బాలీవుడ్ ఆఫ‌ర్ల‌ను చేతులారా వ‌దులుకుంటున్న కృతి శెట్టి.. కార‌ణం అదేన‌ట‌!

Share

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ఎలాంటి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఉప్పెన‌` మూవీతో గ్రాండ్‌గా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ‌.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ వ‌రుస అవ‌కాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. అయితే ఈ బ్యూటీకి బాలీవుడ్ నుండి కూడా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ట‌.కానీ, కృతి శెట్టి వాటిని చేతులారా వ‌దులుకుంటోంద‌ట‌. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా వెల్ల‌డించింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కృతి శెట్టి త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజకవర్గం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న విష‌యం తెలిసిందే. నితిన్ హీరోగా ఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది.

ఇందులో కృతి శెట్టితో పాటు కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్‌గా న‌టించింది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగ‌స్టు 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా కృతి శెట్టి ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. సినిమా చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంద‌ని, పొలిటికల్ టచ్ తో పాటు మంచి సాంగ్స్ కామెడీ యాక్షన్ అన్నీ ప్యాకేజీగా ఉంటాయ‌ని, ప్రేక్ష‌కులకు ఖ‌చ్చితంగా న‌చ్చుతుంద‌ని చెప్పుకొచ్చింది.

అలాగే త‌న‌లోని ప్రతిభని గుర్తించి అవకాశాలు ఇస్తున్న దర్శక నిర్మాత లకు కృతజ్ఞతలు తెలిపింది. ఇక బాలీవుడ్ నుండి కూడా ఆఫ‌ర్లు వచ్చాయ‌ని, కానీ చేసే ఆలోచన లేద‌ని స్ప‌ష్టం చేసిన కృతి.. అందుకు కార‌ణాన్ని కూడా వెల్ల‌డించింది. తెలుగు, తమిళ్ పరిశ్రమల్లో మంచి ఆదరణ లభిస్తోంద‌ని, ఇక్కడ సినిమాలు చేయడమే తాన‌కు ఆనందాన్ని ఇస్తుంద‌ని, అందుకే బాలీవుడ్ వైపు చూడ‌టం లేదంటూ పేర్కొంది.


Share

Recent Posts

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

37 mins ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

1 hour ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

2 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

4 hours ago

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం .. ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…

5 hours ago