సెప్టెంబర్ రెండవ తారీకు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అని అందరికీ తెలుసు. దీంతో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఈసారి పవన్ జన్మదిన వేడుకలు భారీ ఎత్తున చేయటానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే “జల్సా” మరియు తమ్ముడు సినిమాలకు సంబంధించి స్పెషల్ షోస్ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ నటిస్తున్న సినిమా “హరిహర వీరమల్లు” నుండి పవన్ బర్తడే నాడు సరికొత్త అప్డేట్ ఇవ్వడానికి డైరెక్టర్ క్రిష్ రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళ్తే “హరిహర వీరమల్లు” యాక్షన్ గ్లింప్స్ కట్ వీడియో విడుదల చేసి ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
గత కొంతకాలం నుండి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో చాలా వరకు సినిమా షూటింగ్ లో ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. పవన్ ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి మాసంలో “భిమ్లా నాయక్” రిలీజ్ చేసి హిట్ అందుకున్నారు. తర్వాత పవన్ “హరిహర వీరమల్లు” షూటింగ్ లో జాయిన్ కాగా కొద్ది రోజులు ఆ షూటింగ్ జరిగిన వెంటనే మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ కావడంతో ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో అభిమానుల అనుమానాలు మొత్తం నివృత్తి చేసే తరహాలో “హరిహర వీరమల్లు” నిర్మాతలు ఈ సినిమా యాక్షన్ కట్ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయడానికి రెడీ అయినట్లు టాక్. ఈ సినిమాలో చాలా వైవిధ్యమైన పాత్ర పవన్ చేస్తూ ఉన్నారు. మొగులూరు సామ్రాజ్యం కాలం నాటి చారిత్రకమైన కథతో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు గుర్రపు స్వారీలు మొత్తం హై ప్రొఫెషనల్ ఫైటర్స్ తో చిత్రీకరించినట్లు సమాచారం. చాలావరకు పవన్ బర్తడే నాడు ఈ సినిమాకి సంబంధించి విడుదల తేదీ వచ్చే అవకాశం ఉన్నది అని అభిమానులు భావిస్తున్నారు.