Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయ్యి అప్పుడే మొదటి వారం కాబోతోంది. మొదటి వారంలో ఇంటి నుండి ఎలిమినేట్ కావటానికి మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. అయితే ఈ 8 మందిలో ఎవరు హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే హౌస్ లో ఎప్పటి మాదిరిగానే ఈ సీజన్లో కూడా లవ్ ట్రాకులు మొదలైనట్లు తెలుస్తోంది. స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి చూస్తే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ లేడి కంటెస్టెంట్ రతిక మధ్య బాండింగ్ ప్రేమ వైపు అన్నట్టు కొనసాగుతున్నట్లు ప్రేక్షకుల నుండి టాక్ నడుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన నాటి నుంచి పల్లవి ప్రశాంత్ రతిక మాయలో పడిపోయాడు. విన్నర్ అవుతానని హౌస్ లో ఇప్పుడు రోజంతా రతికా చుట్టే తిరుగుతున్నాడు.
మరోవైపు రతిక… చాలా క్లారిటీ గానే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ రైతు బిడ్డ మాత్రం మరి ఓవర్ గా రతిక విషయంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ప్రొజెక్ట్ అవుతుంది. రతిక ఎవరితోనైనా… చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్న ప్రశాంత్ తట్టుకోలేకపోతున్నాడు. ఈ విషయంలో కంటెస్టెంట్ సైతం ప్రశాంత్ నీ ఏడిపించే రీతిలో వ్యవహరిస్తున్నారు. టేస్టీ తేజను రతిక చేత బాబాయ్ అని పిలిపించాడు. తర్వాత ఎందుకు పిలవమన్నావు అంటూ ప్రశాంత్ నీ రతిక అందరి ముందు అడిగేసింది. దమ్ముంటే బాబాయి అని పిలవమన్నావు కదా… నువ్వు పిలవమంటేనే పిలిచాను. నీకు హార్ట్ ఉంది కదా అంటూ గుర్తు చేసింది.
దీంతో ప్రశాంత్ నా ఫీలింగ్స్.. నువ్వెందుకు పట్టించుకుంటున్నవు అనే రీతిలో డైలాగులు వేశాడు. అక్కడే ఉన్న శివాజీ ఏయ్ అది నా పిల్ల అని చెప్పగా.. వెంటనే ప్రశాంత నా పెళ్ళంటూ అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీరిద్దరి మధ్య మాత్రమే కాదు గౌతమ్ కృష్ణ ఇంకా శుభశ్రీ మధ్య కూడా బాండింగ్ ఆ దిశగానే.. ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే రతిక.. విషయంలో ప్రశాంత్ ప్రవర్తన ఇంట్లో హౌస్ మేట్స్ అందరికీ వింతగా ఉంది. మరోపక్క శుభశ్రీ వద్ద.. ప్రశాంత్ నాకు వ్యక్తిగతంగా ఫ్రెండ్ మాత్రమే అన్నట్టు రతిక తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా మొదటి వారంలోనే సీజన్ సెవెన్ లో లవ్ ట్రాక్ లు స్టార్ట్ అయినట్లు ఆడియన్స్ భావిస్తున్నారు.