Krithi Shetty: యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అక్కర్లేదు. `ఉప్పెన` వంటి బ్లాక్ బస్టర్ మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. అనతి కాలంలోనే క్రేజీ హీరోయిన్గా ముద్ర వేయించుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తున్న కృతి శెట్టి.. మరి కొద్ది రోజుల్లో `ది వారియర్` ద్వారా ప్రేక్షకులను పలకరించబోతోంది.
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కోలీవుడ్ డైరెక్టర్ ఎన్.లింగుసామి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న బైలింగ్వల్ మూవీ ఇది. కర్నూలు నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తే.. ఆయన ఢీ కొట్టే విలన్ పాత్రను ఆది పినిశెట్టి పోషించాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా కృతి శెట్టి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను ఆమె షేర్ చేసుకుంది. అలాగే హీరో రామ్ వల్ల బాగా నెర్వస్ అయ్యానంటూ కూడా ఓపెన్ అయింది. అసలేమైందంటే.. ఇంటర్వ్యూలో `బుల్లెట్..` సాంగ్ గురించి ప్రస్తావన వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ.. `బుల్లెట్..` సాంగ్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు నేను నెర్వస్ ఫీలయ్యాను.
అందుకు కారణం రామ్ గారే. ఆయన ఎనర్జీ మ్యాచ్ చేయాలి అంటే నాకు ఎనర్జీ కావాలి. కానీ, షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫ్లో లో వెళ్ళిపోయింది అనిపించింది. ఎంజాయ్ చేస్తూనే ఆ సాంగ్ చేశాను. ‘బుల్లెట్…’ సాంగ్ క్లాస్ అయితే, ‘విజిల్…’ సాంగ్ మాస్. నాకు ఎక్స్ట్రా ఎనర్జీ కావాలని అనుకున్నప్పుడు విజిల్ సాంగ్ పెట్టుకుని డాన్స్ చేస్తుంటాను. ‘బుల్లెట్…’ సాంగ్ స్టైలిష్ గా ఉంటుంది. అలాగే ఈ పాటలకు ముందు వచ్చే సీన్స్ కూడా బాగుంటాయి.` అంటూ చెప్పుకొచ్చింది.