గత కొంత కాలం నుండి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న హీరో నితిన్.. త్వరలోనే `మాచర్ల నియోజకవర్గం`తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.
ఇందులో యంగ్ బ్యూటీ కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటించగా.. విలక్షణ నటుడు సముద్రఖని విలన్‌గా చేశాడు. అంజలి స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. అనేక వాయిదాల అనంతరం ఆగస్టు 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను బయటకు వదిలారు.
నితిన్ “మాచర్ల నియోజకవర్గం” సాంగ్ రికార్డుల మోత..!!
ఇవాళ వైజాగ్ చాలా కొత్తగా కనిపిస్తోందిరా` అని నితిన్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్.. ఆధ్యంతం ఆకట్టుకుంది. మొదట లవర్ బాయ్‌గా వినోదం పంచిన నితిన్.. ఆ తర్వాత గుంటూరు కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డిగా పవర్ ఫుల్ పర్ఫామెన్స్‌తో విశ్వరూపం చూపించాడు. మాచర్ల నియోజకవర్గంలో ఎలాంటి ఎన్నికలు లేకుండా ప్రజలను అణగదొక్కుతూ ఏకగ్రీవంగా ఎన్నికవుతున్న విలన్ రాజప్పగా సముద్రఖని నటించాడు.
అలాంటి నియోజక వర్గంలో ఎన్నికలను నిర్వహించాలని నిశ్చయించుకుంటారు సిద్దార్థ్. ఆ తర్వాత రాజప్ప, సిద్దార్థ్ మధ్య జరిగే పోరే ఈ సినిమా మెయిన్ కథ అని ట్రైలర్ బట్టీ అర్థం అవుతోంది. `నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్‌లా పంచ్‌లు. వీళ్లేమో బోయపాటి శ్రీనులా యాక్షన్లు. ఇప్పుడు నేనేం చేయాలి? రాజమౌళి హీరోలా ఎలివేషన్ ఇవ్వాలా?`, `సివిల్ స్వర్వెంట్స్ అందరూ సాఫ్ట్ అని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. నేను ఇన్‌బిల్ట్ కమర్షియల్ అమ్మా, డైరెక్టర్ యాక్షనే` అంటూ నితిన్ చెప్పే డైలాగ్స్ విజిల్స్ వేయిస్తున్నాయి.
ఫైట్స్, విజువల్స్, బ్యాక్ గ్రైండ్ మ్యూజిక్ వంటివి కూడా బాగా అలరించాయి. కృతి శెట్టి – కేథరిన్ థ్రెసా లకు ట్రైలర్ లో పెద్దగా స్పేస్ ఇవ్వలేదు.. కానీ, వారిద్దరి ప్రాతలకు మంచి ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. మొత్తానికి అదిరిపోయిన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. అంతేకాదు, ట్రైలర్ చూసిన నెటిజన్లు.. ఈ సారి నితిన్‌కు హిట్ ఖాయమంటూ కామెంట్స్ చేస్తుంది. మరి కామెడీ – యాక్షన్ – రొమాన్స్.. ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపుదిద్దుకున్న `మాచర్ల నియోజకవర్గం` ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.