Kumkuma Puvvu November 20 2023 Episode 2031: ఆశ బంటిని ఎలాగైనా మామూలు మనిషిని చేయాలని నా కోరిక ఆంటీ ఈ ఇంటి కి కాబోయే కోడలిగా అలాగే నేను నూరేళ్లు పసుపు కుంకుమలతో ఉండాలని బాధపడుతున్నట్లు నటిస్తూ దీవించండి ఆంటీ అని కావేరి దంపతులను అడుగుతుంది ఆశ ఆశ మాటలకు కావేరి రుబ్బిపోయి సంతోషపడుతూ చూశారా చూశారా మన ఆశ ఏ రంభ ఏ ఊర్వశి ఏ మేనకైనా అన్నీ మన ఆశ లాగానే మన బండికి దొరుకుతున్నాయండి మన బంటి గాడు ఎంత అదృష్టం చేసుకొని పుట్టిండాలి ఈ ఆశ లాంటి భార్య దొరకడానికి అంటు తన భర్తతో చెప్తూ ఉంటుంది కావేరి భర్త అవును కావేరి మన బంటికి ఆశ దొరకడం చాలా అదృష్టం ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి సిచువేషన్ ఎవరూ పట్టించుకోకుండా తన దారి తాను చూసుకుని వెళ్ళిపోయేవారు కానీ ఆశ మాత్రం ఎదురు నిలబడి బంటిని జాగ్రత్తగా చూసుకుంటుంది

కావేరి ఇక అయితే మనం ఆలస్యం చేసేది ఎందుకు ఇక బంటి ఆశల పెళ్లి ఇలాంటి ఆడంబరం చేయకుండా ఏ గుడిలోనైనా సైలెంట్ గా పెళ్లి జరిపించేస్తే సరిపోతుంది అంటుంది కావేరి అందుకు కావేరి భర్త అలాగే కానిద్దాం కావేరి అంటాడు ఆశ మనసులో మీరు ఇలాగే నన్ను నమ్మినంత కాలం బంటి అలాగే మతి లేని వాడిలా ఉన్నంత కాలం నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ ఇద్దరితోనే నా పెళ్లి జరిగేలా చూసుకుంటాను ఇక అప్పుడు నన్ను ఎవరు ఏమి చేయలేరు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఆశ అంతలోనే అరుణ్ కుమార్ అమృత అంజలి వాళ్ళు జైలు నుండి ఇంటికి వస్తారు అంజలి ఆశ, కావేరి దంపతులు మాట్లాడుకుంటున్న మాటలు అన్ని విని వీల్లేదు ఈ పెళ్లి జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను అని అంటుంది అంజలి వాళ్లను చూసిన కావేరి దంపతులు ఆశ ఇదేంటి అంజలి నువ్వు జైల్లో ఉన్నావు కదా నువ్వు బయటికి ఎలా వచ్చావు అని అడుగుతారు అరుణ్ కుమార్ బెయిల్ మీద నా కూతురు అంజలిని నేనే తీసుకొచ్చాను అని అంటాడు

కావేరి దరిద్రం వదిలింది అనుకుంటే మళ్ళీ దిగింది కదా ఇంకేముంది అంటూ తల మీద రెండు చేతులు పెట్టుకొని కూర్చుంటుంది అంజలి ఏంటి ఆశ పెళ్లి పెళ్లి అని ఒకటే ఆరాటపడుతున్నావ్ ఈ పెళ్లి నేనుండగా జరిపిస్తానని అనుకుంటున్నారా ఎట్టి పరిస్థితిలోనూ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అంటుంది అంజలి ఆశ ఏయ్ అంజలి జాగ్రత్తగా మాట్లాడు నేను ఈ ఇంటికి కాబోయే కోడల్ని అంటుంది ఆశ అంజలి కాబోయే కోడలు ఎలా అవుతావు నువ్వు అది బంటి కోలుకున్నాక అసలు నిజం బయటపడ్డాక ముసుగులో ఉన్న దొంగలు ఎవరో నిజం లో దాచుకున్న నీతిపరులు ఎవరో బయటకు వస్తారు అప్పటిదాకా పెళ్లి వార్త ఎవరు తీసుకురావద్దు అంటుంది అంజలి కావేరి ఆ మాట చెప్పడానికి నువ్వు ఎవరు అని అడుగుతుంది అంజలి అంజలి నేను ఎవరు అనేది సమస్య కాదు ఇప్పుడు బంటి కి గతం గుర్తుకు రావాలి అప్పుడు తెలుస్తుంది నేను ఎవరు అనేది అంటుంది అంజలి అరుణ్ కుమార్ అవును బావ నీకైనా తెలియదా బంటి సిచువేషన్ ఏంటి తన కండిషన్ ఏంటి ఇలాంటి సిచువేషన్ లో బండికి పెళ్లి ఎలా చేస్తారు అని అడుగుతాడు అరుణ్ కుమార్

అమృత అవును అసలు మతిస్థిమితం లేని మనిషితో పెళ్లి ఎలా జరిపిస్తారు అని అడుగుతుంది కావేరి భర్త బంటి తల్లిదండ్రులుగా మేము నిర్ణయం తీసుకున్నాము అంటాడు అంజలి మీరు నిర్ణయం తీసుకున్నారు అంటే నేను ఊరుకుంటాను అనుకుంటున్నారా నేను ఈ పెళ్లి ఆపడానికి ఎక్కడికైనా వెళ్తాను ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాను ఇది ఆర్డర్ కాదు హెచ్చరిక గుర్తుపెట్టుకోండి అంటూ బంటి గదిలోకి వెళుతుంది అంజలి.కట్ చేస్తే సాగర్ కు అంజలి బెయిల్ మీద రిలీజ్ అయిపోయిందని తెలుస్తుంది కోపంతో టెన్షన్ తో ఇంటికి వస్తాడు చి చి వేసిన ప్లాన్ అంతా రివర్స్ అయ్యింది అంటాడు సాగర్ పద్మావతి ఏమైందిరా సాగర్ అని అడుగుతుంది సాగర్ ఇంకా ఏముంది అంజలి అని అంత కష్టపడి జైల్లో పెట్టించి పెట్టించాము కదా కోర్టుకు తీసుకువెళ్లి అలాగే శిక్ష పడేలా చేద్దాము అనుకుంటే ఉన్నారు కదా అంజలి తల్లిదండ్రులు అరుణ్ కుమార్ బెయిల్ మీద రిలీజ్ చేసి తీసుకెళ్లాడు అంటాడు. పద్మావతి ఒరేయ్ సాగర్ జరిగిన పొరపాటు ఏదో జరిగిపోయింది ఇక అంజలి జోలికి వెళ్లకు రా అంజలి చాలా మంచి పిల్ల అంటుంది. ఇంతలో హాస్టల్ వార్డెన్ స్వేతను తీసుకొని వస్తుంది వార్డెన్ పద్మావతి గారు నేను ఎంత చెప్పినా వినకుండా శ్వేత నిన్నటి నుంచి ఏమి తినను కూడా తినడం లేదు జ్వరంతో పడుకుంది టాబ్లెట్ కూడా వేసుకోవడం లేదు లక్కీ లక్కీ అంటూ వాళ్ళ అమ్మని కలవరిస్తూ పద్మావతికి శ్వేతను ఇస్తుంది

సాగర్ శ్వేతను హాస్టల్ నుంచి తీసుకురావద్దని చెప్పాను కదా మళ్లీ ఎందుకు తీసుకొచ్చారు అంటాడు సాగర్ పద్మావతి ఒరే సాగర్ శ్వేతకు చాలా జ్వరంగా ఉంది తొందరగా డాక్టర్ కి ఫోన్ చేయరా సాగర్ అంటుంది పద్మావతి సాగర్ ఇప్పటికే నాకు తలనొప్పిగా ఉందంటే ఇప్పుడు ఇంకో తలనొప్పి నేను డాక్టర్ కి ఫోన్ చెయ్యను ఏం చేసుకుంటావో చేసుకో అంటాడు సాగర్ పద్మావతి కొండమ్మ నా మనవరాలు శ్వేతకు హై ఫీవర్ గా ఉంది నేను డాక్టర్ కి ఫోన్ చేసి పిలిపిస్తాను కాసేపు శ్వేతను పట్టుకో అని శ్వేతను కొండమ్మకి ఇచ్చి డాక్టర్ని పిలుస్తుంది డాక్టరు వచ్చి శ్వేతను చెక్ చేసి చాలా హై ఫీవర్ లా ఉంది అమ్మాయికి హాట్ ప్రాబ్లం ఉంది కదా అలాంటి పేషెంట్స్ కి ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా తట్టుకోలేరు ముందుగానే ట్రీట్మెంట్ చేయాలి అంటూ టాబ్లెట్ ఇంజక్షన్ ఇవ్వబోతుండగా శ్వేత లక్కీ వస్తేనే టాబ్లెట్ వేసుకుంటాను ఇంజక్షన్ వేసుకుంటాను లేకపోతే నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను అంటుంది శ్వేత అది విన్నా డాక్టర్ పద్మావతి గారు ఒకసారి మీరు బయటికి వస్తారా అంటూ పద్మావతిని బయటకు తీసుకువెళ్లి తన తల్లి లక్ష్మిని తొందరగా ఎక్కడ ఉన్నా పిలిపించండి లేదంటే అమ్మాయికి చాలా ప్రమాదం అని అంటుంది

పద్మావతి ఒరే సాగర్ శ్వేత కండిషన్ ఎలా ఉందో నీకు తెలిసింది కదా అంటుంది సాగర్ అయితే ఏం చేయాలి నేను ఇప్పుడు వెళ్లి ఆ అంజలిని బతిమిలాడుకోవాలని నేను ఆ పని అసలుకే చేయను అంటూ వెళ్ళిపోతాడు కొండమ్మ అయ్యో బాబు ఎంతైనా కన్నా కన్న కూతురు కదా అని అంటుంది సాగరు ఆ మాటలు వినకుండా వెళ్ళిపోతాడు పద్మావతి కొండమ్మ నువ్వు స్వేతను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు ఇదిగో ఈ టాబ్లెట్ వెయ్యి నేను ఎలాగైనా అంజలి అని ఒప్పించి మళ్లీ తీసుకు వస్తాను అంటూ అంజలి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది పద్మావతి కొండమ్మ అమ్మ సీతమ్మ నువ్వు ఈ ఒక్క టాబ్లెట్ వేసుకో లక్ష్మమ్మ ఎలాగైనా నీ దగ్గరికి వస్తుంది అని టాబ్లెట్ వేయబోతుండగా శ్వేత వద్దు టాబ్లెట్ నేను వేసుకోను మా లక్కీ వచ్చాకే నేను టాబ్లెట్ వేసుకుంటాను అప్పటిదాకా నాకు ఏది వద్దు అని విసిరి పడేస్తుంది శ్వేత.