NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

Kumkuma Puvvu Today Episode April 24 2024 Episode 2163 highlights

Kumkuma Puvvu : గీత అయితే నువ్వు ఆ పల్లెటూరికి వెళ్లి వెతకవే అక్కడ ఏమైనా ఆధారం దొరుకుతుందేమో అని అంటుంది. ఆశ అలాగే ఈ రోజే వెళతాను అంటూ దాచినపల్లి గ్రామానికి బయలుదేరుతుంది ఆశ.దాచిన పల్లికి చేరుకుంటుంది ఆశ మనసులో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నన్ను ఎందుకు ఇక్కడికి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారో తెలుసుకోవాలి అనుకుంటూ అంతా తిరుగుతుంది ఆశ.

Kumkuma Puvvu Today Episode April 24 2024 Episode 2163 highlights
Kumkuma Puvvu Today Episode April 24 2024 Episode 2163 highlights

శాంభవి ఫంక్షన్ అయిపోయిన తర్వాత సోఫాలో కూర్చొని అమ్మయ్య ఏది ఏమైతేనే అంజలి నా ఇంటి కోడలు కాబోతుంది నా తరువాత నా అంత తెలివితేటలు ఉన్న అంజలి ఇంటికి కోడలిగా వస్తుంది ఇక ఆ జయచంద్ర వారసులు ఎవరు వచ్చినా ఇద్దరము కలిసి వాళ్ళని ఇక్కడి నుండి తరిమేస్థాo ఇక ఈ కోటకు రానిని నేనే అవుతా అనుకుంటూ ఉంటుంది శాంభవి. అఖిల సోఫా లో ఉన్న శాంభవి ఫోను తీసుకువచ్చి అమ్మ నువ్వు ఫోను అక్కడ సోఫాలో పెట్టేసి మర్చిపోయావు ఇదిగో అంటూ ఇచ్చి వెళ్తుంది శాంభవి. శాంభవి ఫోన్ లాక్ తీసి చూస్తుంది ఐదు మిస్డ్ కాల్స్ ఉంటాయి ఈ ట్రస్ట్ మెంబర్ ఏంటి ఎన్నిసార్లు చేశాడు ఏదైనా ముఖ్యమైన పని ఉందా ఏంటి అనుకొని ట్రస్ట్ మెంబర్ కి ఫోన్ చేస్తుంది శాంభవి. ఆ ట్రస్ట్ మెంబర్ ఫోన్ ఎత్తుతాడు. శాంభవి ఏంటి ఏం జరిగింది ఎన్నిసార్లు ఫోన్ చేశావు అని అడుగుతుంది

Kumkuma Puvvu Today Episode April 24 2024 Episode 2163 highlights
Kumkuma Puvvu Today Episode April 24 2024 Episode 2163 highlights

ట్రస్ట్ మెంబర్ అమ్మ శాంభవి గారు మనం జై చంద్ర గారి వారసుల కోసం వెతుకుతున్నాము కదా ఆ రోజు కిడ్నాప్ చేస్తే పారిపోయిన అమ్మాయి మళ్లీ ఈరోజు నాకు రోడ్డు మీద కనిపించింది. ఆ అమ్మాయిని పట్టుకున్నాను కానీ ఆ పిల్ల నా నుండి తప్పించుకొని వెళ్ళిపోయింది ఆ పిల్ల ఫోను నా చేతిలోనే ఉండిపోయింది ఫోన్ చూస్తే అందులో జై చంద్ర గారి వారసుల ఫోటోలు ఉన్నాయి అవి మీకు వాట్సప్ పంపించాను చూడండి అని అంటాడు ట్రస్ట్ మెంబర్. శాంభవి అవునా చాలా మంచి పని చేశారు ఇప్పుడే చూస్తాను ఆ ఫోటోలు నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ కట్ చేసి వాట్సప్ ఓపెన్ చేసి ఫోటోలు చూస్తుంది అందులో అమృత అరుణ్ కుమార్ కావేరి చంద్రం వాళ్ళ ఫొటోస్ ఉంటాయి అంటే ఇన్నాళ్లు నా దగ్గర టీచర్లుగా పని వాళ్ళ లాగా పని చేసిన వాళ్లే జై చంద్ర గారి వారసుల అంటే నన్ను నమ్మించి ఇంత మోసం చేస్తారా ఇప్పుడే వాళ్ళని కాల్చిపడేస్తాను అంటూ తుపాకీ పట్టుకొని బయలుదేరుతుంది శాంభవి.

Kumkuma Puvvu Today Episode April 24 2024 Episode 2163 highlights
Kumkuma Puvvu Today Episode April 24 2024 Episode 2163 highlights

అప్పుడే అంజలి అక్కడికి వస్తుంది శాంభవి చేతిలో గన్నును చూసి శాంభవి గారు ఏంటి మీరు ఇంత ఆవేశంగా ఉన్నారు ఏం జరిగింది అని అడుగుతుంది శాంభవి తప్పుకు అంజలి మనము ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆ జై చంద్ర గారి వారసులు ఎవరో తెలిసిపోయింది ఇదిగో చూడు వాట్సాప్ లో నాకు లాయర్ పంపించాడు ఈ ఫోటోలు అమృత వాళ్ళు కావేరి వాళ్లే వీళ్లు ఎంత నాటకం మాడి నా దగ్గర పని వాళ్ళ లాగా చేరి మోసం చేశారు వీళ్ళని ఇప్పుడే కాల్చిపడేస్తాను నువ్వు తప్పుకో అంజలి అంటుంది శాంభవి.అంజలి ఫోనులో ఫోటోలు చూసి ఒక్కసారిగా శాఖ అయిపోయి ఓ దేవుడా అసలు ఏంటి ఇలా జరిగింది ఇప్పుడు ఏం చేసేది ఈ శాంభవి గారిని ఎలా ఆపేది అని మనసులో అనుకుంటూ శాంభవి గారు ఆగండి అలా చేస్తే చాలా పెద్ద తప్పు జరిగిపోతుంది ఎందుకంటే ఈ జై చంద్ర గారి వారసులు వీళ్లే ఉన్నారా లేదంటే వీళ్లకు పిల్లలు గిట్ల ఎవరైనా ఉన్నారేమో తెలుసుకొని అప్పుడు అందరినీ ఇక్కడికి పిలిపించి ఒకేసారి లేపేయొచ్చు నా మాట కాదని ఇప్పుడు మీరు ఇక్కడున్న వాళ్ళనే లేపేస్తే వాళ్ల వారసులు వచ్చి మీ మీద కేసు పెడతారు కోర్టు కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది నా మాట విని కొంత కొద్ది రోజుల వరకు ఓపిక పట్టండి దానికి పరిష్కారం ఏంటో నేను ఆలోచించి చెబుతాను అంటుంది అంజలి. శాంభవి అలాగే అంజలి నువ్వు చెప్పావు కాబట్టి ఆగిపోతున్నాను లేదంటే ఇప్పుడు వాళ్ళని కాల్చిపడేసే దాన్ని అంటుంది శాంభవి.

Kumkuma Puvvu Today Episode April 24 2024 Episode 2163 highlights
Kumkuma Puvvu Today Episode April 24 2024 Episode 2163 highlights

కట్ చేస్తే అంజలి పరుగెత్తుకుంటూ వెళ్లి అమృత వాళ్లను కావేరి వాళ్ళను పిలుస్తుంది.అమృత కావేరి వాళ్ళు బయటికి వస్తారు ఏంటి అంజలి ఏం జరిగింది ఎందుకు అలా అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతారు. అంజలి చెబుతానమ్మ చెబుతాను శాంభవికి మన గుట్టు మొత్తం తెలిసిపోయింది అని అంటుంది అంజలి. కావేరి అమృత వాళ్లు షాక్ అవుతారు. అరుణ్ కుమార్ అయితే నిజం తెలిసిపోతే శాంభవి గారు ఇప్పటికే ఇంటి మీదకి గొడవకు రావాలి కదా కానీ మమ్మల్ని ఇలా ఎందుకు వదిలేసింది అని అడుగుతాడు. అంజలి చెబుతాను నాన్న అది కూడా ఎందుకు వదిలేసిందంటే నేను ఇప్పుడేఆవిడ దగ్గరకు వెళ్లి ఇప్పుడే తొందరపడి వెళ్లొద్దు కొద్ది రోజులు ఆగండి అని చెప్పాను కాబట్టి వదిలేసింది టైం బాగుంది నా ఫోటో ఆ వాట్సప్ లో రాలేదు మీ ఫోటోలు శాంభవి గారి ఫోను కు వాట్సాప్ లో వచ్చాయి అవి పంపించింది ఎవరో అర్థం కావడం లేదు ఏది ఏమైతేనే మనం ఇకమీదట నుండి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కథ క్లైమాక్స్ కి వచ్చేసింది అంటుంది అంజలి.

Kumkuma Puvvu Today Episode April 24 2024 Episode 2163 highlights
Kumkuma Puvvu Today Episode April 24 2024 Episode 2163 highlights

కావేరి ఇంత జరిగాక మనం ఇంకా ఇక్కడే ఉంటే ఆ శాంభవి మనల్ని ఏం చేస్తుందో ఏమో అని అంటుంది. బంటి అవును మనము ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు మనకు ఈ ఆస్తి వద్దు అంతస్తు వద్దు మనం వెళ్ళిపోదాం పద అంజలి అంటాడు.అమృత అవునమ్మా అంజలి నేనే జయచంద్ర గారి వారసురాలిని అని నా కూతురువి నువ్వే అని ప్రకటించే లోపు మనల్ని ఆ శాంభవి ఏం చేస్తుందో ఇంత జరిగా క మనము ఇక్కడ ఉండకూడదు మనకు ఈ ఆస్తి అంతస్తు అవసరం లేదు మనం వెళ్ళిపోదాం పద అంజలి అంటుంది. అంజలి లేదమ్మా వెళ్లడానికి వీల్లేదు ఎందుకంటే ఈ ఆస్తి జై చంద్ర తాతయ్య గారిది దానికి వారసురాలివి నువ్వు కానీ ఈ ఆస్తిని తన సొంతం చేసుకోవాలని ఆ శాంభవి ఎన్ని కుట్రలు పన్నిన కానీ వాటన్నింటికి ముగింపు చెప్పే రోజు వచ్చింది ఇలా భయపడి వెళితే మనము జై చంద్ర గారి తాతయ్య ఆశయానికి అన్యాయం చేసిన వాళ్ళము అవుతాము అందుకే మనం వెళ్లకూడదు ఇక్కడే ఉండి ఏది ఏమైనా సరే ఆస్తిని మన చేతుల్లోకి రాబట్టుకోవాలి అంటుంది అంజలి. ఆశ అంతా వెతుక్కుంటూ కావేరి వాళ్ళు ఉండే ఇంటి దగ్గరికి వస్తుంది అంజలి వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ విని కిటికీలో నుండి చూస్తుంది అసలు కథ ఇదా ఇక ఇప్పుడు మనం రంగంలోకి దిగితే కథ మస్తు రంజుగా ఉంటుంది అనుకుంటుంది ఆశ

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella