Kumkuma Puvvu November 09 2023 episode 2022: హాస్పిటల్లో ఉన్న బంటి స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి చూస్తాడు అది చూసి నర్స్ డాక్టర్ గారు ఇతనూ స్పృహలోకి వచ్చారు చూడండి డాక్టర్. డాక్టర్ వచ్చి బంటి ని చూసి బయట ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ని పిలుస్తాడు. అంజలి వాళ్ళు అందరూ బంటి కళ్ళు తెరవడం చూసి చాలా సంతోష పడి అతన్ని బంటి అని పిలుస్తూ ఉంటారు. కానీ బంటిఇలాంటి కదలికలు లేకుండా అలాగే చూస్తూ ఉంటాడు. అమృత డాక్టర్ గారు బంటి ఏమి మాట్లాడటం,కదలడం లేదు అని అడుగుతుంది. డాక్టర్ వచ్చి బంటి ని చెక్ చేస్తాడు అన్ని రిపోర్ట్స్ చూస్తాడు వాళ్ళని క్యాబిన్ లోకి పిలుచుకొని అతని తలకి దెబ్బ గట్టిగా తగలడం వల్ల బ్రెయిన్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి అతను మాట్లాడలేడు కదల లేడు అంటాడు.కావేరి అదేంటి నా బంటి కి ఎలాంటి ప్రాబ్లం లేదన్నారు కదా డాక్టర్ అన్నాను కానీ రిపోర్ట్స్ చూశాక చెక్ చేశాక చెబుతున్నాను అతను ఒక మర బొమ్మ లాంటివాడు అతను కదలలేడు ఏమీ అడగను లేడు ఏమీ మాట్లాడను లేడు కాబట్టి అతనిని జాగ్రత్తగా చూసుకోవాలి.

ఈ అంజలి వచ్చిన తర్వాతే అతను స్పృహలోకి వచ్చాడు కాబట్టి తను దగ్గరుండి చూసుకుంటే తొందరగా కోలుకుంటాడు అని చెబుతాడు డాక్టర్. అందుకు కావేరి ఏమీ అక్కర్లేదు వాడిని కన్న తల్లిని నేనున్నాను నేను చూసుకుంటాను అంటుంది. అప్పుడు అరుణ్ కుమార్ నువ్వు ఆగు అంజలి వచ్చాకే కదా మన బంటి స్పృహలోకి వచ్చాడు కాబట్టి అంజలి ఉండి చూసుకుంటుంది ఆశ ఓ మై గాడ్ ఈ పిచ్చివాన్ని ఈ మతి లేని వాడిని నేను చూసుకోవాలి అనే నాకు ఎక్కడ తగిలిస్తారు అని నాకు భయమేసింది నేను తప్పించుకున్నాను నేను సేఫ్ అయినా ఈ మతిలేని వాడితో నాకేంటి భయం వాడు ఎలాగైనా బ్రతుకనివ్వు నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటుంది ఆశ.

ఈ బంటిలేచి నడిచి మాట్లాడి తనంతట తాను అన్ని పనులు చేసుకుని అప్పుడు నన్ను గుర్తుపట్టి ఆ తర్వాత నా గురించి నిజం చెప్పినప్పుడు చూద్దాం వీడి సంగతి అని మనసులో అనుకుంటుంది ఆశ.డాక్టర్ ఈ రోజు డిశ్చార్జ్ చేస్తాను పేషెంట్ ని తీసుకు వెళ్ళొచ్చు అరుణ్ కుమార్ అలాగే డాక్టర్ గారు.బంటిని తీసుకొని అందరూ ఇంటికి వస్తారు అంజలి వచ్చి బంటిని కారులో నుంచి దింప బోతుండగా ఆశ వచ్చి అంజలిని నెట్టివేసి బంటి దిగు దిగుతావా లేదా అని కోపంగా అంటుంది.కానీ బంటి ఎలాంటి చలనం లేకుండా అలాగే చూస్తూ ఉంటాడు. అంజలి వచ్చి ఆశ ని అసలు నీవు ఏం మనిషివి తను పేషెంట్ అని తెలుసు కదా అలా ఎలా దిగుతాడు అని నీవు పక్కకు జరుగు బంటిని నేను దింపుతాను అని అంజలి బంటి ని తన భుజాల మీద చేయి వేసుకుని దింపి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకువెళ్లే బంటి రూములో పడుకోబెడుతుంది.

అది చూసిన కావేరి ఆశ అంజలిని కోపంగా చూస్తూ ఆశ కావేరితో చూశావా ఆంటీ ఆ లక్ష్మికి కొంచెం ఛాన్స్ దొరికితే చాలు అంజలి లాగా ఫీల్ అయ్యి తెగ ఆరాట పడిపోతుంది. కావేరి అంతా చూస్తున్నాను ఆశ దాన్ని ఎక్కడ ఇరికించాలో నాకు బాగా తెలుసు అంటుంది కావేరి. సాగర్ వాళ్ళ ఇంట్లో సాగర్ లక్ష్మీ ఫోటోకు దండ వేస్తూ లక్ష్మీ ఫోటో వైపు చూసుకుంటూ బాధపడుతూ లక్ష్మీ నీవు ఈ లోకంలో లేదంటే నా గుండె పగిలిపోయినంత పని అవుతుంది. కానీ నేను నీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తనను తలుచుకుంటే నాకు నేనే సిగ్గు పడుతున్నాను నేను ఎంత దుర్మార్గున్నో నాకు అంజలి చెప్పేదాకా నాకు తెలియదు ఛీ నేను ఇంత పాపాత్ముని నిన్ను ఎన్ని కష్టాలు పెట్టాను. నా భార్యగా అంజలి నటిస్తున్న అంజలి ని నా భార్య లక్ష్మి అనుకుని తనను కూడా చాలా కష్టాలు పెట్టాను బంటికి తనకి అక్రమ సంబంధాన్ని అంట కట్టానుఅలాగే నీవు పతితవు అని అంజలిని చాలా క్రూరంగా హింసించి బాధ పెట్టాను.భార్యగా నీవు నా ప్రక్కన ఉన్నంత వరకు అసలు నాకు భార్య విలువెంటో తెలియలేదు కానీ ఇప్పుడు నీవు లోకంలో లేవని తెలుసాకే తెలుస్తుంది భార్య లేని లోటు ఎంత భారీగా ఉంటుందో.

పెళ్లయిన మగాడికి భార్య జీవితంలో ఎంత విలువైనదో ఇప్పుడు నాకు తెలుస్తుంది లక్ష్మి. ఈ ఇంటి వెలుగు సందడి అంతా నీతోనే తీసుకువెళ్లావు కానీ మన కూతురు శ్వేతను మాత్రం నాకు వదిలేసి వెళ్లావు నేను ఏం చేయను ఎలా చూడను చెప్పు అంటూ సాగర్ లక్ష్మి ఫోటో దగ్గర ఏడుస్తూ ఎంతైనా తప్పు నాదే లక్ష్మి నేను మగాడి మొగుడిని అన్నా అహంకారంతో నిన్ను రాచి రంపాన పెట్టాను నన్ను క్షమించు లక్ష్మి, క్షమించు అంటూ ఏడుస్తూ భార్యని చంపుకున్న పాపాత్ముని నేనే అంటూ పచ్చని సంసారాన్ని కూలగొట్టుకున్నది నేనే అంటూ సాగర్ ఏడుస్తూ ఉంటాడు. పద్మావతి కొండమ్మ సాగర్ దగ్గరికి వచ్చి పద్మావతి ఒరేయ్ సాగర్ బాధపడకు నాన్న ఏడవకు ఇప్పుడు మనం చేయాల్సింది ఏమీ లేదు మనము ఇప్పుడు చేయవలసిన పని శ్వేత ను బాగా చూసుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. ఆ చిట్టి దానికి తన తల్లి లోకంలో లేదనే విషయాన్ని తెలియకుండా తనని పెంచడం తప్ప మనము ఏమి చేయలేము.

అలాగే అంజలి జీవితం చక్కబడాలని ఆ దేవుని కోరుకుందాం రా అంజలి పట్ల మనం ప్రవర్తించిన ప్రవర్తనకు నేను సిగ్గుపడుతున్నాను. కొండమ్మ అవును బాబు మనము చేయవలసినది ఆ అంజలమ్మ బతుకు బాగుండాలి. ఆ బంటి బాబు త్వరగా కోలుకొని వాళ్ళిద్దరూ చక్కగా కలిసి ఉండాలి అని ఆ దేవుని మనం కోరుకుందాం.సాగర్ నేను మనిషిలా మారడానికి కారణం అంజలి నేను తనని ఇన్ని బాధలు పెట్టాను తలుచుకుంటే చాలా బాధగా ఉంది తన జీవితం బాగుండాలని ఆ దేవుని కోరుకోవడం తప్ప నేనేమీ చేయలేను ఎలా క్షమించమని అడగను.
మా కొండమ్మ బాబు అయిందేదో అయిపోయింది శ్వేతమ్మను బాగా చూసుకోవాలి బాబు. సాగర్ భార్య లక్ష్మీ ఫోటోకి దండం పెట్టి వెళ్ళిపోతాడు. కావేరి ఎలాగైనా ఈ లక్ష్మీని ఇంట్లో నుంచి పంపించేయాలి మనసులో అనుకుంటుంది. ఆశ ఈ అంజలి ని లక్ష్మి గా సాగర్ కి అంట కడదాం అనుకుంటే వచ్చి మళ్లీ ఈ బండి గాని తగులుతుంది కదా, ఈ బంటి ని అంజలి ని ఎంత విడదీద్దాం అనుకున్న వీళ్ళు మరీ దగ్గర అయిపోతున్నారు. ఎలాగైనా ఈ అంజలి ని ఇంట్లో నుంచి త్వరగా పంపించేయాలి లేదంటే నాకు ప్రమాదం అని మనసులో అనుకుంటుంది ఆశ