Kumkuma Puvvu November 03 Episode 2017: ఇక హాస్పిటల్ లో ఉన్న కావేరి,అమృత,ఆశ,ఇంటికి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళి హాస్పిటల్లో ఉన్న, బంటి దగ్గరికి వచ్చి బయట నిలబడి అతని చూస్తూ అందరు ఏడుస్తూ ఉంటారు. అప్పుడు బంటి తండ్రి అయినా బంటి పంచ తగిలి పడితే మాత్రం అంత పెద్ద దెబ్బ తగులుతుందా, ఎక్కడైనా అని అంటాడు బంటి తండ్రి. అప్పుడు అరుణ్ కుమార్ గారు అవును బావ నాకు అదే డౌట్ వస్తుంది. ఎక్కడైనా పంచ తగిలి ఇంత గా తొర్లుతూ కింద పడతారా అని అంటాడు అరుణ్ కుమార్.అప్పుడు కావేరి చిన్నప్పుడు వాడికి నడక సరిగా నడిపించడం నేర్పించక పోవడం వల్లే ఇదంతా అంటుంది కావేరి. అయినా చిన్నప్పుడు కూడా నడుస్తూ అంజలి మీద ఊరికే పడుతూ ఉండేవాడు కదా అని అంటుంది కావేరి. ఇక అప్పుడు ఇదే ఛాన్స్ అనుకుంటూ ఆశ.ఆ అవును ఆంటీ సరిగ్గా నడక నేర్పించకపోవడం వల్లే బంటి ఇప్పుడు ఇలా తొర్లుతూ కింద పడ్డాడు అని అంటుంది ఆశ.

అప్పుడు అరుణ్ కుమార్ గారు ఆపండి మీరు ఏడవకండి. బంటి స్పృహ లో కి వచ్చాక ఏం జరిగిందో చెప్తాడు కదా అని అప్పుడు అరుణ్ కుమార్.అప్పుడు డాక్టర్ బయటికి వస్తాడు అందరూ డాక్టర్ గారు మా బంటి కి ఎలా ఉంది అని అడుగుతారు. అప్పుడు డాక్టర్ గారు తలకి పెద్ద గాయం తగలడం వల్ల తను కోలుకోవడం లేదు చాలా క్రిటికల్ గా ఉంది అని అంటాడు డాక్టర్.అప్పుడు అరుణ్ కుమార్ గారు డాక్టర్ గారు ప్లీజ్ ఎలాగైనా మా బంటి ని బతికించండి అని అంటాడు. అప్పుడు అమృత కూడా ప్లీజ్ డాక్టర్ గారు మా బంటి ని ఎలాగైనా బ్రతికించండి అని అంటుంది అమృత. అప్పుడు కావేరి బంటి నా ఒక్కగా ను, ఒక్క కొడుకు వాడిని ఎలాగైనా కాపాడండి మీరే అని అంటుంది కావేరి.అప్పుడు డాక్టరు నేను డాక్టర్ని మాత్రమే దేవుని మాత్రం కాదు,కదా,నా ప్రయత్నం నేను చేస్తాను అని అంటూ లోపలికి వెళతాడు డాక్టర్.

ఇక అప్పుడు కావేరి కోడికి కాళ్లకు వెండి గజ్జలు కట్టిన కుప్ప తొట్టిని కొల్లగొడ్చ కుండా ఉంటుందా అంటూ అంజలి చనిపోయి కూడా లక్ష్మీ రూపంలో నీ ప్రాణాల మీదికి తీసుకు వచ్చింది కదరా బంటి నా బంటి నా ఒక్కగా ను, ఒక్క కొడుకు అని అంటూ కావేరి ఏడుస్తూ అంటుంది. ఇక సాగరు వాళ్ళ ఇంట్లో అంజలి బెడ్ మీద కూర్చుని నా భర్త బంటి అంత ప్రమాదంలో ఉంటే నేను మాత్రం వెళ్లలేని పరిస్థితి నాది చీ నా బ్రతుకు ఏంటి అని అంటూ, ఏడుస్తూ ఏ జన్మలో ఏ పాపం చేశాను అందుకు నాకు ఈ కర్మ అని అంజలి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా అమృత అరుణ్ కుమార్ హాస్పటల్ నుంచి బయటికి వచ్చి.అంజలి కి ఫోన్ చేస్తారు అప్పుడు అంజలి సంతోషంతో ఫోన్ లిఫ్ట్ చేసి నాన్న బంటి ఎలా ఉన్నాడు అని అడుగుతుంది అంజలి. అందుకు అరుణ్ కుమార్ గారు బంటి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని డాక్టర్లు చెబుతున్నారు అని అరుణ్ కుమార్ గారు అంజలి కి చెబుతాడు.

అప్పుడు అంజలి ఏడుస్తూ అయ్యో బంటి అని ఏడుస్తూ అంజలి నాన్న ఇప్పుడు ఎలా అని అడుగుతుంది.ఇక సాగర్ వాళ్లు మాత్రం నన్ను లక్ష్మిగా బయటికి వెళ్ళ నివ్వకుండా ఇంట్లో కట్టిపడేశారు అని అంటుంది అంజలి. అందుకు అరుణ్ కుమార్ గారు అమ్మ అంజలి ఇప్పుడు నువ్వైనా మేమైనా ఏమీ చేయలేని పరిస్థితి అని అంటాడు అరుణ్ కుమార్.అప్పుడు అమృత ఫోన్ తీసుకొని అంజలి నేను ఒక మాట చెబుతాను వింటావా అని అంటుంది. చెప్పమ్మా అని అంటుంది అంజలి. అప్పుడు అమృత మనకు ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి అమ్మ ఇదే ఛాన్స్ గా ఆశ వినియోగించుకుంటుంది అని అంటుంది. అప్పుడు అంజలి అర్థమైందా అమ్మ తాళి కట్టిన భార్యను నేను దూరంగా ఉన్నా కదా అందుకని ఆశ ఇది ఛాన్స్ గా తీసుకొని అక్కడ ఏడుస్తూ నటిస్తుందన్న మాట అని అంటుంది అంజలి.అవునమ్మా అంజలి అని అంటుంది అమృత. అప్పుడు అమృతం మనకు దేవుడు దిక్కు అని అంటుంది అమృత. అప్పుడు అంజలి అమ్మ నా కన్నీళ్లను ఆ దేవుడి ముందు రక్తపు కన్నీళ్లుగా దేవుడికి నా మనసులో ఉన్న బాధ విన్న వించుకుంటాను అని అంటుంది అంజలి.

అప్పుడు అమృత సరేనమ్మా అని ఫోన్ పెట్టేస్తుంది.ఇక హాస్పిటల్ ముందు ఉన్న కావేరి ఆశ మాత్రం ఆ లక్ష్మిని వెనకేసుకుని వస్తున్నారు అమృత వరుణ్ కుమార్ అని అంటూ వాళ్లని తిడుతూ ఉంటారు. అప్పుడు ఆశ కి వాళ్ళ ఫ్రెండ్ గీతం ఫోన్ చేస్తుంది. అప్పుడు కావేరి అంటుంది వెళ్ళమ్మా నీకు ఎవరు ఫోన్ చేస్తున్నారు కదా వాళ్లతోనైనా కాసేపు బాధ చెప్పుకొ అప్పుడైనా నీ మనసులో బాధ కొంచమైనా తగ్గినట్టు ఉంటుంది అని అంటుంది కావేరి.అప్పుడు ఆశ అబ్బే ఎవరూ కాదు ఆంటీ నా ఫ్రెండు గీత ఫోన్ చేస్తుంది. తను బంటి ఎలా ఉన్నాడు అని బాధపడుతూ ఉంటుంది అని చెబుతుంది ఆశ.అప్పుడు కావేరి అబ్బా నీ ఫ్రెండ్ ఎంత చాలా మంచిదమ్మా నీలాగే అని అంటుంది కావేరి. అప్పుడు ఆశ అవును ఆంటీ బంటి ని ఈ పరిస్థితుల్లో చూస్తున్న మాకు చాలా బాధగా ఉంది అని దొంగ కన్నీళ్లు కారుస్తూ బయటకు వెళ్ళిపోతుంది ఆశ.గీత మాత్రం దొంగ కన్నీళ్లు కారుస్తున్న ఆశని చూసిఅబ్బా ఏం నటిస్తున్నావే నీవు అని అంటుంది గీత. అప్పుడు ఆశ కన్నీళ్ళ పాడా స్పృహలోకి నా అంజలిని చంపిస్తావా అంటూ నా గురించి నిజం అందరికీ నిజం చెప్పేస్తాడు ఇక అప్పుడు అందరూ నాకు తప్పించుకునే ఛాన్స్ ఇవ్వకుండా నన్ను జైల్లోకి పంపిస్తారు అప్పుడు ఇక నేను చేసేది ఏమీ లేదు అంటుంది ఆశ.అప్పుడు గీత మాత్రం అవునే అది కరెక్టు అంటుంది గీత.అప్పుడు ఆశ అవును అని ఎలాగైనా నేను ప్రమాదంలో పడకూడదు అందుకు, ఒకటే మార్గం అది ఏంటంటే బంటి ని చంపేయడం అని అంటుంది ఆశ. అప్పుడు గీత ఏ ఏంటే బంటి ని చంపడం ఏంటి ఎంతైనా నీవు కట్టుకోయేవాడు కదా అని అంటుంది గీత. అప్పుడు ఆశ ఇంకా ఎక్కడి మొగుడే వాడు బ్రతికితే నా పాలిట యముడు అవుతాడు అని అంటుంది

ఆశ. ఎలాగైనా ఈ రాత్రికి ముగించేయాలి అని అంటుంది ఆశ. ఇక అంజలి మాత్రం ఏడుస్తూ అమ్మవారి గుడికి వచ్చి అమ్మ జగన్మాత నా భర్తని బ్రతికించమని ఏడుస్తూ మొరపెట్టుకుంటుంది అంజలి.అప్పుడే పంతులుగారు అక్కడికి వచ్చి ఏడుస్తున్న అంజలి చూస్తాడు. అప్పుడు అంజలి గబ,గబా పంతులు గారి దగ్గరికి వెళ్లి పంతులుగారు నేను బ్రతికుండగానే ఈ తాళిబొట్టు నా, మెడలో ఉండగానే నా భర్త చావు బతుకుల మధ్యలో కొట్లాడుతూ ఉన్నాడు కానీ,నేను అతని దగ్గరికి వెళ్లలేని పరిస్థితి అందుకు నేను ఏం చేయాలి చెప్పండి. నా భర్తని ఎలా బ్రతికించుకోవాలి అని అడుగుతుంది అంజలి. అప్పుడు పంతులుగారు అమ్మ ఇక్కడ పసుపులో తడిపిన చీర ఉంటుంది.అది కట్టుకొని అమ్మవారి మంత్రాన్ని జపిస్తూ మోకాలు మీద పొర్లు దండాలు పెడుతూ అమ్మవారిని వేడుకో అని అంటాడు పంతులుగారు. అప్పుడు అంజలి అమ్మవారి మంత్రం అదేంటి పంతులుగారు అని అడుగుతుంది అంజలి. అప్పుడు పంతులుగారు అమ్మవారి మంత్రం అంటే అప్పుడు పంతులుగారు మంత్రాన్ని చెబుతాడు అంజలికి, ఓం శ్రీమాత్రే నమః అని ఈ మంత్రం ఆ జగన్మాత మంత్రం అని అంటాడు పంతులుగారు.సరే పంతులుగారు నేను ఇదంతా చేస్తాను అని అంటుంది అంజలి.అప్పుడు పంతులుగారు వెళ్ళిపోతారు. అక్కడికి వచ్చిన అమృత అరుణ్ కుమార్ వాళ్ళు ఇదంతా చూస్తూ ఉంటారు.అప్పుడు అంజలి దగ్గరికి వచ్చి అమ్మ పంతులుగారు చెప్పింది అంతా మేము విన్నాము పద ఎలాగైనా ఆ పని చేద్దాము అంటూ వెళతారు అప్పుడు అంజలి ఏడుస్తూ ఈ లోకంలో నా అంత దురదృష్టవంతురాలు ఎక్కడ ఉండదు అమ్మ అని ఏడుస్తూ ఉంటుంది అంజలి. అప్పుడు అమృత బాధపడకమ్మా అని అంటుంది. ముందుగా పంతులుగారు చెప్పిన పనిని చేద్దాం పద అంటూ వెళ్లి పసుపులో ముంచిన చీర తీసుకొని కట్టుకొని వస్తుంది అంజలి