Madhuranagarilo సెప్టెంబర్ 7 ఎపిసోడ్: హలో ఎస్క్యూజ్ మీ ఇక్కడ సురేష్ అని వ్యక్తి ఉండాలి ఎక్కడ అని శ్యామ్ అడుగుతాడు. సార్ ఇంకా రాలేదండి వచ్చే టైం అయింది అక్కడ రూమ్ లో వెయిట్ చేయండి అని గీత అంటుంది. ఓకే పద రాదా ఇంకా రాలేదంట అక్కడ కూర్చుందాం అని శ్యామ్ అంటాడు. ఇంతలో సురేష్ వస్తాడు ఏ శ్యామ్ ఇన్నాళ్లకు గుర్తొచ్చానా ఏంట్రా ఇలా వచ్చావు అని సురేష్ అంటాడు. నా పేరు రాధ మా పక్కింట్లో ఉంటుంది తనకు కావాల్సిన వాళ్ళు ఇక్కడ కోచింగ్ తీసుకున్నారంట వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా ఇక్కడ ఉన్నాయేమో చూద్దామని వచ్చాము శ్యామ్ అంటాడు.

ఇప్పుడు కూడా ఏదో పని ఉందనే వచ్చావు చూసావా ఫ్రెండ్ను కలుద్దామని కాదు నువ్వు అమెరికా వెళ్ళిపోయాక చాలా మారిపోయావు రా అసలు ఫ్రెండ్స్ నే మర్చిపోయావు అని సురేష్ అంటాడు. అదేమీ లేదురా అని శ్యామ్ అంటాడు.గీత వీళ్ళకు ఏవో డీటెయిల్స్ కావాలంట చూపియ్ అమ్మ అని సురేష్ అంటాడు. ఓకే సార్ అతని పేరేంటి అండి అని అడుగుతుంది గీత తన పేరు ఎంఎస్ సుందర్ అని రాధా అంటుంది. ఎస్ఎస్ సుందర అని గీత అంటుంది. కాదండి ఎమ్మెస్ సుందర్ అని రాధా అంటుంది. ఎప్పుడు జాయిన్ అయ్యారు అని గీత అంటుంది. 2014లో అండి అని రాదా అంటుంది. సారీ మేడం ఐదేళ్ల కిందటివే కంప్యూటర్ చూపిస్తుంది అది దాదాపు పది సంవత్సరాలు అవుతుంది కదా ఈ కంప్యూటర్లో లేవు అని గీత అంటుంది.కంప్యూటర్ లో లేకపోతేనే రిజిస్టర్ బుక్ లో ఉంటుంది కదా కొంచెం చూడండి మేడం అని రాధ అంటుంది.

అవునండి రిజిస్టర్ బుక్ లో ఉంటుంది కానీ మేము కొంచెం బిజీగా ఉన్నాము రెండు మూడు రోజులు టైం పడుతుంది అని గీత అంటుంది. ఏమైంది రాధ అని శ్యామ్ అంటాడు. కంప్యూటర్లో ఐదేళ్లదే ఉన్నాయట రిజిస్టర్ బుక్ లో చూడమంటే టైం పడుతుంది అని అంటుంది అని రాధ అంటుంది. ఏం పర్వాలేదులే రాధ రెండు మూడు రోజులే కదా మీ బావ డీటెయిల్స్ ఎలాగైనా దొరుకుతాయి అని శ్యామ్ అంటాడు కట్ చేస్తే సంయుక్త మధుర నగరిలోకి లగేజీ తీసుకొని వచ్చేస్తుంది. కానీ వాళ్ళందరూ చూసి ఇది ఇక్కడికి వచ్చిందేంటి పదండి అడుగుదాము అనే సంయుక్త దగ్గరికి వెళ్లి నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని కాలనీ వాళ్ళు అడుగుతారు.మా అత్తింటికి వచ్చాను అని సంయుక్త అంటుంది. ఆగిపోయింది కదా పెళ్లి నీకు అత్త ఇల్లు ఎక్కడిది అని వాళ్ళు అంటారు. నేను ఆ రోజే చెప్పాను పెళ్లి మాత్రమే ఆగిపోయింది అత్తగారిల్లు కాదు అలాగే ఉన్నాడు నేను ఉన్నాను ఇప్పుడు కాకపోతే రేపు మా పెళ్లి తప్పకుండా జరుగుతుంది అని సంయుక్త అంటుంది. నువ్వు ఈ ఇంటికి కోడలు అవుతావా నిన్ను ఎవరు రమ్మన్నారు అని వాళ్ళు అంటారు నన్ను మధుర అంటే రమ్మన్నది కావాలంటే ఆవిడని అడగండి అని సంయుక్త అంటుంది. పదండి మనం మధురానే అడుగుదాం మధుర అమ్మ అని అందరూ పిలుస్తారు ఇక్కడికి ఎవరు వచ్చారో చూడండి అని అంటారు. ఏంటి అందరూ ఇలా వచ్చి అరుస్తున్నారు అని మధుర అంటుంది.

సంయుక్త నీకు వాసంతి వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఇల్లు నీ కోసం కేటాయించాను అక్కడికి వెళ్లి ఉండు అని మధుర అంటుంది. సరే అత్తయ్య డాన్స్ అని సంయుక్త వెళ్లిపోతుంది. ఏంటి అందరూ ఇంకా అలాగే నిలబడి చూస్తున్నారు వెళ్ళండి అని మధుర అంటుంది. అందరూ అక్కడ నుండి వెళ్లిపోతారు. కట్ చేస్తే ఏమి ఆలోచిస్తున్నావు రాదా అని శ్యామ్ అంటాడు. ఏమీ లేదు సార్ మా బావ గురించే అని రాధ అంటుంది.నువ్వేం టెన్షన్ పడకు రాధ ? మీ బావ గురించి ఇంకా రెండు మూడు రోజుల్లో తెలిసిపోతుందని వాళ్ళు చెప్పారు కదా అసలే దొరకదు అనుకున్నా మి బావ గురించి తెలుస్తుందిలే అని శ్యామ్ అంటాడు. మా బావగారు దొరికిన అంత తొందరగా ఒప్పుకుంటాడా అని రాదా అంటుంది. ఎందుకు ఒప్పుకోడు నేను ఒప్పుకునేలా చేస్తాను పండు ఆరోగ్య విషయంలో నేను అస్సలు వెనుకకు తగ్గను ఇప్పుడు వాటి గురించి ఎందుకు పాటలు విందా అని శ్యామ్ అంటాడు. ఓకే సార్ పెట్టండి అని రాదా అంటుంది. శ్యామ్ పాటలు పెడతాడు అన్ని లవ్ సాంగ్స్ ఏ వస్తున్నాయి అని బంద్ చేస్తాడు. ఏంటి సార్ పాటలు ఆఫ్ చేశారు అని రాదా అంటుంది. ఏమీ లేదు రాదా పెట్టిన కానుండి లవ్ సాంగ్స్ వస్తున్నాయి నీకు ఇబ్బందిగా ఉంటుందని నేను ఆఫ్ చేశాను అని శ్యామ్ అంటాడు. పర్వాలేదు పెట్టండి అని రాదా అంటుంది.

అయ్యో టైర్ పంచరైనట్టుందే అని శ్యామ్ అంటాడు. అయ్యో ఇప్పుడు ఎలా సార్ అని రాదా అంటుంది. నువ్వు కార్ లోనే కూర్చో నేను దిగి టైర్ మారుస్తాను అని శ్యామ్ టైరు మారుస్తూ ఉంటాడు. ఎండ కొడుతుంది అని రాధా తన చున్నీ తీసి ఇలా నీడ పుడుతుంది. అక్కడే సమోసాలు అమ్ముకుంటున్న ఆవిడ మీరిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారు మీ భార్యాభర్తల బంధం నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అని ఆవిడ అంటుంది.మీ ఇద్దరం భార్యాభర్తలంకము అని రాధ చెప్పబోతుండగా. రాధా ఇప్పుడు మన గురించి ఆవిడకు చెప్పడం అవసరమేముంది వదిలేయ్ ఆకలి దంచేస్తుంది సమోసాలు తీసుకో తిందాం అని శ్యామ్ అంటాడు. అమ్మ రెండు ప్లేట్ల సమోసాలు ఇవ్వండి అని రాధా రెండు ప్లేట్లు సమోసాలు తీసుకుంటుంది. వాటర్ ఉంటే ఇలా ఇవ్వు రాదా చేతులు కడుక్కొని సమోసాలు తింటాను అని శ్యామ్ అంటాడు. అయ్యో నీళ్లు అయిపోయాయి సార్ ఎలాగా అని రాదా అంటుంది. పర్వాలేదులే పక్కన హోటల్లో మంచినీళ్లు తీసుకొని అక్కడ చేతులు కడుక్కొని సమోసాలు తింటాను అని శ్యాం అంటాడు. మీ చేతులు బాగోలే పోతేనే నా చేతులు బాగానే ఉన్నాయిగా నేను తిన పెడతాను తినండి అని రాదా అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.