Entertainment News సినిమా

`లైగ‌ర్‌` ఫ‌స్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Share

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ, డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో `లైగ‌ర్‌` అనే మూవీ తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తే.. ర‌మ్యకృష్ణ, రియ‌ల్ బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్, మకరంద్ దేశ్‌పాండే త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

బ్యాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై హై బ‌డ్జెట్‌తో కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ నిర్మించారు. ఆగ‌స్టు 25న అంటే మ‌రికొన్ని గంట‌ల్లోనే ఈ చిత్రం తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే బుక్కింగ్స్ ఓ రేంజ్‌లో జ‌రుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా `లైగ‌ర్‌` ఫ‌స్ట్ రివ్యూ బ‌య‌ట‌కు వ‌చ్చింది. టాలీవుడ్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ విమర్శకుడు, ఓవర్ సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు లైగర్​ సినిమాను వీక్షించి తన అభిప్రాయాన్ని ట్విట్ట‌ర్ ద్వారా పోస్ట్ చేశారు. ఇంత‌కీ ఆయ‌న ఏం చెప్పారంటే..

`లైగర్​ మూవీ ఒక సీటి మార్​ మాస్​ ఎంటర్​టైనర్​. విజయ్​ దేవరకొండ వన్ మ్యాన్​ షో చేశాడు. సినిమా మొత్తం విజయ్ ఒక్కడే కనిపిస్తాడు. యాక్షన్​ స్టంట్స్, దర్శకత్వం అద్భుతంగా ఉన్నాయి. ఇక రమ్యకృష్ణ ఒక సర్​ప్రైజ్​ ప్యాకేజీ. స్టోరీ, స్క్రీన్​ప్లే మాత్రం యావరేజ్​గా ఉన్నాయి` అని ఉమైర్ సంధు పేర్కొన్నారు. అలాగే 3 స్టార్ రేటింగ్‌కు కూడా ఇచ్చారు. మ‌రి ఈ సినిమా రేపు ఏ స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుందో చూడాలి.


Share

Related posts

‘వకీల్ సాబ్’ గా పవన్ కళ్యాణ్ దిల్ రాజు కి షాక్ ఇవ్వబోతున్నాడా…?

siddhu

లక్ష రెండు లక్షలు కాదు .. స్పాట్ లో 2 కోట్లు ఇచ్చేశాడు .. గోపిచంద్ తోపురా..!

GRK

రివ్యూ : పావ కథైగల్ – నెట్ ఫ్లిక్స్

siddhu