Maamagaru: మాటీవీలో దేవత సీరియల్ అందరికీ గుర్తుంటుంది. ఆ సీరియల్ లో మెయిన్ క్యారెక్టర్ చేసిన సుహాసినిమామగారు అనే సీరియల్ తో మన ముందుకు రాబోతుంది.ఇందులో కూడా మెయిన్ లీడ్ రోల్ పోషిస్తుంది. సుహాసిని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, చంటిగాడు సినిమాతోమంచి ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈమె దేవతా సీరియల్ తో మంచి హిట్నే కొట్టింది చాలా రోజుల తర్వాత ఇప్పుడు కొత్త సీరియల్ తో మళ్లీ మన ముందుకు రాబోతుంది. ఈ సీరియల్ లో సుహాసిని తో పాటు దర్శన్ అనే యాక్టర్ నటిస్తున్నాడు హీరోగా,ఈ సీరియల్లో సుహాసిని మామ ని మార్చే కోడలిగా మన ముందుకు రాబోతుంది.

శ్రీ శివ సాయి బ్యానర్ పై తెరపెక్కుతున్న ఈ సీరియల్ ని, సుహాసిని నే ఓన్ గా ఈ సీరియల్ నిర్మిస్తుంది.స్టార్ మా లో టెలికాస్ట్ అయ్యే అన్ని సీరియల్స్ కూడా ప్రేక్షకాదరులను పొందుతూ ఉంటాయి.మామగారు అనే కొత్త సీరియల్ లో కూడాహీరోయిన్ కి కష్టాలు తప్పవని తెలుస్తుంది. సింపుల్గా ప్రోమోలో ఇంట్లో ఆడవాళ్లు ఉద్యోగాలు చేయడానికి వీలు లేదు అని మామగారి కండిషన్ పెడతారు. చదువుకొని ఆ ఇంటి కోడలుగా వచ్చిన సుహాసిని ఎలాగైనా మామ గారిని ఒప్పించి ఉద్యోగం చేయాలి అని అనుకుంటుంది. సుహాసిని మామ గారిని ఎలా మార్చింది, అసలు మామగారు కోడలి మాట విన్నారా లేదా అనేది తెలియాలంటే ఈ సీరియల్ ని స్టార్ మా లో ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే, దేవదాసిరియల్ అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది మర్రి మరొక ఫ్యామిలీ డ్రామా తో మన ముందుకు వస్తోంది సుహాసిని, అపరంజి నా కోడలు బంగారం ఇలా చాలా సీరియల్స్ లో సుహాసిని ప్రేక్షకుల్నిఅలరించింది.

ఇందులో హీరోగా దర్శన్ కే రాజు యాడ్ చేస్తున్నాడు. అంతకుముందు ఈయన కన్నడంలో నటించాడు. తెలుగులో ఫస్ట్ ఈ సీరియల్ లో నటిస్తున్నారు. మైకో మంజు ఈ సీరియల్లో మెయిన్ మామగారు పాత్ర పోషిస్తున్నాడు. రంగోలి కావ్యాంజలి ఈ సీరియల్స్ లో ఆల్రెడీ ఇంతకుముందు ఈయన నటనతో మెప్పించారు ఇప్పుడు ఈ సీరియల్ లో సీరియస్ పాత్రలో మన ముందుకు రాబోతున్నారు. ఇక అత్తగారి పాత్రలో మేఘన నటిస్తుంది ఈమె ఆల్రెడీ దేవత సీరియల్ లో మనందరికీ పరిచయస్తురాలే, రజిత కూడా ఒక మంచి పాత్రలో ఈ సీరియల్ లో మనకి కనిపించబోతోంది.

అమ్మాయిగారు సీరియల్ లో నటిస్తున్న మానస కూడా ఈ సీరియల్ లో ఒక పాత్రలో మనకి కనిపించబోతోంది.అమృతం సీరియల్ తో మనందరికీ పరిచయమైన మల్లాది రాఘవ కూడా ఈ సీరియల్లో హీరోకి అన్నయ్యగా నటిస్తున్నాడు. వదినమ్మ సీరియల్లో యాక్ట్ చేసిన లక్ష్మణ్ కూడా ఈ సీరియల్ లో హీరోకి అన్నయ్య పాత్రలో మనకి కనపడనున్నారు.గీతాంజలి సీరియల్ లో నటించిన చిన్ని కృష్ణ కూడా ఈ సీరియల్లో ఒక మంచి పాత్రలో మనకి కనపడనున్నన్నారు.

ఈ సీరియల్ సెప్టెంబర్ 11 వ తారీకు నుండి మనకి స్టార్ మా లో ప్రసారం కానుంది. ఈ సీరియల్ సాయంత్రం 6:30 కి మాటీవీలో ప్రసారం కానుంది అంతకుముందు ఎదలో ఎల్లో ఇంద్రధనస్సు సీరియల్ ని, మార్నింగ్ టైం కి షిఫ్ట్ చేసి ఈ సీరియల్ ని ఆరు గంటల 30 నిమిషాలకు ప్రసారం చేయనున్నారు. చక్కటి కథనాలతో రేపటినుండి ఈ సీరియల్ మాటీవీ లో ప్రసారం కానుంది. ఈ సీరియల్ కూడా దేవత సీరియల్ లాగా సుహాసిని కి మంచి గుర్తింపు రావాలని కోరుకుందాం.