NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

Madhuranagarilo Today Episode April 19 2024 Episode 342 highlights

Madhuranagarilo April 19 2024 Episode 342: అతను దొంగ నా తాలిని తీసుకొని పారిపోతున్నాడు వాడికి డబ్బులు ఇచ్చి మరి పంపిస్తారా అని రాధా అంటుంది. సారీ మిస్టేక్ జరిగింది దానికి ఎంత ఖర్చు ఎంతో చెప్పండి డబ్బులు నేను ఇస్తాను అని విరాజ్ అంటాడు. మంగళ సూత్రానికి విలువ ఎంతో మీ అమ్మని అడిగింతే చెబుతుంది లేదంటే నీకు చెల్లి ఉంటే మీ చెల్లిని అడగండి అని రాధ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, మధుర శ్యామ్ ధనంజయ్ పండుని తీసుకుని ఇంటికి వస్తారు. పండుని సాప వేసి కింద పడుకోబెడుతుంది మధుర. ఇంతలో రాధా పరిగెత్తుకొచ్చి అత్తయ్య అని బోరున ఏడుస్తుంది. ఏమైంది రాధా ఎందుకలా ఏడుస్తున్నావ్? ఏమైంది తల్లి అని మధుర అడుగుతుంది. అత్తయ్య నా మంగళ సూత్రాలు పోయాయి పోగొట్టుకున్నాను అని రాధ బాధపడుతుంది.

Madhuranagarilo Today Episode April 19 2024 Episode 342 highlights
Madhuranagarilo Today Episode April 19 2024 Episode 342 highlights

నీ మంగళ సూత్రాలు పోవడం ఏంటమ్మా అసలు ఏం జరిగింది అని ధనంజయ్ అంటాడు. నేను రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉండగా ఒక అతను వచ్చి నా తాళిబొట్టును కొట్టేసి పారిపోయాడు అని రాధా జరిగిన విషయం అంతా చెబుతుంది. ఆ తాళిబొట్టు అతను తీసుకు వెళ్తుంటే మీ అబ్బాయి నాకు దూరమైనట్టు అనిపించింది అని రాధా బాధపడుతుంది. ఊరుకో రాదా ఆమాత్రం దానికి ఎందుకు అంతలా బాధపడుతున్నావ్ శ్యామ్ ని మెడలో పసుపు కొమ్ము కడతాడులే అని మధుర ఒక పసుపు కొమ్ము కట్టిన తాడును తెచ్చి శ్యామ్ కి ఇచ్చి రాధ మెడలో కట్టమని అంటుంది. శ్యామ్ మౌనంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఏం జరిగింది నీ భార్య మెడలో తాళిని కట్టమంటే ఎందుకు ఆలోచిస్తున్నావ్ కట్టరా రాధ మెడలో అని మధుర అంటుంది. ఏమైందిరా ఎందుకలా మౌనంగా ఉన్నావు రాదని భార్య కదా రా తన మెడలో తాళికట్టు అని మధుర అంటుంది. ఇంతలో రుక్మిణి అక్కడికి వస్తుంది. రెండోసారి నా మెడలో తాళి కట్టిన నీ కొడుకు రాదా మడలో తాళి ఎలా కడతాడు అని రుక్మిణి అంటుంది. ఏంటి నువ్వు అంటుంది అని మధుర అంటుంది.

Madhuranagarilo Today Episode April 19 2024 Episode 342 highlights
Madhuranagarilo Today Episode April 19 2024 Episode 342 highlights

శ్యామ్ నన్ను రెండోసారి పెళ్లి చేసుకున్నాడు అని రుక్మిణి చెబుతుంది. రేయ్ తను ఏం మాట్లాడుతుంది రా నువ్వు తన మెడలో తాళి కట్టడం ఏంటి అని మధుర అడుగుతుంది. నేను చెబుతాను ఆవేశ పడకండి పండు కోసం కటక తప్ప లేదమ్మా అని శ్యామ్ అంటాడు. పండు కోసం రుక్మిణి మెడలో తాళి కట్టడం ఏంట్రా అసలేం జరిగింది అని ధనంజయ్ అంటాడు. ఏం జరిగిందో అంత వివరంగా చెప్తాను అని విషయం జరిగిన విషయం అంతా చెబుతాడు. అలా రుక్మిణి నా మీద కేసు పెడతానని బెదిరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాళి కట్టాల్సి వచ్చింది కానీ రాధకు ద్రోహం చేయాలని మాత్రం కాదు అని శ్యామ్ అంటాడు. పండు నీ మన ప్రాణాలు పణంగా పెట్టిన సరే కాపాడుకునే వాళ్లం కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదురా అని ధనంజయ్ అంటాడు. అలాంటి అవకాశం ఉంటే నేనే చేసే వాడిని నాన్న కానీ ఏ అవకాశం లేదని ఇలా చేయాల్సి వచ్చింది అని శ్యామ్ అంటాడు. అందుకని ఈ రాక్షసి మెడలో తాళి కట్టి తనకి భర్త అయ్యావా  ఎందుకురా ఇలాంటి పని చేశావు అని మధుర కన్నీళ్లు పెట్టుకుంటంది. అమ్మ చెప్పాను కదా మా తప్పనిసరి పరిస్థితుల్లో కట్టాల్సి వచ్చింది నన్ను అర్థం చేసుకోండి రాదా నిన్ను మోసం చేయాలని కాదు పండు నీ కాపాడుకునే సమయంలో అలా చేయాల్సి వచ్చింది మాట్లాడు రాదా ఏమైంది నాతో ఎందుకు మాట్లాడటం లేదు నీ మౌనం భరించలేకపోతున్నాను అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode April 19 2024 Episode 342 highlights
Madhuranagarilo Today Episode April 19 2024 Episode 342 highlights

నీకు కోపం ఉంటే నన్ను  తిట్టు రాదా నీ బాధంతా పోయేలా నన్ను తిట్టు అంతే కానీ ఇలా మౌనంగా మాత్రం ఉండకు నీ మౌనన్ని భరించలేకపోతున్నాను అమ్మ నువ్వైనా చెప్పమ్మా రాధ తో నాతో మాట్లాడమని చెప్పమ్మా అలా ఎందుకు చేసానని నన్ను కొట్టమని చెప్పమ్మా అని శ్యామ్ అంటాడు. రాధ కాదురా నిన్ను కొట్టేది నిన్ను కన్నందుకు నేను కొడతాను ఎందుకురా ఇలాంటి పని చేశావు అని మధుర ఎడాపెడా వాయిస్తుంది శ్యామ్ ని. మీ కొడుకుని కొట్టే హక్కు మీకుంది కానీ నా మొగుణ్ణి కొట్టే హక్కు మీకు లేదు ఇంకొకసారి ఎప్పుడూ నా భర్త మీద చేయి చేసుకోకండి అని రుక్మిణి అంటుంది. అయితే నీ భర్తని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవే నా ఇంట్లో ఒక క్షణం కూడా ఉండకు అని మధుర అంటుంది. నా భర్తని తీసుకొని వెళ్ళిపోతాను వెళ్ళిపోక ఈ కొంపలో ఉండిపోతానా నా భర్తతో పాటు నా కొడుకుని కూడా తీసుకొని వెళ్ళిపోతాను వస్తానంటే మిమ్మల్ని కూడా తీసుకు వెళ్తాను అత్త మామలని అనాధల్లా వదిలేసిందని నింద నాకెందుకు మీరు కూడా నాతో రండి అందరం హాయిగా  ఉందాం అని రుక్మిణి అంటుంది. మరి మేము నీతో వస్తే రాధ పరిస్థితి ఏంటి ఇలా అనాధల మిగిలిపోవాల్సిందేనా అని మధుర అంటుంది.

Madhuranagarilo Today Episode April 19 2024 Episode 342 highlights
Madhuranagarilo Today Episode April 19 2024 Episode 342 highlights

దాని తలరాతకి ఎవరేం చేస్తారు అని రుక్మిణి అంటుంది.దాని తలరత కాదే నువ్వు చేసిన కుట్ర అని మధుర అంటుంది. ఇలా అనాధలా బ్రతకాలని తన తలరాత మీద రాసిపెట్టి ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు నాతో పాటు వస్తే మిమ్మల్ని తీసుకువెళ్తాను లేదంటే నా కొడుకుని నా భర్తని తీసుకొని వెళ్తాను అని రుక్మిణి అంటుంది. నువ్వు వదిలేసి వెళ్లిన రాదని మేము వదిలేసి రాము రాధ అనాధ కాదు ఇప్పటినుంచి మాకు రాధ కూతురు నా కూతుర్ని అనాధనికానివ్వను అని మధుర అంటుంది. పండు రుక్మిణి దగ్గరికి వచ్చి నేను నీతో రాను అని అంటాడు. తప్పు నాన్న మనం పెద్దమ్మతో పాటు వెళ్లాలి అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode April 19 2024 Episode 342 highlights
Madhuranagarilo Today Episode April 19 2024 Episode 342 highlights

పెద్దమ్మతో మనం ఎందుకు వెళ్లాలి నాన్న అని పండు అంటాడు. వెళ్లే పరిస్థితి వచ్చింది నాన్న తర్వాత అంతా చెప్తాను అని శ్యామ్ అంటాడు. పరాయి వాళ్ళ ఇంట్లో ఎక్కువ సేపు ఉండడం మంచిది కాదు త్వరగా వచ్చేయండి అని రుక్మిణి అంటుంది. రుక్మిణి వెంట శ్యామ్ పండుని తీసుకొని వెళ్ళిపోతాడు. అత్తయ్య అంతా అయిపోయిందా అత్తయ్య ఇంక నేనెవరి కోసం బ్రతకాలి అని రాదా ఏడుస్తుంది. మీ అమ్మానాన్నల కోసం బ్రతకాలి అమ్మ మమ్మల్ని బ్రతికించుకోవడం కోసమైనా బ్రతకాలి అలా అనకు రాదా అని మధుర గుండెలకు హత్తుకొని ఏడుస్తుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri