Madhura Nagarilo Today Episode సెప్టెంబర్ 11:ఏంటి సంయుక్త ఇంకా ఫోన్ చేయడం లేదు అక్కడ ఏం జరుగుతుందో ప్రతి విషయం నాకు ఫోన్ చేసి చెప్పేది కదా అని వాళ్ళ అమ్మ అనుకుంటుంది. ఇంతలో సంయుక్త వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది హలో సంయుక్త ఏంటమ్మా ఇంకా ఫోన్ చేయలేదని నేను అనుకుంటున్నాను అక్కడ ఏం జరుగుతుంది అని వాళ్ళమ్మ అడిగింది. అబ్బా ఏమీ లేదమ్మా నేను ఒకటి అనుకుంటే అక్కడ ఒకటి అయింది రాధా ఇంట్లో ఫీజు తీసేసి కరెంట్ లేకుండా చేసి తనని ఏడిపిద్దాము అని అనుకుంటే శ్యామ్ రాధా కలిసి నన్ను ఆడుకుంటున్నారు అని సంయుక్త అంటుంది. ఏంటే అలా మాట్లాడుతున్నావ్ ఏదో ఒకటి చేయొచ్చుగా అని వాళ్ళ అమ్మ అంటుంది.

నేను ఏదో ఒకటి చేసేలోగా శ్యామ్ వెళ్లి రాధా ఒడిలో పడ్డాడు అది చూడలేక నేను ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను నువ్వు ఫోన్ కట్ చెయ్ అని సంయుక్త అంటుంది. శ్యామ్ సంయుక్త దగ్గరికి వచ్చి నువ్వు ఇలాంటి ప్లాన్లు ఎన్ని వేసిన కరెంటు కట్ చేయడాలు వాటర్ రానివ్వకుండా ఆపడాలు ఇలాంటివి ఎన్ని చేసినా రాధ ఇక్కడి నుంచి వెళ్లదు ఇలాంటి పిచ్చి పనులు ఆపేయ్ ఇప్పుడు నేను నీ ఇంట్లో ఫీజు తీసేస్తాను రాత్రంతా దోమలు కొట్టుకుంటూ జాగారం చేయి నువ్వు అని శ్యామ్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే తెల్లవారింది రాదా వాకింగ్ కు వెళ్తుంది. షాము కూడా పొద్దున్నే లేస్తాడు ఏంటి ఇంత పొద్దున్నే నాకు మెలకువ వచ్చింది అని బాల్కనీలోకి వచ్చి చూడగానే రాదా వాకింగ్ కి వెళుతుంది అరే రాదా రోజు ఇంత పొద్దున్నే లేచి వాకింగ్ కి వెళ్తుందా ఈ విషయం ముందే తెలిస్తే నేను కూడా పొద్దున్నే లేచి వాకింగ్ కి రాధ తో పాటు నేను కూడా వెళ్తాను కదా అని దగ్గరికి వెళ్లి హాయ్ రాధా గుడ్ మార్నింగ్ ఏంటి వాకింగ్ కా అని అడుగుతాడు శ్యామ్. అవును సార్ మీరేంటి పొద్దున్నే లేచారు లేటుగా లేచి లేటుగా వాకింగ్ కి వెళ్తారు కదా అని రాధ అంటుంది.

రోజు నువ్వు ఇంత పొద్దున్నే వాకింగ్ కి వెళ్తావు అని తెలియక నేను లేటుగా లేచి లేటుగా వాకింగ్ కి వెళ్తున్నాను అని అంటా నని అనుకున్నావా అననుగా అస్సలు అలా అనను కదా అని శ్యామ్ అంటాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్లిపోతారు. దీనితో వాకింగ్ కి వెళ్లడానికేనా శ్యామ్ ఇంత పొద్దున్నే లేచింది అని మధుర మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే రాధవల నాన్న హైదరాబాదుకి బయలుదేరుతాడు. ఏవండీ మీరు హైదరాబాదు వెళుతున్నారు కదా రెండు మూడు రోజులు లేట్ అయినా సరే అక్కడే ఉండి రాదని పెళ్లికి ఎలాగైనా ఒప్పించండి అని వాళ్ళ అమ్మ అంటుంది. రాధా రెండు మూడు రోజులు కాదు పది రోజులు ఉండి చెప్పినా రాధ ఒప్పుకోదు పండు జీవితం కన్నా నా జీవితం ముఖ్యం కాదు అని అంటుంది రాదా అని వాళ్ళ నాన్న అంటాడు.

కావచ్చు అండి కానీ ఏ తల్లి కైనా బిడ్డ పెళ్లి చేసుకుని తన కళ్ళ ముందు కళకళలాడుతూ తిరుగుతూ ఉంటే చూడాలని ఉంటుంది కదా అని వాళ్ళ అమ్మ అంటుంది. అవును కానీ రాదని పెళ్లి చేసుకునే వాడు పండు ని సొంత కొడుకు లాగా చూసుకుంటాడో చూసుకోడో అని రాదా బాధపడుతుంది అని వాళ్ళ నాన్న అంటాడు. రాధకు పెళ్లయి పిల్లలు పుడితే వాళ్ళ పిల్లలతో పాటు వీడిని కూడా కొడుకులా చూసుకుంటాడు ఎందుకు చూసుకోడు అని వాళ్ళ అమ్మ అంటుంది. ఏమో ఎందుకు రాదా అలా భయపడుతుందో అని వాళ్ళ నాన్న అంటాడు. అయితే పండుని మన దగ్గరే పెంచుకుందాము అని వాళ్ళం అమ్మ అంటుంది. అందుకు రాధ ఒప్పుకోదు పండు కూడా చిన్నప్పటినుంచి రాదే వాళ్ళ అమ్మ అనుకుంటున్నాడు కాబట్టి పండు కూడా మనతో ఉండడు ఉండలేడు అని వాళ్ళ నాన్న అంటాడు.

కట్ చేస్తే పండు ఈరోజు స్కూల్ కి వెళ్ళవా అని రాదా అడుగుతుంది. ఈరోజు స్కూల్ కి వెళ్ళాలని లేదమ్మా అని పండు అంటాడు. ఇంతలో మధుర అక్కడికి వచ్చిది. ఏంటి నాని నువ్వు మా ఇంటికి వచ్చావు నన్ను మీ ఇంటికి రావద్దు అన్నావు కదా కానీ నువ్వు మాత్రం మా ఇంటికి ఎందుకు వచ్చావు అని పండు అంటాడు. పండు అలా అనకూడదు రా నువ్వు వెళ్లి ఆడుకో అని రాధా అంటుంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున ఎలా మేస్తుంది వాడు అలా మాట్లాడడానికి కారణం నువ్వే సరేలే నేను ఎందుకు వచ్చానంటే ఈ బ్యాంక్ చెక్ తీసుకొని నీకు ఎంత డబ్బు కావాలో అంత రాసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని మధుర అంటుంది. మేడం నాకు అవసరం లేదు అని రాదా అంటుంది. నువ్వు ఇందుకే కదా ఇక్కడికి వచ్చింది శ్యామ్ ని వలలో వేసుకున్నది ఈ డబ్బు కోసమే కదా ఇస్తాను తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో అని మధుర అంటుంది. మేడం మీరు ఆ సంయుక్త మాయలో పడి ఇలా నన్ను అనరాని మాటలు అంటున్నారు కానీ ఆ సంయుక్త ఎలాంటిదో మీకు తెలిసేలా చేస్తాను నేను శ్యామ్ సార్ ని వలలో వేసుకోలేదు తనని పెళ్లి చేసుకోవాలని అస్సలు అనుకోవట్లేదు పండు భవిష్యత్తు కంటే నాకు ఏది ముఖ్యం కాదు అని రాదా అంటుంది.

నేను జరిగిపోయిన వాటి గురించి మాట్లాడడానికి రాలేదు జరగాల్సిన దాని గురించి మాట్లాడడానికి వచ్చాను నువ్వు ఈ చెక్కు తీసుకొని వెళ్ళిపో అని మధుర మళ్లీ అంటుంది. మేడం మీరు ఏం చేసినా నేను ఇక్కడ నుండి వెళ్లేదే లేదు అని రాదా తెగేసి చెబుతుంది.అయితే ఇక్కడే ఉంటావా వెళ్ళావా సరే నువ్వు ఎలా వెళ్ళవో శ్యామ్ కి నీకు ఎలా పెళ్లి జరుగుతుందో చూస్తాను అని మధుర అక్కడి నుండి వెళ్ళిపోతుంది