది అని చూస్తుంది ఇది అత్తయ్యది కాదు మామయ్యది కాదు ఇంట్లో ఎవరిది కాదు అని ఆలోచిస్తుంది గౌరీ. కట్ చేస్తే అమ్మ ఈశ్వరి ఏంటి ఇలా షాక్ ఇచ్చాడు మనం ఒకటి చేద్దాము అనుకుంటే ఈశ్వర్ ఒకటి చేశాడు అని ఉజ్వల అంటుంది.

సౌదామిని మాత్రం అవేవీ పట్టించుకోకుండా నా ఉంగరం ఎక్కడ పోయింది అని వెతుకుతుంది. అమ్మ నేను ఏం మాట్లాడుతున్నాను నువ్వేం చేస్తున్నావు నీకు అసలు బుద్ధుందా అని ఉజ్వల అంటుంది. మీరు వెతికే ఉంగరం ఇదేనా అని గౌరీ అడుగుతుంది. అవును గౌరీ ఈ ఉంగరం నాదే అని సౌదామిని తీసుకుని వేలు పెట్టుకుంటుంది. నగలు కొట్టేసి నా చెల్లెలు రూమ్ లో ఎందుకు పెట్టారు చెప్పండి అని గౌరీ అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ గౌరీ దొంగతనం చేయడం ఏంటి ఈశ్వర్ చెప్పాడు కదా నగలు తీశానని మమ్మల్ని తీశారు అంటావేంటి అని ఉజ్వల అంటుంది. అయితే ఇప్పుడే అత్తయ్య గారి దగ్గరికి వెళ్లి మీరు తీసారా ఇంకెవరు తీసారు అని తేలుద్దాం రండి అని గౌరీ అంటుంది నీకేమైనా పిచ్చి పట్టిందా గౌరీ ఆ నగలు నేనే తీసి దాచి పెట్టాను అని ఈశ్వర్ అన్నాక నువ్వు మమ్మల్ని దొంగలు చేస్తావ్ ఏంటి అని ఉజ్వల అంటుంది. మా ఆయన ఎందుకు అలా అన్నాడు నాకు చెప్పాడు కానీ మీరు ఎందుకు అలా చేశారో చెప్పండి అని గౌరీ అంటుంది.

చూడు గౌరీ ఆ నగలకు మాకు ఎటువంటి సంబంధం లేదు మేము అసలు తీయలేదు అని సౌదామిని అంటుంది. మీరే కావాలని ఆ నగలు తీసి మా చెల్లెలు మీద ఎందుకు నెట్టారో నాకు అర్థమైంది నగలు తరువాత లాకర్లో పెడదాంలే ఇప్పుడు తొందర ఏముంది అని అత్తయ్య అంటే మీరు మాత్రం ఇంకొక తాళం ఉంది కదా అత్తయ్య ఎందుకు ఎక్కడో పెట్టడం లాకర్లో పెట్టు అని పాటికి పది సార్లు మీరు రెచ్చగొట్టారు ఆ రోజు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థం అవుతుంది ఆ నగలు మీరే కొట్టేసి అఖిల రూమ్ లో పెట్టేసి అఖిలను దొంగను చేసి మా కాపురాలు కూల్ చేయాలని మీరు అనుకున్నారుకానీ నేను అలా జరగనివ్వను రండి అత్తయ్య గారు ముందే తేలుద్దాం ఎవరు కొట్టేశారు అని గౌరీ అంటుంది.

గౌరీ అలా తొందర పడతావ్ ఏంటి నీకు ఒకటి చూపిస్తాను అని ఈశ్వర్ గౌరీ మాట్లాడుకుంటుండగా వీడియో తీసింది చూపిస్తుంది మీరిద్దరూ అందరి ముందు ఎంతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తున్నారు గదిలో మాత్రం బద్ధ శత్రువులా ఉంటున్నారు అనేసంగతి మీ అత్తయ్యకు చెబుదాం పద అని ఉజ్వల అంటుంది. ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారు అని గౌరీ అడిగింది. ఎందుకంటే నా కూతురు ఉండాల్సిన స్థానంలో మీరు ఉన్నారు నా కూతురు అనుభవించాల్సిన జీవితాన్ని మీరు అనుభవిస్తున్నారు లేకపోతే మీ బతుకులేంటి మీరేంటి ఈ ఇంటికి కోడలు అయ్యి ఆనందంగా ఉంటుంటే నా కూతురు మాత్రం ఏడుస్తూ ఉండాలా అని సౌదామిని అంటుంది.చూడు పిన్ని నీ కూతురిని ఇంటికి కోడలు చేయాలని ఆశ ఉండడం తప్పు కాదు కానీ మా కాపురాలు కూల్ చేసి నీ కూతురు బాగుండాలి అనుకుంటే బాగోదు అని గౌరీ అంటుంది. ఉండు నీకు ఈశ్వర్ మధ్యల ద్వేషం పెరిగేలా చేసి మీ ఇద్దరి మధ్యన గొడవలు పెట్టి నిన్ను ఈశ్వర్ నుండి వేరుచేసి నేను ఈశ్వర్ ని పెళ్లి చేసుకుంటాను అని ఉజ్వల అంటుంది. అది ఈ జన్మలో జరగదు ఎందుకంటే నేను అంటే ఆయనకు ఎంతో ప్రాణం మా ఇద్దరినీ కలిపింది ఆ కృష్ణమ్మ ఆ కృష్ణమ్మ సాక్షిగా చెబుతున్నాను మీ కుట్రలు బయటపెట్టి మిమ్మల్ని మెడబట్టి బయటికి గెంటేసేలా చేస్తాను చూస్తూ ఉండండి అని గౌరీ అంటుంది.

అది నీ వల్ల కాదు నీ తాతలు ముత్తాతలు దిగివచ్చిన మేము ఈ ఇంట్లో నుంచి వెళ్ళాము నిన్నే బట్టి బయటికి గెంటేసేలా చేస్తాను చూడు అని ఉజ్వల అంటుంది.మీ ఆస్తులన్నీ పోగొట్టుకొని రోడ్డు మీద పడితే పోనీలే పాపం అనే అత్తయ్య వాళ్ళు ఆశ్రయమిస్తే మీరు మాత్రం కడుపులో కత్తులు గుండెల్లో విషాన్ని నింపుకొని తిరుగుతున్నారా ఇక మీదట నా భర్తని మార్చుకొని నేను నా భర్త ప్రేమగా ఉండాలి మీ కుట్రలు బయట పెట్టి మిమ్మల్ని ఈ ఇంట్లో నుండి వెళ్ళగొట్టి ఈ కుటుంబాన్ని కాపాడుకోవాలి అని గౌరీ అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది