NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu March 6 2024 Episode 2122: ఏసీపీ యుగంధర్ అంజలి కావేరి వాళ్లను పట్టుకుంటాడా లేదా.

Kumkuma Puvvu Today Episode March 6 2024 Episode 2122 Highlights

Kumkuma Puvvu  March 6 2024 Episode 2122:  బంటి ఆ పంచమి ఎవరో ఎప్పుడు వస్తుందో ఏంటో అంటూ పక్కకు వెళ్లి ఒక రాయి మీద కూర్చుంటాడు. బంటి దగ్గరికి ఒక నాగుపాము వచ్చి బుసలు కొడుతూ చూస్తూ ఉంటుంది. బంటి ఆ పామును చూసి పాము పాము అంటూ అరుస్తూ ఉంటాడు గుడిలో ఉన్న వాళ్లు కొంతమంది కర్రలు తీసుకుని పాము దగ్గరికి వస్తారు. అంజలి ఆగండి ఎందుకు మీరు ఆ పామును కొట్టడానికి కర్రలు తీసుకుని వస్తున్నారు వద్దు ఆ పామును ఏమీ అనొద్దు తను నాకు దేవత మనము దండం పెడితే సరిపోతుంది వెళ్ళిపోతుంది అని అంటుంది. వాళ్లు అదేంటమ్మా అది కరుస్తుంది అందుకే కొట్టాలి అని అంటారు.అంజలి లేదు అలా చేయడానికి నేను ఒప్పుకోను ఎందుకంటే ఇది పవిత్రమైన శివాలయం ఈ శివుడి ముందు శివుని మెడలో హారంగా ఉండే నాగులను చంపితే మనకు పాపం కాదా అందుకనే కొట్టొద్దు అంటున్నాను అంటూ అంజలి పాముకు దండం పెట్టి అమ్మ నాగదేవత నిన్ను మేము ఏమీ అనము ఇక్కడి భక్తులను నువ్వు ఏమీ అనకుండా వెళ్ళిపో అంటూ దండం పెడుతుంది పాము వెళ్ళిపోతుంది.

Kumkuma Puvvu Today Episode March 6 2024 Episode 2122 Highlights
Kumkuma Puvvu Today Episode March 6 2024 Episode 2122 Highlights

అది చూసిన పంచమి మీరు నాగుల గురించి చాలా మంచిగా చెప్పారండి అని అంటుంది. బంటి మీరెవరు అని అడుగుతాడు పంతులుగారు తానే పంచమి అని చెబుతాడు అందరూ పంచమి మీరా మీ కోసమే అందరం ఎదురు చూస్తున్నాము మీలాగే మీ మాట తీరు ఎంత బాగుందో అంటారు. పంతులు అమ్మ పంచమి రా నీ చేతులతో మొదటి పూజ ఆ శివుడికి చేదువురా అంటాడు. పంచమి అలాగే వెళ్దాం పదండి అందరం కలిసి ఆ శివుడికి పూజ చేద్దాము శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా పుట్టదంటారు అందుకనే ఆ శివయ్యకు ముందు పూజ చేసి తరువాత నాగదేవతకు పూజ చేయాలి అంటుంది పంచమి. పంచమి మీరు నాగుల గురించి చాలా బాగా చెప్పారు మీరు ఎక్కడి నుండి వచ్చారు అని అంజలిని అడుగుతుంది.

Kumkuma Puvvu Today Episode March 6 2024 Episode 2122 Highlights
Kumkuma Puvvu Today Episode March 6 2024 Episode 2122 Highlights

అంజలి మాది ఇక్కడ కాదు చెప్పుకోవడానికి మాయే అంత గొప్ప బతుకులు కాదు ఆయన బంటి నా భర్త మేమిద్దరము అనుకోని కారణాలవల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాను అవి చెప్పుకోదగినవి కాదు కానీ కొన్ని కారణాలవల్ల వేరువేరుగా దూరమయ్యాము కొన్ని కారణాలవల్లే మళ్లీ ఇద్దరం ఒక దగ్గరికి చేరుకున్నాము అంతెందుకు ఒక ముక్క చెప్పాలంటే నా బంటి నా దగ్గరికి చేరుకోవడానికి ఈ నాగదేవతే నాగుపాము కాటు వేయడం వల్లే బంటిని నేను ఉన్న దగ్గరికి తీసుకువచ్చారు అక్కడ మేము ఇద్దరము కలుసుకున్నాము కానీ మేము ఇద్దరం భార్యాభర్తలను అయినా వేరువేరు జీవితాలను వేరువేరు లాగా గడుపుతూ ఒక దగ్గర ఉంటున్నాము అని నా భర్తకు నాగసర్పదోషం ఉండడంవల్ల దానికి పరిహారం చేయించుకుందామని వచ్చాను అంటుంది అంజలి.పంచమి కచ్చితంగా పరిహారం చేస్తాను నాగ దోషం ఉన్నవాళ్లకి మానసికంగా శారీరకంగా చెప్పుకోలేని వెయ్యి ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే భార్య భర్తలు విడిపోయి దూరంగా ఉండాల్సి కూడా వస్తుంది అని ఇవన్నీ తొలగిపోవడానికి నాగజాతికి సంబంధించిన నాగులమ్మకు పూజ చేస్తే నాగ దోషానికి పరిహారం జరుగుతుంది అని చెబుతుంది. అంజలి సరే పదండి అంటుంది పంచమి అంజలి అందరూ కలిసి వెళ్లి శివునికి పూజ చేస్తారు.

Kumkuma Puvvu Today Episode March 6 2024 Episode 2122 Highlights
Kumkuma Puvvu Today Episode March 6 2024 Episode 2122 Highlights

కట్ చేస్తే కావేరి చంద్రం నాగులవరం గుడి దగ్గరికి చేరుకుంటారు. కావేరి అబ్బా అయ్యో ఏంటండీ ఈ నొప్పులు ఒళ్లంతా గుల్లయింది అని అంటూ వెళ్లి ఒక చెట్టు కింద కూర్చుంటారు. చంద్రం అవును కావేరి మనం ఇక్కడికైతే వచ్చాము కానీ మళ్ళీ రిటర్న్ అవ్వడానికి ఇక్కడ చూడబోతే మళ్ళీ ఏమి వెకిల్స్ లేవు అని అంటాడు. కావేరి ఏ ఎందుకు ఇంత దూరం ఆ యుగంధర్ నుండి తప్పించుకొని పారిపోయి వచ్చింది మళ్ళీ తిరిగి వెళ్లడానికా ఏంటి అంటుంది కావేరి. చంద్రం సరే ఒళ్ళు నొప్పులు అయింది అంటున్నావు కదా కాసేపు రెస్ట్ తీసుకో అంటాడు.

Kumkuma Puvvu Today Episode March 6 2024 Episode 2122 Highlights
Kumkuma Puvvu Today Episode March 6 2024 Episode 2122 Highlights

కట్ చేస్తే యుగంధర్ నాగులవరం చేరుకుంటాడు కావేరి సామెతల కావేరి ఇంట్లో డ్రెస్సు వేసుకొని నన్ను బురిడీ కొట్టించి అంజలిని తప్పించావు ఇప్పుడు దెయ్యాల వేషాలు వేసుకుని మా పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకొని ఇక్కడి వరకు వచ్చావు ఇక ఇక్కడి నుండి ఎలా తప్పించుకొని వెళతారో నేను చూస్తాను అంటూ కానిస్టేబుల్స్ గుడి మొత్తం అంతటా వెతకండి ఆ కావేరి చంద్రం వాళ్ళు ఎక్కడ దొరికిన పట్టుకొని తీసుకురండి అంటాడు. కానిస్టేబుల్స్ సర్ ఇది గుడి ఈరోజు మహాశివరాత్రి ఇక్కడ గొడవ జరిగితే బాగుండదు పబ్లిక్ ఊరుకోరు అని అంటాడు.

Kumkuma Puvvu Today Episode March 6 2024 Episode 2122 Highlights
Kumkuma Puvvu Today Episode March 6 2024 Episode 2122 Highlights

యుగంధర్ ముందు నేను చెప్పింది చేయండి వీళ్లను పట్టుకుంటాను అంజలి బంటీలను కూడా పట్టుకుంటాను ఈ కావేరి నాకు గాని దొరికింది అనుకో ఎలా ఉంటుందో అప్పుడు చూపిస్తాను. అని అంటాడు యుగంధర్. కావేరి యుగంధర్ ని చూస్తుంది ఏమయ్యా ఆ యముడు యుగంధర్ ఇక్కడికి కూడా దాకరించాడు వాడి నుండి సిటీ వదిలి ఇంత దూరం వచ్చినా వీడు యముడి లాగా మన వెంట వస్తున్నాడు కదా పద పద మనం ఏదైనా వెళ్లి దాచుకుందాము అని అంటుంది. చంద్రం ఔను కావేరి రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పదు అంటూ మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు ఈ యుగంధర్ అంటూ ఇద్దరూ వెళ్లి ఒక రాయి పక్కన దాచుకుంటారు

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella