Entertainment News సినిమా

`లైగ‌ర్‌` ఎన్ని థియేట‌ర్స్‌లో రిలీజ్ అవుతుందో తెలిస్తే మైండ్‌బ్లాకే!

Share

లైగ‌ర్‌ టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్` రేపు అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీతో బాలీవుడ్ స్టార్ కిడ్ అన‌న్య పాండే టాలీవుడ్‌కు ప‌రిచ‌యం కాబోతోంది. ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రానికి పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

బ్యాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌లో ర‌మ్యకృష్ణ, రియ‌ల్ బాక్సింగ్ లెజెండ్‌ మైక్ టైసన్, మకరంద్ దేశ్‌పాండే త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మ‌రికొన్ని గంట‌ల్లోనే ఈ చిత్రం తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే బుక్కింగ్స్ ఓ రేంజ్‌లో జ‌రుగుతున్నాయి.

మ‌రోవైపు థియేట‌ర్స్ అభిమానులు సంద‌డి నెక్స్ట్ లెవ‌ల్‌లో కొన‌సాగుతోంది. ఇక‌పోతే ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్ని థియేట‌ర్స్‌లో రిలీజ్ అవుతుందో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వ‌డం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 930 కి పైగా థియేటర్స్ ను సొంతం చేసుకోగా.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆల్ మోస్ట్ 3000 వరకు స్క్రీన్స్ ను ద‌క్కించుకున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది.

ఏదేమైనా మీడియం రేంజ్ హీరోకు ఈ రేంజ్‌ థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోవడం నిజంగా విశేష‌మ‌నే చెప్పాలి. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 88.40 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రేపు బ‌రిలోకి దిగుతోంది. హిట్ టాక్ వ‌చ్చిందంటే.. విజ‌య్ బాక్సాఫీస్ వ‌ద్ద విధ్వంసం సృష్టించ‌డం ఖాయం.


Share

Related posts

Mahesh : మహేష్ సర్కారు వారి పాట మళ్ళీ దుబాయ్‌కా.. అప్పుడే రీ షూటా..?

GRK

Bigg Boss Ott: వారం ఉన్న ముమైత్‌కు బిగ్‌బాస్ ఇచ్చిందెంతో తెలుసా?

kavya N

మహేష్ కొత్త సినిమాలో పవన్ కళ్యాణ్..??

sekhar