NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

Kriti Sanon: టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చిన ముద్దుగుమ్మల్లో కృతి స‌న‌న్ ఒకటి. న్యూఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించిన కృతి సనన్.. స్టడీస్ అనంతరం మోడలింగ్ లోకి ప్రవేశించింది. 2014లో తెలుగు యాక్షన్ మూవీ 1: నేనొక్కడినే చిత్రంతో హీరోయిన్ గా త‌న‌ నటన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడిగా కృతి సనన్ నటించింది. అయితే సుకుమార్ డైరెక్టర్ చేసిన 1: నేనొక్కడినే చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

ఈ సినిమా తర్వాత కృతి స‌న‌న్‌ తెలుగులో పెద్దగా కనిపించలేదు. హీరోపంతి సినిమాతో 2014లో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కృతి సనన్.. తనదైన ప్రతిభ, గ్లామర్ తో ఉత్తరాది పరిశ్రమలో నిలదొక్కుకుంది. స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. వరస సినిమాలు చేస్తూ కెరీర్ ను పరుగులు పెట్టిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న బిజీ హీరోయిన్స్ లో కృతి సనన్ ఒకటి. నటనతో పాటు కృతి సనన్ సొంతంగా దుస్తుల బ్రాండ్‌, ఫిట్‌నెస్ కంపెనీ మరియు చర్మ సంరక్షణ బ్రాండ్‌ను ప్రారంభించింది. అలాగే అనేక బ్రాండ్లు మరియు ఉత్పత్తులకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. మ‌రోవైపు నిర్మాత‌గా కూడా స‌త్తా చాటుతున్న‌ కృతి సనన్.. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్తకు ఎటువంటి క్వాలిటీస్ ఉండాలో వివరించింది.

కృతి స‌న‌న్ మాట్లాడుతూ.. `నాకు కాబోయే భర్త నాతో ఎంతో నిజాయితీగా ఉండాలి. నన్ను ఎప్పుడు నవ్విస్తుండాలి. నన్ను, నేను చేసే పనిని గౌరవించాలి. నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం నన్ను బాగా చూసుకోవాలి. అలా అని అన్ని విషయాల్లో నాతో సరితూగాలనే కోరిక మాత్రం నాకు లేదు` అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటానని ఆమె పేర్కొంది. దీంతో కృతి సనన్ కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

కాగా, గతంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్‌ ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఓం ర‌నౌత్ డైరెక్ట్ చేసిన ఆదిపురుష్ చిత్రంలో ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన‌ పాత్రలు పోషించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏర్ప‌డ్డ‌ వీరి పరిచయం ప్రేమగా మారిందని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ చివరకు ఆ వార్తలు పుకార్లుగానే మిగిలాయి. అలాగే ఇటీవల లండన్ కు చెందిన కబీర్ బహియాతో అనే వ్యాపారవేత్తతో కలిసి కృతి స‌న‌న్ కనిపించింది. దాంతో క‌బీర్‌, కృతి స‌న‌న్ రిలేషన్ లో ఉన్నార‌ని.. సదరు వ్యాపారవేతతో కృతి ఏడడుగులు వేయ‌డం ఖాయ‌మ‌నే టాక్ మొద‌లైంది. అయితే ఇంతవరకు ఈ విష‌యంపై ఎటువంటి స్పష్టత రాలేదు.

ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. రీసెంట్ గా క్రూ అనే మూవీతో కృతి స‌న‌న్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. రాజేష్ ఎ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టబు, కరీనా కపూర్ ఖాన్ మరియు కృతి సనన్ ఎయిర్ హోస్టెస్‌లుగా ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. మార్చి 29న రిలీజ్ అయిన క్రూ మంచి విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం కృతి స‌న‌న్ బాలీవుడ్ లో ప‌లు క్రేజీ ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉంది.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N