Kumkuma Puvvu november 14 2023 episode 2026: చండీయాగం జరిపిస్తామని అంజలి అమ్మవారికి మొక్కు మొక్కుకొని గుడి నుండి ఇంటికి రాగానే బంటీ బాడీలో చలనం వచ్చి తనంతట తానే మెల్లిమెల్లిగా లేచి నడవడం మొదలుపెట్టాడు. అది చూసిన అంజలి అమృత చాలా సంతోషపడతారు అంజలి బంటి చేయి పట్టుకొని కమాన్ బంటి అలాగే వాక్ చెయ్యి అలాగే నడువు అంటూ ప్రోత్సహిస్తూ ఉంటుంది అమృత చూసావా అంజలి నీవు అమ్మవారికి చండీయాగం చేయిస్తానని మొక్కుకున్నావో లేదో ఆ అమ్మవారు నీ మీద దయతెలిచి తన కృప నీ బంటి మీద చూపిస్తుంది.అంజలి అవును అమ్మ ఆ అమ్మవారి కృపా నాయందు ఉంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ యాగాన్ని ఆపను జరిపి తీరుతాను అరుణ్ కుమార్ అంజలి నీ తండ్రిని నేను ఉన్నాను

నీకు ఎలాంటి అవసరం ఉన్నా నేను చూసుకుంటాను ఆ అమ్మవారి చండీ యాగాన్ని ఆపకుండా జరిపించాలి. అంజలి అలాగే నాన్న ఇక మనం గుడికి వెళ్దాం పద అని బంటి అరుణ్ కుమార్ అంజలి అమృత వాళ్లు గుడికి బయలుదేరుతుండగా ఆశ వచ్చి ఆగండి బంటిని ఎక్కడికి తీసుకు వెళుతున్నారు ఈరోజు డాక్టర్ చెకప్ ఏం లేదు కదా మరి ఇంకా ఎక్కడికి తీసుకు వెళుతున్నారు అని అడుగుతుంది అంజలి నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఆశ ఆశ ఏంటి ఏమన్నావ్ నాకు అవసరం లేదా బంటిని కట్టుకుపోయేదాన్ని నాకు కాకపోతే నీకు ఉంటుందా నాకు మాత్రమే ఉంటుంది హక్కు బంటిని ఎట్టి పరిస్థితుల్లో నీవు బయటికి తీసుకువెళ్లడానికి వీల్లేదు అరుణ్ కుమార్ ఆశ నోరు జాగ్రత్తగా పెట్టుకో మేము బంటి బాగుండాలని మేము ఈ యాగాన్ని జరిపిస్తున్నాము అంజలి అయినా బంటి కోలుకుంటే నీకు ఏదో ప్రమాదం అన్నట్టు అలా ఉనికి పోతున్నావేంటి ఆశ ఆశ నాకేంటి భయం అబ్బే నాకేం భయం లేదు కావేరీ ఆంటీ అంకులు ఇంట్లో లేరు.

వాళ్ళు వచ్చాక వాళ్ళని అడిగి తీసుకు వెళ్ళండి అంటుంది ఆశ అమృత ఏమీ అవసరం లేదు బంటి తల్లిదండ్రులు కావేరి వదిన అన్నయ్య ఒప్పుకుంటారు మేము తీసుకు వెళ్తున్నాం అని అమృత అరుణ్ కుమార్ అంజలి బంటి గుడికి బయలుదేరుతారు ఆశ టెన్షన్ పడుతూ సాగర్ కి ఫోన్ చేస్తుంది కట్ చేస్తే సాగర్ ఇంట్లో సాగర్ అంజలి నీ ఎలా చంపాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆశ ఫోన్ వస్తుంది సాగర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి చెప్పు ఆశ అంటాడు ఆశ ఇక్కడ కొంపలు మునిగిపోతుంటే ఏంటి అని కూల్ గా అడుగుతావా సాగర్ ఏంటి మీ ఇంటి చుట్టుప్రక్కల ఏమైనా వరదలు ముంచుకొచ్చాయా కొంప మునిగిపోయిందా వరదల్లో అని వెటకారంగా మాట్లాడుతాడు ఆశ సాగర్ ఇది జోకులు వేసే టైం కాదు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఆ బంటి గాడిని మళ్లీ మామూలు మనిషిని చేయడానికి గుడిలో చండీయాగం జరిపించడానికి అంజలి వాడిని తీసుకొని వెళ్ళింది

ఎలాగైనా ఆ యాగాన్ని ఆపి తీరాలి అలాగే నేను ఇలాంటి ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్నాను ఆశ ఆ అంజలిని ఎలాగైనా కటకటాల వెనుక ఇరికిస్తాను చూస్తూ ఉండు పోలీసుల్ని ఆ గుడి దగ్గరికి రప్పిస్తాను ఆశ వెరీ గుడ్ ఎక్స్లెంట్ ఎలాగైనా ఆ అంజలి మీద గెలవాలి మనం. లేదంటే అది విజయగర్వంతో నా ముందు తిరుగుతూ ఉంటే నేను ఆ దాన్ని చూసి తట్టుకోలేను అంజలి ని ఎలాగైనా పోలీస్ స్టేషన్లోనే బందీ చేయాలి లేదంటే మనం దాని చేతిలో ఓడిపోయినట్లే సాగర్ చూస్తూ ఉండు ఆశ అంటాడు సాగర్ ఇంతలో కావేరి కావేరి భర్త ఇద్దరూ వచ్చి ఆశ దగ్గర నిలబడతారు ఆశా వాళ్ళని చూసి షాక్ అయి ఏంటి వీళ్ళు నేను సాగర్ తో మాట్లాడిన మాటలన్నీ వినేశారా అని మనసులో భయపడుతూ ఉంటుంది కావేరి ఆశ దగ్గరకు వచ్చి ఏంటి ఆశ ఎక్స్లెంట్ అలాగే చేయి అని మాట్లాడుతున్నావ్ అని అంటుంది.

అప్పుడు ఆశ అబ్బే అదేం లేదు ఆంటీ నా ఫ్రెండ్ గీత ఉంది కదా బంటిని ఎక్కడికైనా తీసుకువెళ్లి చూయించుదామని చెబుతుందంటే నేను అదే మాట్లాడు తున్నాను ఆంటీ కావేరి అబ్బా నీ ఫ్రెండ్ గీత ఎంత మంచిది ఆశ నువ్వు కూడా మా బంటి గురించి ఎంతగా ఆలోచిస్తున్నావు అవును బంటీ కనిపించడం లేదు ఇంట్లో వాళ్లంతా ఎటు వెళ్లారు అని అడుగుతుందికావేరి ఆశ నేను ఎంత వద్దంటున్నా బంటిని తీసుకొని అంజలి ఆంటీ అంకుల్ నా మాట వినకుండా గుడిలో ఏదో యాగం జరిపించడానికి వెళ్లారు ఆంటీ ఎంతైనా అసలుకే బాగోలేదు ఆ యాగం జరిపించేటప్పుడు మంటలు దగ్గర వేడికి కూర్చుని యాగం జరిపిస్తుంటే బంటీ బ్రెయిన్ లో ఉన్న నరాలు చిట్లి పోతే అప్పుడు బంటి పరిస్థితి ఏంటి బంటి మనకు దక్కుతాడా చెప్పండి

ఆంటీ కావేరి అంజలి అంత పని చేసిందా ఏ గుడికి వెళ్లారు వెళ్దాం పద ఎలాగైనా ఆ యాగాన్ని ఆపుదాం అంటూ అందరూ గుడికి బయలుదేరుతారు అంజలి బంటి అరుణ్ కుమార్ అమృత వీళ్లను చూసిన పంతులుగారు వచ్చారా రండి కూర్చోండి మీ మనసులో మా దాంపత్య జీవితం కలకాలం బాగుండాలి అని ఆ అమ్మవారికి దండం పెట్టుకుని నిశ్చలమైన మనసుతో కూర్చోండి అంటాడు పంతులుగారు అంజలి అలాగే పంతులుగారు అంటూ బంటి చేతులు రెండు జోడించి దేవుడికి దండం పెట్టిచ్చి తను కూడా దండం పెట్టుకొని పీటల మీద కూర్చొని ఆ అమ్మవారి చండీయాగాన్ని మొదలు పెడతారు. కారులో గుడికి బయలుదేరిన కావేరి కావేరి భర్త వస్తుండగా ఆశ మనసులో ఈ బంటి మామూలు వాడు అయితే నాకే కదా ప్రమాదం ఎలాగైనా ఈ యాగాన్ని కావేరి ఆంటీ వాళ్ళ చేతితో ఆపించేయాలి అని మనసులో అనుకుంటుంది ఆశ.