టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జాగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `లైగర్`. బ్యాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. రమ్యకృష్ణ, రియల్ బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్, మకరంద్ దేశ్‌పాండే తదితరులు కీలక పాత్రలను పోషించారు.
ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై హై బడ్జెట్‌తో కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ తన కెరీర్లోనే తొలిసారి బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. ఆగస్టు 25న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఇటు సౌత్‌లోనూ, ఇటు నార్త్‌లోనూ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు.
దాంతో ఈ సినిమాకు ఊహించని రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం యొక్క థియేట్రికల్ రైట్స్ ను ఏకంగా రూ. 88.40 కోట్లకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. టాలీవుడ్ టైర్ 1 హీరోల రేంజ్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా విజయ్ దేవరకొండ సినిమాకు బిజినెస్ జరగడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఏరియాల వారీగా `లైగర్` టోటల్ బిజినెస్ లెక్కలను ఓ సారి గమనిస్తే..
నైజాం: 25 కోట్లు
సీడెడ్: 9 కోట్లు
ఉత్తరాంధ్ర: 7.5 కోట్లు
తూర్పు: 5 కోట్లు
పశ్చిమ: 3.8 కోట్లు
గుంటూరు: 5.2 కోట్లు
కృష్ణ: 4.3 కోట్లు
నెల్లూరు: 2.2 కోట్లు
——————————
ఏపీ+తెలంగాణ= 62 కోట్లు
——————————
కర్ణాటక: 5.20 కోట్లు
తమిళం: 2.5 కోట్లు
కేరళ: 1.20 కోట్లు
ఓవర్సీస్: 7.50 కోట్లు
నార్త్ ఇండియా: 10 కోట్లు
———————————
టోటల్ వరల్డ్ వైడ్:- 88.40 కోట్లు
———————————
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 88.40 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో ఆగస్టు 25న బరిలోకి దిగుతోంది. మరి ఇంత పెద్ద టార్టెగ్ను విజయ్ రీచ్ అవుతాడా..లేదా.. అన్నది చూడాలి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!