టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. బ్యాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. రమ్యకృష్ణ, రియల్ బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్, మకరంద్ దేశ్‌పాండే తదితరులు కీలక పాత్రలను పోషించారు.
ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై హై బడ్జెట్‌తో కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ నిర్మించారు. ఆగస్టు 25న ఈ చిత్రం మొత్తం ఐదు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఇండియా వైడ్‌గా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రానికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
గత కొద్ది రోజుల నుండీ బాలీవుడ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న `బాయ్ కాట్` ట్రెండ్ ‘లైగర్’ మీద కూడా పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే `బాయ్ కాట్ లైగర్` అన్న హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఈ సినిమా టీమ్‌కు మరో ఊహించని షాక్ తగిలిందని తెలుస్తోంది.
అదేంటంటే.. హిందీ వెర్షన్ ఒకరోజు ఆలస్యంగా విడుదల కాబోతోందట. ఆగస్టు 25న లైగర్ అన్ని భాషల్లో వరల్డ్ వైడ్ విడుదలవుతున్న కానుంది. అయితే నార్త్ ఇండియాలో మాత్రం పలు అనుకోని కారణాల వల్ల ఒకరోజు ఆలస్యంగా రిలీజ్ అవుతుందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. మరి ఇదే నిజమై లైగర్ ఒకరోజు ఆలస్యంగా విడుదలైతే.. పెద్ద దెబ్బ పడటం ఖాయమని అంటున్నారు. టాక్ పాజిటివ్‌గా వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు.. కానీ, రిజల్ట్‌లో ఏ మాత్రం తేడా వచ్చినా హిందీ వర్షన్ భారీ ఓపెనింగ్స్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!