Madhura Nagarilo సెప్టెంబర్ 13 ఎపిసోడ్ 157: అయ్యో రాధా ఐస్ క్రీమ్ మళ్లీ నుదుటిన అంటించుకున్నావ్ ఏంటి అని శ్యామ్ అంటాడు.ఊరుకోండి సార్ ఐస్ క్రీమ్ తినేటప్పుడు ముక్కుకు అంటిందంటే నమ్మొచ్చు కానీ నుదుటికి ఎలా అంటుతుంది అని రాదా అంటుంది. కావాలంటే నీ ఫోన్లో చూసుకో రాదా అని శ్యామ్ ఐస్ క్రీమ్ తీసి నుదిటిన అంటిస్తాడు. ఏంటి సార్ ఇది ఏమైనా బాగుందా అని రాదా అంటుంది. ఊరికే రాధా ఫన్ కోసం చేశాను అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే వాళ్ళిద్దరూ కారులో వెళ్ళకూడదు అని నేను టైర్ కు గాలి తీసేస్తే వాళ్ళిద్దరూ స్కూటీ మీద షికారుకు వెళ్తారా ఏదో ఒకటి చేసి రాదను ఈ కాలనీ నుండి పంపించేయాలి అని సంయుక్త ఒక రౌడీ కి ఫోన్ చేసి నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు రాదని మాత్రం పోలీసులు అరెస్టు చేయాలి అని సంయుక్త అంటుంది.

ఓకే మేడం నేను చూసుకుంటాను అని ఆ రౌడీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే రాధా శ్యామ్ ఐస్ క్రీమ్ తిని బయటికి వచ్చి స్కూటీ మీద వెళ్లి పోతూ ఉంటారు ఆ రౌడీ వాళ్ళని ఫాలో అవుతూ వస్తాడు వాళ్లు షాపింగ్ మాల్ లోకి వెళ్తారు ఏంటి సార్ ఏం కావాలి అని అడుగుతారు షాప్ లో వాళ్ళు. మా బాబుకి కృష్ణుడి గెటప్ కావాలి అని రాధా అంటుంది. ఇంతలో ఆ రౌడీ కూడా షాపింగ్ మాల్ లోకి వచ్చి ఈ పాప మెడలో ఉన్న చైను కొట్టేసి రాధ బ్యాగులో వేస్తే రాదని దొంగతనం చేసిందని పోలీసులు పట్టుకెళ్తారు అని ఆ రౌడీ ఆ పాపను ఇలా రా అమ్మ అని పిలుస్తాడు పాప కూడా రౌడీ పిలవగానే తన దగ్గరికి వెళ్తుంది అప్పుడు రౌడీ పాప మెడలో ఉన్న చైను తీసి రాదా బ్యాగులో వేస్తాడు. ఇంతలో వాళ్ళ అమ్మానాన్న పాప ఎక్కడికెళ్ళింది అని అటు ఇటు వెతుకుతారు ఇక్కడే ఉంది సార్ అని రాదా పాపని తీసుకువచ్చి వాళ్ళకి ఇస్తుంది.

మా పాపని తీసుకువచ్చి ఇచ్చినందుకు థాంక్స్ మేడం అని వాళ్ళు అంటారు. మీ పాప రోడ్డుమీద పరిగెడుతుంటే అతను కాపాడి తీసుకొచ్చాడు నేను కాదండి అని రాదా అంటుంది. ఏంటి మేడం ఇది చిన్న పిల్లని అలా వదిలేస్తారా అసలే పాప మెడలో బంగారపు చేను ఉంది దాని కోసమైనా పాపను ఎత్తుకెళ్లి ఏమైనా చేస్తే ఇంకా ఏదైనా ఉందా అని ఆ రౌడీ అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ పాప మెడలో చేను లేదే అని చూస్తుంది. నేను పాపను తీసుకువచ్చి ఈవిడకు అప్పగించినప్పుడు మెడలో చైన్ ఉంది మేడం ఈవిడే ఆ చైను కొట్టేసి ఉంటుంది కావాలంటే ఆవిడ బ్యాగు చెక్ చేయండి అని ఆ రౌడీ అంటాడు. నేను తీయలేదు కావాలంటే చూసుకోండి బ్యాగు అని రాదా బ్యాగును ఇస్తుంది.పాప వాళ్ళ అమ్మ బ్యాగు తీసి చూస్తే అందులో చైన్ ఉంటుంది ఈ చేను మా పాపదే ఏంటమ్మాయి నువ్వు చూస్తే చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు ఇలాంటి పనులు చేస్తారా ఎవరైనా అని వాళ్ళ అమ్మానాన్న రాదని తిడతారు.

వీడేంటి రాదని దొంగను చేస్తున్నాడు అని శ్యామ్ సార్ మీ షాపింగ్ మాల్ లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా అది చూపించండి దొంగ ఎవరో తెలిసిపోతుంది అని శ్యామ్ అంటాడు. సీసీటీవీ ఫుటోజి తీసి చూస్తే అందులో రౌడీ పాప చేను కొట్టేసి రాదా బ్యాగులో వేస్తాడు. అది చూసినా రౌడీ అక్కడి నుండి పరిగెడతాడు ఒరేయ్ ఆగురా అని శ్యామ్ వాడి వెనకాలే పరిగెడతాడు. ఆ రౌడీ శ్యామ్ కళ్ళలో మట్టి కొట్టి అక్కడ నుండి పారిపోతాడు. అయ్యో సార్ కళ్ళల్లో అంత మట్టి కొట్టి పారిపోయాడు ఉండండి నేను మట్టి దులుపుతాను అని రాధా తన చున్నీ తీసి శ్యామ్ కళ్ళ మీద ఉన్న మట్టిని తన చున్నీ తీసి రాధా ఇస్తుంది. పర్వాలేదులే రాదా మట్టి అంతా పోయింది అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే ఏంటి ఇంకా ఫోన్ రావట్లేదు అని సంయుక్త అనుకుంటుంది. ఇంతలో రౌడీ ఫోన్ చేసి సంయుక్తాకి జరిగిందంతా చెబుతాడు. సరేలే నువ్వు కొన్నాళ్లపాటు బయట తిరగకు ఆ సీసీటీవీ ఫుటేజ్ దొరికిందంటే నువ్వు దొరుకుతావు అప్పుడు నా కొంప మునుగుతుంది అని సంయుక్త అంటుంది. మేడం నా ప్రాణం పోయినా నీ పేరు మాత్రం బయట పెట్టెను కానీ డబ్బులు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు అని ఆ రౌడీ అంటాడు.

ఇప్పుడు చేస్తాను కానీ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయట తిరగకు జాగ్రత్త అని సంయుక్త ఫోన్ కట్ చేస్తుంది. కట్ చేస్తే చూశారా సార్ వాడు నా మీద దొంగతనం అనే ముద్ర వెయ్యాలి అని అనుకున్నాడు ఆ పాప వాళ్ళ అమ్మానాన్నలు వాడి మాటలు నమ్మి పోలీసులను పిలిస్తే నేను అరెస్టు అయ్యేదాన్ని అప్పుడు కాలనీ వాళ్లకు నా మొహం ఎలా చూపించుకునే దాన్ని అని రాదా అంటుంది. అదే జరిగితే నేను ఊరుకుంటానా ఎంత కష్టమైనా సరే నిన్ను బయటికి తీసుకు వచ్చి నలుగురిలో తల ఎత్తుకునేలా చేసే వాడిని నేను ఉన్నంతవరకు నీకు ఏమీ కానివ్వను రాదా నువ్వు ఏమీ భయపడకు ఇలాంటివి ఎన్ని ఎత్తులు వేసినా ఆ సంయుక్త చిత్తయిపోతుంది చూస్తూ ఉండు అని శ్యామ్ అంటాడు. అది విన్న రాదా నవ్వి సార్ మన కోసం ఇంటిదగ్గర పండు ఎదురు చూస్తూ ఉంటాడు ఇక వెళ్దామా అని రాదా అంటుంది. హమ్మయ్య ఇప్పటికి నవ్వావు రాదా దీని కోసమే కదా ఇంతసేపు నేను ఆరాటపడింది అని శ్యామ్ అంటాడు.

కట్ చేస్తే ఇంటి దగ్గర పండు ఆడుకుంటూ ఉండగా వాళ్ళ తాతయ్య వస్తాడు. ఒరేయ్ మనవడా ఎలా ఉన్నావురా అని వాళ్ళ తాతయ్య అంటాడు. నాకేంటి తాతయ్య హీరో లాగా ఉన్నాను అని పండు అంటాడు. అవున్రా పండు పెద్దయ్యాక నువ్వు హీరో అవుతావు అని విల్సన్ అంటాడు. అది నువ్వేం చెప్పక్కర్లేదు నాకు తెలుసులే అని పండు అంటాడు. బాగున్నారా బాబాయ్ గారు శ్యామ్ రాధా బయటికి వెళ్లారు ఈపాటికి వచ్చేస్తుంటారులే అని విల్సన్ అంటాడు. అవును శ్యామ్ అంటే ఎవరు రా అని వాళ్ళ తాతయ్య అంటాడు. అదే తాతయ్య మా ఇంటి గల ఓనర్ కొడుకు అని పండు అంటాడు అవునా అంత పెద్ద వాడిని పేరు పెట్టి పిలుస్తున్నావ్ ఏంట్రా అని వాళ్ళ తాతయ్య అంటాడు. శ్యామ్ నాకు ఫ్రెండ్ తాతయ్య అందుకే అలా పిలుస్తున్నాను అని పండు అంటాడు. ఏంటి పండు శ్యామ్ మాత్రమే నీ ఫ్రెండా నేను కాదా అని విల్సన్ అంటాడు.

అవును శ్యామ్ అంకులు మాత్రమే నాకు బెస్ట్ ఫ్రెండ్ నువ్వు ఉత్తి ఫ్రెండ్ వే అని పండు అంటాడు. సరేలేరా మనం ఇంట్లోకి వెళ్దాం పద అని వాళ్ళ తాతయ్య అంటాడు. తాతయ్య ఇలా వచ్చి కూర్చో నేను మంచినీళ్లు తీసుకు వస్తాను అని పండు వెళ్ళిపోతాడు. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పుట్టినట్టు నా కూతురు జీవితాన్ని పాడు చేసిన వాడికి ఇంత మంచి కొడుకు పుట్టాడు అంతా వీధి రాత అని వాళ్ళ తాతయ్య తన మనసులో అనుకుంటాడు. ఇంతలో పండు మంచినీళ్లు తీసుకువచ్చి తాతయ్య తాగండి అని ఇస్తాడు. సరేలే పండు ఇలా వచ్చి కూర్చో అమ్మ ఇంకా రాలేదేంటి అని వాళ్ళ తాతయ్య అంటాడు వచ్చేస్తూ ఉంటారులే తాత అని పండు అంటాడు. ఇంతలో రాధా శ్యామ్ వచ్చేస్తారు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది