మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. బడా సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనదైన టాలెంట్ తో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి ధరమ్ తేజ్.. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు.
ఈ సంగతి పక్కన పెడితే సాయి ధరమ్ తేజ్ బ్రెజిల్ బ్యూటీ లారిస్సా బోనేసితో ప్రేమాయణం నడిపిస్తున్నాడంటూ తాజాగా వార్తలు ఊపందుకున్నాయి. వీరిద్దరూ జంటగా `తిక్కా` సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. కానీ సాయి ధరమ్ తేజ్, లారిస్సా మధ్య మంచి స్నేహం ఏర్పడింది.
అయితే ఆ స్నేహం ఇప్పుడు ప్రేమగా మారిందంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. నిన్న సాయి ధరమ్ తేజ్ బర్త్డే. ఈ సందర్భంగా `హ్యాపీ బర్త్డే టూ మై తేజు` అంటూ లవ్ సింబల్ ను జోడించి లారిస్సా ట్వీట్ చేయగా.. తేజ `టూ మై డిస్టబెన్స్` అంటూ రిప్లై ఇచ్చాడు. అందుకు లారిస్సా `ఫరెవర్` అంటూ ట్వీట్ చేసింది.
వీరి ట్వీట్లను చూసిన నెటిజన్లు సాయ్ ధరమ్ తేజ్-లారిస్సా లవ్ లో ఉన్నారా..? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా తేజ్ బర్తడే రోజే `నేను ప్రేమలో ఉన్నాను` అంటూ లారీస్సా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ తో అందరి అనుమానాలకు మరింత బలం చేకూరింది. మరి నిజంగానే సాయ్ ధరమ్ తేజ్-లారిస్సా ప్రేమలో ఉన్నారా..? లేదా..? అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
To My disturbance ❤️❤️❤️ pic.twitter.com/Vfc9iTaFEG
— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 15, 2022
Hahahaha forever and always ! ♥️♥️♥️ https://t.co/136hB5m0TV
— Larissa Bonesi (@larissabonesi) October 15, 2022
https://twitter.com/larissabonesi/status/1449041255443451909?s=20&t=AQ-cVln0ZOwvl6TMN1d89w