Maa Atha Bangaram: ఈటీవీలో మరో సరికొత్త సీరియల్ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.. మా అత్త బంగారం టైటిల్ తో ఫిబ్రవరి 13 మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ సీరియల్ మొదలుకానుంది.. సోనీ టీవీలో పాపులర్ సీరియల్ అయినా ఏక్నయిపెంచన్ ను తెలుగులో శారదా సీరియల్ గా 2015లో జెమినీ టీవీలో డబ్బు చేశారు ఇప్పుడు అదే సీరియల్ కు రీమేక్ గా మా అత్త బంగారం సీరియల్ రానుంది. తాజాగా మా అత్త బంగారం సీరియల్ ప్రోమో విడుదలవుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ సీరియల్ కథెంటో ఓసారి చూసేద్దాం..

అమ్మగారు టీవీ అంతా సరస్వతి.. సరస్వతి.. అంటూ మీ పేరే.. అలాంటి చోటుకు మీరు ఎందుకు వెళ్లారు అని పనిమనిషి అడుగుతుండగా.. అలాంటి చోటులకు నేనెందుకు పద్మ ఈ ఇల్లు నాకు ప్రపంచం అని అంటుంది.. సరస్వతి ఒక సాధారణమైన నీ పేరుని ఒక బ్రాండ్ పేరుగా మార్చావు.. కానీ నిన్ను మాత్రం మార్చలేకపోతున్నాను.. రోజంతా ఇంట్లో ఉండడం కాదు ఒక్కరోజు నాకులాగా ఆఫీస్ వర్క్ చూసి చూడు అర్థం అవుతుంది అయ్యో అమ్మ చదువుల అని నీకు ఎకౌంట్స్ ఇచ్చారు చూడు అందుకు డాడ్ నీ అనాలి..

నాకు కాబోయే కోడలు .. అందం , గుణం ,పద్ధతి, ఇంగ్లీషు, ఆచారం అన్నింటిలోనూ నీలా ఉంటే చాలు అంటూ అంటూ అమ్మవారి వైపు చూస్తూ నీలా ఉంటే చాలు … అంతకు మించిన వరం అదృష్టం నాకు ఏం వద్దు తల్లి అని అమ్మవారిని కోరుకుంటుంది సరస్వతి.. ఇక సరస్వతి ఏదో ప్రయాణం మీద ట్రైన్ ఎక్కవలసి వస్తే ఒక అమ్మాయి తనని దగ్గరుండి ట్రైన్ ఎక్కిస్తుంది.. చదువుకోవచ్చు కదా అని తను సలహా ఇస్తుంది.. ఈ వయసులో చదువు అనగానే.. దించే తల చదువు కోసం అయితే ఎక్కడ తలదించిన కానీ.. ఆ తరువాత జీవితాంతం తల ఎత్తుకొని బ్రతకచ్చు అని అంటుంది.. ఇక ఫైనల్ గా అత్తా కోడలు ఇద్దరు కలిసి ట్రైన్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.. కోడలు మా అత్త బంగారం అనడంతో ప్రోమో ముగుస్తుంది.

ఈ సీరియల్ లో హీరోయిన్ గా దివ్య గణేష్ నటిస్తున్నారు.. దివ్య గణేష్ గతంలో భాగ్యరేఖ సీరియల్ లో నటించారు. ఇంకా తమిళంలో పలు సీరియల్స్ లో నటించారు. ఈ సీరియల్ శ్రీ రాజ్ కూడా నటిస్తున్నారు. పద్మవ్యూహం , కృష్ణ ముకుందా మురారి ఇలా పలు సీరియల్స్ లో నటిస్తున్నారు. సీనియర్ నటి పద్మసాగర్ కూడా ఈ సీరియల్ లో నటిస్తున్నారు. అత్తా కోడళ్ళ కాన్సెప్ట్ లో వస్తున్న ఈ సీరియల్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
