Krishnamma Kalipindi Iddarini: గౌరీ నువ్వు కూడా రామ్మా ఈరోజు ఈశ్వర్ నువ్వు కలిసి ఒకే ఆకులో భోజనం చేయాలి అని సునంద అంటుంది. అలాగే అత్తయ్య అని గౌరీ వెళుతుండగా ఏంటి మమ్మీ దాన్ని చెడగొట్టాలని చూస్తే ఈరోజు ఏమో ఒకే ఆకులో భోజనం చేపిస్తారట వాళ్ళిద్దర్నీ దూరం చేయాలని మనం అనుకుంటుంటే వాళ్ళిద్దరూ దగ్గర అవటానికి కాలం అనుకూలిస్తుంది ఇదేంటి మమ్మీ అని ఉజ్వల అంటుంది. గౌరీ వెళ్ళిపోతూ మళ్లీ వెనుకకు వచ్చి ఏంటి పిన్ని గారు ఏవో మాట్లాడుకుంటున్నారు మీరు కూడా రండి భోజనం చేద్దురు మీరు ఎన్ని ఎత్తులు వేసినా నన్ను ఈశ్వర్ ని విడిగొట్టలేరు అని గౌరీ అక్కడనుండి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఒరేయ్ మనవడా నువ్వు ఒక్కడివే వచ్చావు మీ ఆవిడ ఏదిరా అని వాళ్ల నాయనమ్మఅంటుంది . ఇక్కడే ఉన్నాను తాతయ్య గారు అంటూ గౌరీ వస్తుంది.

ఈశ్వర్ మీరు ఇద్దరు ఒకే ఆకులో భోజనం చేయాలి రండి కూర్చోండి అని సునందా అంటుంది. మా ఏంటమ్మా ఇవన్నీ నాకు నచ్చదు అని ఈశ్వర్ అంటాడు. అది కాదు నాన్న ఇది ఆచారం ఇలా ఒకరికొకరు తినిపించుకుంటే మీ బంధం నూరేళ్లు కలకాలం ఇలాగే ఉంటుంది అనీ సునంద అంటుంది. అమ్మ ఆచారాలని చెప్పి ఇప్పటికే ఎన్నో చేయించారు ఇప్పుడు ఇది అవసరమా అని ఈశ్వర్ అంటాడు. ఒరేయ్ మనవడా సదాచారం వెనుక లా రొమాన్స్ కూడా ఉంది రా భార్యాభర్తలు అలా తినిపించుకుంటూ ఉంటే ఎంతో రొమాంటిక్ గా ఉంటుంది అని వాళ్ళ తాతయ్య అంటాడు. కట్ చేస్తే సౌదామిని గౌరీ ఈశ్వర్ కలిసి భోజనం చేస్తారా ఈ ఉప్పు వేసిన పాయసం తిని వాంతులు చేసుకోవాలి అది చూసి నేను ఆనందించాలి అని పాయసంలో ఉప్పు వేసి తీసుకువచ్చి వాళ్లకి వడ్డిస్తుంది. గౌరీ ముందు నువ్వు ఈశ్వర్ కి తినిపించు అని వాళ్ల అత్తయ్య అంటుంది. బామ్మ గారు కొత్తగా పెళ్లయింది వాళ్ళిద్దరికేనా మాకు కాలేదా వాళ్ళిద్దరే తినిపించుకోవాలా మేము తినిపించుకోకూడదు అని అఖిల అంటుంది.

అదేమిటమ్మా రెండు ఆకులు వేసింది మీ ఇద్దరి కోసమే నీకు కాస్త తొందర ఎక్కువే అఖిల అని వాళ్ళ బామ్మ అంటుంది. చూశాను కానీ మీరు నవ్వుకుంటారని అలా మాట్లాడాను బామ్మా అని అఖిల నవ్వుతుంది. గౌరీ మొదటి ముద్దా ఈశ్వర్ కు పెట్టమ్మా అని సౌదామిని అంటుంది. పిన్ని గారు నిన్ను చూస్తుంటే మా అమ్మ గుర్తుకు వస్తుంది మా అమ్మలాగే మీరు మా కోసం పాయసం కష్టపడి వండుకొచ్చారు మొదటి ముద్ద మీరు తినండి పిన్ని గారు అని గౌరీ అంటుంది. వద్దులేమ్మా ఇది మీరు ఇద్దరు తినవలసిన ఆచారం నాకు వద్దు ఇంకెప్పుడైనా పెడుదువు గానిలే అని సౌదామని అంటుంది. లేదు పిన్ని గారు మీరు ఇంత ప్రేమగా తీసుకు వచ్చాక నేను మిమ్మల్ని కాదని ఆయనకి ఎలా పెడతాను మొదటి ముద్దు మీరు తినాల్సిందే అని గౌరీ అంటుంది. సౌదామిని గౌరీ అంత ప్రేమగా అంటుంటే ఒక ముద్ద తినొచ్చు కదా అని సునంద అంటుంది. గౌరీ పాయసం తీసి సౌదామిని నోట్లో పెడుతుంది మింగలేక కక్కలేక అలాగే నోట్లో ఉంచుకుంటుంది ఉజ్వల నువ్వు నా చెల్లెలు లాంటి దానివే రా నీకు కూడా ఒక ముద్ద పెడతాను అని గౌరీ ఉజ్వలకు కూడా ముద్దు పెడుతుంది చాలు అని ఉజ్వల అంటుంది ఇదొక్కటే ముద్దా ఉజ్వల ఇదొక్కటే తిను అని మళ్లీ మళ్లీ పడుతుంది గౌరీ.

ఆ ఉప్పు ఉన్న పాయసం మింగలేక బయటికి వెళ్లి వాంతులు చేసుకుంటారు. ఇదేంటి పాయసం తినగానే వాళ్ళు వాంతులు చేసుకుంటున్నారు అని సున్నందా ఆ పాయసం టేస్ట్ చూస్తుంది ఇందులో ఉప్పుందే అంటే సౌదామిని ఇంకా వంట నేర్చుకోవాలి అని వాళ్ళ అమ్మ అంటుంది.గౌరీ పాయసం పక్కన పెట్టి ఈశ్వర్ కి అన్నం తినిపించు అని వాళ్ళ అత్తయ్య అంటుంది. అలాగే అత్తయ్య అని ఈశ్వర్ కి గౌరీ అన్నం పెడుతుంది ఈశ్వర్ గౌరీ కి పెడతాడు అలా ఒకరికి ఒకరు అన్నం తినిపించుకున్నాక గౌరీ బయటికి వెళ్లి మంచినీళ్లు కావాలా పిన్ని గారు అని అడుగుతుంది. మాకు ఏమీ వద్దులే అని సౌదామని అంటుంది. నేను మీలాగా కొంపలు కూల్చే మనస్తత్వం కాదులే ధైర్యంగా తాగండి కానీ పిన్ని గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది మీరు ఇలా ఉంటారని నాకు తెలిసిపోయాక మీరు వండుకొచ్చిన పాయసం నేను ఈశ్వర్ కి తినిపిస్తానని మీరు ఎలా అనుకున్నారు ఇకమీదట మీరు వేసే ప్లాన్లు అన్నింటిని అడ్డుకుంటాను మా మూడుముళ్ల బంధాన్ని కాపాడుకుంటాను మీ కుట్రలన్నీ బయట పెడతాను పిన్ని గారు మా ఊళ్లో ఒక సామెత చెప్పుకుంటారు చెడపకురా చెడేవు అని మీ వేలుతో మీ కంట్లోనే పొడిచిన మీకు ఇంకా బుద్ధి రాలేదా అని గౌరీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

చూసావా మమ్మీ మనం చేసిన పాయసం మనతోటే తినిపించి మనమే వాంతులు చేసుకునేలా ఆ గౌరీ చేసింది దాన్ని ఊరికే వదిలి పెట్టకూడదు అని ఉజ్వల అంటుంది.కట్ చేస్తే సౌదామిని గౌరీని ఏం చేయాలా అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంది. ఉజ్వల మమ్మీ మమ్మీ అని పిలుస్తుంది ఏంటి మమ్మీ ఆ గౌరీ ఇచ్చిన షాక్ కి మైండ్ గాని పోయిందా ఏమి మాట్లాడట్లేదు అని ఉజ్వల అంటుంది. అది ఏమి కాదు బేబీ ఆ గౌరీని దెబ్బ కొడితే ఆ దెబ్బకి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఈశ్వర్ ని ఎలా కాపాడుకోవాలా అని టెన్షన్ తో చచ్చిపోవాలి వేస్తే అలాంటి ప్లాన్ వేయాలి బేబీ ఇప్పుడు ప్లాను నేను వేస్తాను చూడు అది ఈ జన్మలో కోలుకోదు అని సౌదామిని అంటుంది. ఏంటి మమ్మీ ఆ ప్లాను నాకు చెప్పొచ్చు కదా అని ఉజ్వల అంటుంది.