నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం `ఆదిపురుష్`, `సలార్`, `ప్రాజెక్ట్-కె`, `స్పిరిట్` వంటి పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ఇప్పటికే ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. సలార్, ప్రాజెక్ట్-కె చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇవి రెండూ ఫినిష్ అయిన వెంటనే `స్పిరిట్` స్టార్ట్ కానుంది.
వీటితో పాటు ప్రభాస్ ప్రముక దర్శకుడు మారుతితో ఓ సినిమా చేయబోతున్నాడని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలో ఉందని, మారుతి రూపొందించిన తాజా చిత్రం `పక్కా కమర్షియల్` హిట్టైతేనే ప్రభాస్ గ్రీన్ సిగ్నెల్ ఇస్తాడని వార్తలు వచ్చాయి. ఇక `పక్కా కమర్షియల్` జూలై 1న గ్రాండ్ గా విడుదలైంది.
టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా డల్ అయిపోయాయి. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అందుకుని క్లీన్ హిట్‌గా నిలిచే అవకాశాలే కనిపించడం లేదు. దీంతో ప్రభాస్, మారుతి ప్రాజెక్ట్ అటకెక్కినట్టే అని అంతా అనుకున్నారు.
కానీ, `పక్కా కమర్షియల్` ఫ్లాప్ అయినా.. మారుతితో సినిమా చేసే విషయంలో ప్రభాస్‌కు వెనక్కి తగ్గే ఉద్దేశమే లేదట. తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ మారుతి తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడట. ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే.. వీరి కాంబోలో తెరకెక్కబోయే చిత్రం హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోందట. మరి ఇది ఎంత వరకు నిజమో త్వరలోనే తెలియనుంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!