Chiranjeevi: తెలుగు చలనచిత్ర రంగంలో కరోనా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలో చేస్తున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. పాండమిక్ తర్వాత ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ చేశారు. ప్రస్తుతం బోలా శంకర్ సినిమా చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది. ఈ సినిమా వేసవికాలంలో విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. ప్రస్తుతం క్లైమాక్స్ దశలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకీ సంబంధించి ఇటీవల చిన్న పాటీ పోస్టర్ తో కూడిన అప్డేట్ శివరాత్రి సందర్భంగా ఇచ్చారు.
ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు చిరంజీవితో సినిమా చేయడానికి ఊహించని రీతిలో దర్శకులు రెడీ అవుతున్నారు. మెయిన్ గా కుర్ర దర్శకులతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే వెంకీ కుడుముల చిరంజీవి కోసం ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేయడం జరిగింది అంట. ఇటీవల ఆయనకి స్టోరీ కూడా వినిపించడం జరిగిందంట. అంతా ఓకే అయినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇంకా ఇదే తరహాలో మారుతి, హరి శంకర్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ వీళ్లంతా చిరు కోసం స్టోరీలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
కొద్దిపాటి టైంలోనే ఈ సినిమాలన్నీ కంప్లీట్ చేసి.. వీలైనంత త్వరగా ప్రాజెక్టులు పట్టాలెక్కించడానికి చిరంజీవి ఆసక్తి చూపిస్తున్నారట. ఇంకా దర్శకుల లిస్టు చూస్తే రవితేజతో ఇటీవల ధమాకా తీసిన దర్శకుడు త్రినాధరావు అదేవిధంగా బంగారు రాజు దర్శకుడు కళ్యాణి కృష్ణ కూడా చిరంజీవి కోసం స్టోరీలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి వీరందరిలో నెక్స్ట్ ఎవరితో చిరంజీవి సినిమా చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.