
Kushi OTT Release Date: రొమాంటిక్ లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఖుషి సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించింది విజయ దేవరకొండ హీరో . శివనిర్వాణ దర్శకత్వం వహించాడు. నాస్తిక కుటుంబంలో పుట్టిన అబ్బాయి, ఆచారాలు, సంస్కృతులకు ప్రాముఖ్యతనిచ్చే ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి ఎలా ప్రేమలో పడ్డారు? కుటుంబ సిద్ధాంతాలు, నమ్మకాలు వారి ప్రేమకు ఏ విధంగా అడ్డంకిగా మారాయనే పాయింట్‌తో సింపుల్ ఎమోషన్స్‌కు ఇంపార్టెన్స్ ఇస్తూ దర్శకుడు శివనిర్వాణ ఖుషి సినిమాను తెరకెక్కించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఉద్యోగి అయిన విప్లవ్.. ఆరాధ్యని తొలిచూపులోనే ప్రేమించడం.. వెంటపడటం.. ప్రపోజ్ చేయడం.. పెద్దల నుంచి అంగీకారం లభించకపోవడంతో.. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం.. కొత్త కాపురం మొదలైపోవడం.. కథ కాశ్మీర్ నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోవడం. ఫస్టాఫ్ అంతా ఇలా చకచకా జరిగిపోతుంది. ఇంటర్వెల్ తరువాత అసలు కొథ మొదలౌతుంది.

లవ్‌లో పడ్డ జంటను విడగొట్టడానికి చిన్న ఇన్సిడెంట్ చాలు.. కానీ ఆ జంటను కలపడమే పెద్ద టాస్క్. అందులోనూ రొటీన్ లవ్ స్టోరీలో ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే అంశాన్ని చొప్పించి మెప్పించడం అంటే చిన్న విషయం కాదు. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా.. చూసిన కథే కదా అని సింపుల్‌గా తేల్చి పారేస్తారు. కాబట్టి.. ఆడియన్స్‌ని హోల్డ్ చేయడానికి ఖచ్చితంగా ఏదో ఒక బేస్ కావాలి.. ఈ కథలో అలాంటి బేస్ పాయింటే శాస్త్రం, సైన్స్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ప్రేమకథను అల్లాడు శివ నిర్వాణ. ఇంటర్వెల్ కి ముందు వరకు బాగానే ఉన్న సినిమా ని ఇంత బాగా అనవసరం అనుకున్నాడేమో డైరెక్టర్. చిరాకు పుట్టించే స్పెర్మ్ పరిక్షదగ్గిర వెకిలి కామెడీ, ఒక పార్టీ , అందులో పాట లాంటి అతకని సన్నివేశాలు ఇరికించాడు. తర్వాత మళ్ళీ సినిమా చివర్లో గాడిలో పడింది. మొత్తానికి పర్వాలేదు అనిపించాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ ఖుషి సినిమాలో మేజర్ హైలెట్‍గా హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab) సంగీతం ఉందని అంటున్నారు. అలాగే ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని, ముఖ్యంగా క్లైమాక్స్ 20 నిమిషాలు హృద్యంగా ఉందని చెబుతున్నారు.

విజయ్ దేవరకొండ, సమంతకు పాన్ ఇండియన్ లెవెల్‌లో ఉన్న క్రేజ్ వల్ల ప్రస్తుతం ఖుషి సినిమా ఓటీటీ డీల్, పార్టనర్, రిలీజ్ డేట్ ఆసక్తికరంగా మారాయి. ఖుషి డిజిటల్ స్టీమింగ్ (Kushi OTT Rights) హక్కులకు భారీ స్థాయిలో పోటీ నెలకొన్నట్లుగా సమచారం అందింది. దాదాపు 90 కోట్లకు ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. ఫిలిం సర్కిళ్లలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారమే ‘ఖుషి’ మూవీని అక్టోబర్ 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకు రాబోతున్నట్లు తాజాగా తెలిసింది. దీనిపై నెట్‌ఫ్లిక్స్ సంస్థ త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతుందని అంటున్నారు. ఇలా ఈ డేట్ ముందే బయటకు రావడంతో ఈ సినిమా కలెక్షన్లపై ఇప్పుడు ప్రభావం పడి , కలెక్షన్స్ తగ్గి పోయాయి. ఎలాగూ OTT లో వస్తుందిగా అని కొందరు హాల్ లో చూడ డం మానేసారేమో.
ఇక హీరోగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ నాడులో కూడా మంచి క్రేజ్ కలిగిన విజయ్ ఈ మూవీతో అక్కడ ఒక మ్యాజివ్ రికార్డు సొంతం చేసుకున్నారు. 2023 లో తమిళనాడులో రిలీజ్ అయి అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న తెలుగు మూవీగా ఖుషి నిలిచింది. కాగా ఈ మూవీకి అక్కడ మోటది వరం లోనే రూ. 7 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లభించడం విశేషం. అయితే ఈ కలెక్షన్ తెలుగు, తమిళ వెర్షన్స్ కలిపి లభించిన మొత్తం. మరి రాబోయే రోజుల్లో ఏ సినిమా ఈ రికార్డుని బీట్ చేస్తుందో చూడాలి.

Kushi OTT Release Date Details: ఇక సాధారణంగా థియేటర్లలో విడుదలైన చిత్రాలను నెల రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తారని తెలిసిందే. అలాగే విడుదలకు 30 రోజుల తర్వాత ఖుషి మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు డీల్ కుదుర్చుకున్నారట. అంటే సెప్టెంబర్ 1కి విడుదలైన ఖుషి అక్టోబర్ మొదటి వారంలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఫిలిం నగర్ ఏరియాలోని సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ‘ఖుషి’ మూవీని థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని తెలిసింది. అంటే సెప్టెంబర్ 1న విడుదలైన ‘ఖుషి’ మూవీ అక్టోబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందని ఇటీవలే సమాచారం బయటకు వచ్చేసింద తెలుగుతో పాటు తమిళం, మలయాళం కన్నడ భాషల్లో ఖుషి OTT రిలీజ్ కానున్నట్లు చెబుతోన్నారు.