Kumkuma Puvvu November 17 2023 Episode 2029: అమృత కావేరి వదిన అన్నయ్య వాళ్ళు మధ్యలో రాకపోతే బంటికి గతం ఎలాగైనా గుర్తుకు వచ్చేది అరుణ్ కుమార్ అవునా బంటి బాడీలో కదలికలు మొదలయ్యాయి కొద్ది రోజుల్లో తనకు గతం ఎలాగైనా గుర్తుకు వస్తుంది అప్పుడు తనను ఎవరు ఆపలేరు అమృత అసలు కావేరి వదిన అన్నయ్య ఎందుకని వాళ్ళు అసలు బంటి గురించి ఆలోచించడం లేదు మనము బంటి కోసం ఆరాటపడుతుంటే వాళ్లు మాత్రం అడ్డుకుంటున్నారు ఎందుకు అసలు ఇలా చేస్తున్నారు అరుణ్ కుమార్ మనం ఇప్పుడు ఆలోచించాల్సింది బంటి గురించి కాదు మన అంజలి గురించి అమృత అవునండి ఎలాగైనా అంజలిని బయటకు తీసుకురావాలి. మీకు తెలిసిన లాయర్లు ఉన్నారు కదా వాళ్ళతో ఎవరు ఎవరితో అయినా మాట్లాడి అంజలి అని బెయిల్ మీద బయటకు విడిపించండి అంటుంది అమృత అరుణ్ కుమార్ నేను ముందుగానే మాట్లాడేసాను అమృత లాయర్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తానన్నాడు వెళ్దాం పద టైం అవుతుంది అని అమృత అరుణ్ కుమార్ పోలీస్ స్టేషన్ కు వెళ్తారు

స్టేషన్లో అంజలి బాధపడుతూ కూర్చుంటుంది ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ ఆ చీటింగ్ లేడీ ని జీపులో ఎక్కించండి కోర్టుకి హాజరు పరిచాలి అని అంజలిని సెల్ నుంచి బయటికి తీసుకువస్తారు అందులో లాయర్ గారు అమృత అరుణ్ కుమార్ గారు వచ్చి బెయిల్ ఇస్తారు ఇన్స్పెక్టర్ అది చూసి ఇప్పటివరకు అయిపోయింది అనుకోకండి ఇంకా ముందు ఇలాంటివి చాలా జరుగుతాయి అప్పుడు చూస్తాను అంటుంది ఇన్స్పెక్టర్ అంజలి ఇన్స్పెక్టర్ గారు మీరు ఏం చేయలేరు ఇప్పుడు నాకు కోటి నుంచి బెయిల్ వచ్చింది మీరు కొంచెం రూల్స్ మాత్రం మాట్లాడండి రూల్స్ తప్పి మాట్లాడితే నాకు తెలుసు రూల్స్ ఏంటో అని అంజలి ఇన్స్పెక్టర్ కి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది అమృత అమ్మ అంజలి ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది శ్వేత గురించి కాదు ఇప్పుడు నీ భర్త బంటి గురించి తను కొంచెం కొంచెం స్పృహలోకి వస్తున్నాడు ముందు నువ్వు బంటి ని జాగ్రత్తగా చూసుకో అంటుంది

అరుణ్ కుమార్ అతి మంచితనం కూడా పనికిరాదు అంజలి దానిని చేతగాని తనంగా తీసుకుంటారు నువ్వు ఇక శ్వేత గురించి ఆలోచించడం మర్చిపో అమృత ఆ శ్వేతను చూసుకోవడానికి శ్వేత నానమ్మ కొండమ్మ వాళ్ళ నాన్న ఉన్నారు నువ్వు ఇక శ్వేత గురించి వదిలేయ్ సేత తల్లి లక్ష్మికి ఇచ్చిన మాట ప్రకారం శ్వేతకు తల్లి ప్రేమను అందించావు ఆ ఇంట్లో వెలుగుని నింపావు కానీ సాగర్ మాత్రం ఆశ మాటలు నమ్మి నిన్ను జైలుకు పంపించాడు చూసావా ఎంత మోసం ఎంత మోసం అంజలి ఆశకు సాగరకి కొంచమైనా విశ్వాసం లేదు వాళ్ళు పచ్చి దుర్మార్గులు వాళ్లను నువ్వు ఇక వదిలిపెట్టకూడదు అంజలి నీ సౌభాగ్యాన్ని లాక్కోవాలని చూస్తుంది ఆ ఆశ ముందుగా బంటి కి గతాన్ని గుర్తు తెచ్చుకునేలా నువ్వు ప్రయత్నం చేయాలి పదా వెళ్దాం అంటుంది అమృత. అంజలి అలాగే అమ్మ తప్పకుండా వంటికి గతం అన్ని గుర్తు కు వచ్చేలా చేస్తాను ఆశ పని పడతాను అంటుంది అంజలి. అరుణ్ కుమార్ వెరీ గుడ్ అమ్మ

ఈ ధైర్యం ఇలాగే ఉండాలి ఇక నువ్వు ఆశకు ఏ విధంగా భయపడాల్సిన అవసరం లేదు అంటాడు అరుణ్ కుమార్ పద్మావతి కొండమ్మ శ్వేతకు లక్ష్మీ లేదు అన్న నిజాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు అంటుంది పద్మావతి అందుకు కొండమ్మ ఏం చేసేది తల్లి తండ్రి ఉన్నాడన్న సంతోషం కూడా లేదు సాగర్ బాబు ఏమో అసలకే శ్వేతమ్మ మీద మండి పడుతున్నాడు ఒకసారి వెళ్లి శ్వేతమ్మను చూసి వద్దాం పదమ్మ అంటుంది కొండమ్మ పద్మావతి కొండమ్మ శ్వేతను చూడడానికి హాస్టల్ కు వస్తారు వాళ్లను చూసిన హాస్టల్ వార్డెన్ పద్మావతి దగ్గరకు వచ్చి పద్మావతి గారు ఇలా చూడండి ఈ పాపని మీ శ్వేత కొట్టి పడేసి జుట్టు పీకి గొంతు నులిమి చంపపోయింది ఎప్పుడూ ఇలా ఒకరి మీద చేయి చేసుకుని మీ శ్వేత ఇప్పుడు ఈ పాపని బాగా కొట్టింది అది విన్న పద్మావతి ఏంటి శ్వేత ఈ పాపని కొట్టావా అని అడుగుతుంది శ్వేత ఆ కొట్టాను బాగా కొట్టాను అంటుంది అందుకు పద్మావతి ఏ ఎందుకు కొట్టావు ఆ పాపని అని అడుగుతుంది
శ్వేత మరేమో మీ లక్కీ హాస్టల్ కి రావడం లేదు ఇక మీ లక్కీ లేదు అని అన్నది అందుకే నాకు లక్కీని అలా అన్నందుకు కోపం వచ్చి తనని కొట్టి చంపబోయాను ఇంకోసారి మా లక్కీ లేదు అంటే ఊరుకునేదే లేదు ఎవరైనా సరే మా లక్కీ లేదు అని అనొద్దు అంటుంది. అప్పుడు కొండమ్మ అయ్యో శ్వేతమ్మ అలా కొట్టొద్దు కదమ్మా శ్వేత అయితే తను మా లక్కీ చనిపోయిందని అలా అంటుందా తప్పు కదా పద్మావతి వార్డెన్ గారు నేను మా శ్వేతకు నచ్చ చెబుతాను మీరు వెళ్ళండి అని వార్డెన్ ని పంపిస్తుంది పద్మావతి శ్వేత ఒకవేళ సపోస్ ఇప్పుడు ఆ పాప అన్నట్టుగానే మీ లక్కీ చనిపోతే ఏం చేస్తావు అని అంటుంది పద్మావతి శ్వేత మా లక్కీ చనిపోతే నేను చనిపోతాను నేను బ్రతకను మాట వరసకు కూడా అలా అనకు నానమ్మ సరేనా అని పద్మావతికి చెప్పి శ్వేత ఆడుకోవడానికి వెళుతుంది శ్వేత ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి ఆడుకుంటుంది కొండమ్మ శ్వేత తండ్రి సాగర్ బాబేమో ఈ శ్వేతమ్మ అంటే చాలా కోపంగా ఉన్నాడమ్మా కానీ ఈ శ్వేతమ్మ ఏమో తన లక్కీ లేకపోతే నేను ఉండను అని మాట్లాడుతుంది కానీ ఈ నిజాన్ని శ్వేతమ్మకు ఎప్పుడు తెలిసేది తల్లి అంటుంది పద్మావతి

కొండమ్మ నిజాన్ని ఎన్ని రోజులు దాచిపెడతా దాని టైం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది అంటుంది శ్వేత కాలుతో తన్నిన బాలు వెళ్లి స్మశానంలో పడుతుంది బాలు కోసం వెళ్ళిన శ్వేతకు తన తల్లి లక్ష్మి స్మశానం కూడా అక్కడే ఉంటుంది ఆ లక్ష్మి ఆత్మ వచ్చి బాలుని శ్వేత దగ్గరికి వెళ్లేలా విసిరేస్తుంది శ్వేత బాలు తీసుకొని చుట్టుప్రక్కల చూస్తుంది ఎవరూ ఉండరు కానీ బాలు నా దగ్గరికి ఎలా వచ్చింది అని అనుకుంటుంది పద్మావతి కొండమ్మ శ్వేతను వెతుకుతూ అక్కడే ఆడుతున్న ఒక పాపను అడుగుతారు శ్వేతా ఎక్కడికి వెళ్లింది కనిపించడం లేదు అని అడిగితే వాళ్లు శ్వేత బాలు కోసం అటు పరిగెత్తింది అని చెబుతారు కొండమ్మ పద్మావతి శ్వేతను వెతుకుతూ వాళ్లు కూడా స్మశానంలోకి వెళతారు స్వేతను అక్కడ చూసిన పద్మావతి శ్వేత ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది శ్వేత బాలు కోసం వచ్చాను. కానీ ఎవరో ఈ బాలు నా దగ్గరకు వచ్చి పడేలా విసిరేశారు ఎవరు అని చూస్తే ఎవరూ కనిపించడం లేదు నాకు అని చెబుతుంది

శ్వేత అప్పుడు పద్మావతి కొండమ్మ తో మన లక్ష్మీని ఈ స్మశానం లోనే పెట్టాము అని అమృత చెప్పింది కదా వెళ్దాం పద కొండమ్మ అని శ్వేతను తీసుకొని కొండమ్మ పద్మావతి స్మశానం నుంచి వస్తారు కట్ చేస్తే బంటి ఎక్సర్సైజ్ చేసుకుంటూ అసలు నా తలకి ఇంత పెద్ద గాయం ఎలా తగిలింది అసలు నేను ఎలా పడ్డాను అని తను గతాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు తన గతంలో జరిగిందంతా తల లోపల మెదులుతూ ఉంటుంది కానీ బయటికి చెప్పడానికి రావడం లేదు కానీ బంటి గతాన్ని పదేపదే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆశ బంటి కి ఎలాగైనా గతం గుర్తుకు రాకుండా చేయాలి కానీ ఎలా చేయాలి అది అని మనసులో అనుకుంటుంది