NTR 30: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `ఆర్ఆర్ఆర్`తో బిగ్ హిట్ ను ఖాతాలో వేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్‌తో పట్టాలెక్కబోతున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధ ఆర్ట్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ నిర్మించబోతున్నారు.
ఇది కూడా పాన్ ఇండియా చిత్రమే కాగా.. ఇందులో ఎన్టీఆర్ మాస్ రోల్లో దర్శనమివ్వబోతున్నాడు. హీరోయిన్ ఇంకా ఫైనల్ కాకపోయినా.. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి సంగీతం దర్శకుడిగా వ్యహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ రిలీజ్ పై ఓ నయా అప్డేట్ నెట్టింట వైరల్‌గా మారింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అదేంటంటే.. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్టులో ప్రారంభించబోతున్నారట. ఆరు నుంచి ఏడు నెలల్లో షూటింగ్ ను పూర్తి చేసి.. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఓ టాక్ బయటకు వచ్చింది. మరి ఈ ప్రచారమే నిజమైతే.. `ఎన్టీఆర్ 30` కోసం ఫ్యాన్స్ 2023 సమ్మర్ వరకు ఆగాల్సిందే.
కాగా, ఈ మూవీ అనంతరం ఎన్టీఆర్ ప్రముఖ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఓ మూవీ చేయనున్నాడు. ఇది ఎన్టీఆర్ కు 31వ ప్రాజెక్ట్ కాగా.. ఇది వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.