Madhuranagarilo Latest Episode సెప్టెంబర్ 8: కాలనీ వాళ్ళందరూ కలిసి రాధకి ఫోన్ చేసి సంయుక్త ఈ కాలనీలోకి వచ్చింది అమ్మ మీరు రండి అని అంటారు. అవునా అయితే నేను ఇప్పుడే వస్తున్నాను అని రాధ ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి రాధా అని శ్యామ్ అంటాడు. ఆ సంయుక్త మన కాలనీలోకి వచ్చిందంట సార్ అని రాదా అంటుంది. అయితే మనం తొందరగా వెళ్ళాలి అని వచ్చేస్తారు రాధా శ్యామ్ ఏంటి ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు అని శ్యామ్ అంటాడు. ఎందుకు రాకూడదా శ్యామ్ ఇది మన కాలిని అని సంయుక్త అంటుంది.

ఇది మా కాలిని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు వెళ్ళిపో అని శ్యామ్ అంటాడు. ఓకే ఇప్పుడు ఇది మీ కాలనీ అయితే ఏంటి నేను వెళ్ళను ఇప్పుడు ఏం చేస్తావు నన్ను వెళ్ళగొడతావా అని సంయుక్త అంటుంది. అవును నిన్ను వెళ్లగొడతాను ఆడపిల్లవని చూస్తూ ఊరుకుంటుంటే బాగా ఎక్కువ చేస్తున్నావు అని శ్యామ్ అంటాడు ఏది వెళ్లగొట్టి చూడు అని సంయుక్త అంటుంది. వెళ్లగొట్టడమే కాదు నిన్ను చితకోటి వెళ్లగొడతాను అని శ్యామ్ చేయి లేపుతాడు. వద్దు సార్ తను ఎంత రెచ్చగొట్టినా మీరు సహనంతో ఉండాలి తనను కొట్టి మీరు చెడ్డవాళ్ళు అయిపోకూడదు ఇక్కడికి పిలిపించిన వాళ్ళని అడగండి అని రాదా అంటుంది. డ్రైవర్ లగేజ్ తీసుకొచ్చి లోపల పెట్టు అని సంయుక్త వెళ్లిపోతుంది.

అడుగుతాను అమ్మని అడుగుతాను అని లోపలికి వెళ్తాడు శ్యామ్ అమ్మ ఏంటిది అని శ్యామ్ అంటాడు. జ్యూస్ నాన్న ఎండన పడొచ్చావు తాగు చల్లబడతావు అని మధుర అంటుంది. కోపంతో ఊగిపోతున్న శ్యామ్ గ్లాసులు తీసి విసిరి కొడతాడు. ఏంటి నాన్న ఇలా చేసావు అని మధుర అంటుంది. ఏంటి మధుర వాడికి నచ్చని పనులు చేస్తావ్ ఏంటి అని ధనంజయ్ అంటాడు. అవునండి వాడికి మ్యాంగో జ్యూస్ నచ్చదు కదా ఆపిల్ జ్యూస్ అంటే ఇష్టం కానీ నేను మ్యాంగో జ్యూస్ చేశానే అని మధురం అంటుంది. అమ్మ నువ్వు సంయుక్తాన్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు ముందు తనని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టు అనే శ్యామ్ అంటాడు. సంయుక్తాన్ని ఇక్కడ నుంచి వెళ్లగొట్టాలంటే ముందు నువ్వు రాదని వెళ్ళగొట్టు అని మధుర అంటుంది. రాదని వెళ్ళగొట్టును అని చెప్పు నాన్న అని శ్యామ్ అంటాడు.

అయితే నేను కూడా సంయుక్త ని వెళ్ళగొట్టునుఅని చెప్పండి వాడికి అని మధురం అంటుంది. నేను మీ ఇద్దరికీ చెప్పను రా అసలు మీ ఇద్దరి మధ్యలోకి నేను అసలే రాను మీ గొడవ మీరే చూసుకోండి నాకేం సంబంధం లేదు అని ధనంజయ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అమ్మ మర్యాదగా సంయుక్తాన్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టు ఏంటమ్మా ఈ పిచ్చి పనులు అని శ్యామ్ అంటాడు. నేను అదే చెబుతున్నాను నాన్న నువ్వు రాదని వెళ్ళగొట్టు అప్పటిదాకా నేను సంయుక్తను వెళ్ళగొట్టే ప్రసక్తే లేదు అని మధుర అంటుంది. అమ్మ సంయుక్త ఎలాంటిదో నీకు తెలిసి కూడా ఎందుకు తన మాయలో పడి ఇలాంటివన్నీ చేస్తున్నవ్ తనని తెచ్చి కాలనీలో పెట్టావు అని అంటాడు.నువ్వు రాదని తెచ్చి ఇక్కడ పెట్టి తన మాయలో పడి ఒక బిడ్డ తల్లి అయినా రాధ చుట్టూ తిరుగుతున్నవు నీకు బుద్ధి ఉందా నువ్వు ముందు రాదని వెళ్లగొట్టు అని మధుర అంటుంది.నువ్వు సంయుక్తాన్ని వెళ్ళగొట్టిన రాదను నేను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టును ఇక్కడే ఉంటుంది అని శ్యామ్ అంటాడు.

వెళ్లగొడుతుంది రా ఖచ్చితంగా సంయుక్త రాదని ఈ కాలిని నుండి వెళ్ళగొడుతుంది చూస్తూ ఉండు అని మధుర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే రాధా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి రాధా ఈ సంయుక్తని ఎలా వెళ్ళగొట్టాలి ధనుంజయ్ సార్ ని మధుర మేడని ఎంత మాయ చేసింది అని అనుకుంటున్నావా అని సంయుక్త అంటుంది. అవును నిన్ను ఎలా వెళ్ళగొట్టాలా అని ప్లాన్ వేస్తున్నాను అని రాదా అంటుంది. ఏం చేసినా నువ్వు నన్ను వెళ్ళగొట్టలేవు చూస్తూ ఉండు నిన్నే ఇక్కడ నుంచి పంపించేస్తాను అని సంయుక్త అంటుంది. ఏన్ని కుట్రలో ఇంత మోసం చేసే దాన్ని ఆ ఇంటికి కోడలుగా ఎల వస్తావు నేను ఎలా రానిస్తాను అంతదాకా వస్తే శ్యామ్ ని నేనే పెళ్లి చేసుకుంటాను కానీ నిన్ను మాత్రం చేసుకోనివ్వను అని రాదా అంటుంది. అంతదాకా వస్తే తాళి కట్టించుకునే మెడ మీద తలకాయ లేకుంటే చేస్తాను అని సంయుక్త అంటుంది. ఏంటే నువ్వు చేసేది అని ఆ చేతిని పట్టుకుని ఇలా విరిచేస్తుంది రాదా.ఏంటి చేయి అలా విరగగొట్టేస్తున్నావ్ అని శ్యామ్ అంటాడు.

ఏమీ లేదు సార్ చెయ్యి చూపిస్తే ఆ చేయి విరగగొడతాను అని చెప్తున్నాను అని రాదు అంటుంది.చెప్తా మీ ఇద్దరి సంగతి నన్ను కాదని ఈ రాదని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను అని సంయుక్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే పండు హోమ్ వర్క్ చేసుకుంటూ అమ్మ ఆకలి వేసింది డిన్నర్ చేద్దామా అని అంటాడు పండు. ఒక్క పది నిమిషాలు ఆగు నాన్న వంట అయిపోతుంది తిందాము అని రాదా అంటుంది.ఇంతలో శ్యామ్ అక్కడికి వచ్చేసి సీరియస్ గా హోంవర్క్ చేసుకుంటున్నాడు పండు. వీడిని డిస్టర్బ్ చేయకూడదు కానీ రాధ ఏం చేస్తుంది కిచెన్లో వర్క్ చేసుకుంటుందా అయితే డిస్టర్బ్ చేయొచ్చు అని రాధ దగ్గరికి వెళ్తాడు శ్యామ్ వెళ్లి రాదా అని పిలుస్తాడు. ఏంటి సార్ అని రాదా వెనుకకు తిరిగి చూస్తుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది