టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం `లైగర్`. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ నిర్మించారు.
బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 25న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల అయింది. కానీ, తొలి ఆట నుంచే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. విజయ్ తనదైన పర్ఫామెన్స్తో అదరగొట్టేశాడు.. కానీ, కథాకథనంలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవడంలో ప్రేక్షకులే కాదు అభిమానులు సైతం పెదవి విరిచారు.
అయినాసరే ఫస్ట్ డే అదిరిపోయే కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం.. 2వ రోజు లైగర్ బాక్సాఫీస్ వద్ద బాగా నిరాశపరిచింది. ఇక మూడు రోజు హిందీ లో కొంచం బెటర్ కలెక్షన్స్ రావడంతో ఓవరాల్ గా ఓకే అనిపించుకుంది. కానీ, ఇది చాలదు. తెలుగు రాష్ట్రాల్లో మూడొవ రోజు రూ. కోటి రేంజ్ లో షేర్ ని రాబట్టిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ. 3.75 కోట్ల రేంజ్ లో షేర్‌ను వసూల్ చేయగలిగింది. ఇక వరల్డ్ వైడ్ గా లైగర్ 3 డేస్ టోటల్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే..
నైజాం: 5.36 కోట్లు
సీడెడ్: 1.72 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.63 కోట్లు
తూర్పు: 0.82 కోట్లు
పశ్చిమ: 0.52 కోట్లు
గుంటూరు: 0.94 కోట్లు
కృష్ణ: 0.61 కోట్లు
నెల్లూరు: 0. 51 కోట్లు
——————————–
ఏపీ+తెలంగాణ= 12.11కోట్లు(20.35 కోట్లు~ గ్రాస్)
——————————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 1.10 కోట్లు
ఇతర భాషలు: 0.40 కోట్లు
హిందీ: 4.60 కోట్లు
ఓవర్సీ: 3.05కోట్లు
——————————————–
టోటల్ వరల్డ్ వైడ్ = 21.26 కోట్లు(42.50కోట్లు~ గ్రాస్)
——————————————–
కాగా, రూ. 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. మూడు రోజుల్లో రూ. 21.26 కోట్లను రాబట్టింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అవ్వాలంటే.. ఇంకా రూ. 68.74 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.