Madhuranagarilo November 03 Episode 200: బయట ఆయన ఎవరితోటైనా గొడవపడ్డారా లేదంటే ఎవరినైనాచూసి భయపడ్డారా ఎందుకు అంత ఆందోళనగా ఉన్నారు తెలుసుకోవాలి బయటికి వెళ్లిన వాడు ఇంకా రాలేదేంటి అని రాదా ఎదురుచూస్తుంది. కట్ చేస్తే రుక్మిణి హైదరాబాద్ కి వెళ్లి ఇంకా రాలేదేంటి అక్కడ ఏం జరుగుతుంది అని మురళి టెన్షన్ పడుతూ ఉంటాడు . ఇంతలో రుక్మిణి ఇంటికి వస్తుంది. ఏంటమ్మా రుక్మిణి ఇంతసేపు అయింది ఏంటమ్మా నువ్వు వెళ్లిన పని అయిందా అని మురళి అంటాడు.కాలేదు నాన్న కానీ కచ్చితంగా తెలుసుకుంటాను ఈరోజు కాకపోతే రేపు తెలుసుకుంటాను అని రుక్మిణి అంటుంది. అతని గురించి తెలిస్తే ఏం చేస్తావు అమ్మ అని మురళి అంటాడు. ఏముంది నాన్న పండు కి నాన్నగా నాకు భర్తగా ఉంటే లెక్క సరిపోతుంది లేదంటే వాడిని రోడ్డు మీదికి ఇడుస్తాను అని రుక్మిణి అంటుంది.

అతనికి ఈపాటికి పెళ్లయి పోతే ఏం చేస్తావమ్మా అని మురళి అంటాడు. అమ్మాయిని అడ్డు తొలగించైనా సరే నా స్థానాన్ని నిన్ను దక్కించుకుంటాను అని రుక్మిణి వెళ్ళిపోతుంది. భగవంతుడా ఇప్పుడు ఏం చేయాలి అని మురళి తల పట్టుకుంటాడు. కట్ చేస్తే పండు ని బయటికి తీసుకు వెళ్లేటప్పుడు శ్యామ్ సార్ హ్యాపీగానే ఉన్నాడు తిరిగి వచ్చేటప్పుడు ఆయనలో టెన్షన్ కనిపించింది ఏం జరుగుతుంది అని రాధా ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే వాళ్ళ ఇంటి ముందే శ్యామ్ వాళ్ళ ఫ్రెండ్ మందు తాగుతూ ఉంటారు. రే శ్యామ్ నువ్వు ఇలా తాగుతున్నావని రాధకి తెలిస్తే బాధపడుతుంది రా ఎందుకురా మళ్లీ మందు తాగుతున్నావు అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు.ఏం చేయంను రా ఆ రాక్షసి నా కంటపడింది దాన్ని చూసిన కానించి నాకు టెన్షన్ మొదలైంది ఏమీ చేయలేక మందు తాగుతున్నాను రా నన్ను ఏం చేయమంటావు చెప్పు రుక్మిణి మళ్లీ తిరిగి వచ్చింది అని శ్యామ్ అంటాడు.

రే శ్యామ్ నువ్వు రుక్మిణిని చూసావో లేదో లేదంటే బ్రమ పడుతున్నావొ నీకే అర్థం కావట్లేదు ఏంటి రా అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు.లేదురా నేను నిజంగానే బేకరీలో తనని చూశాను అని శ్యామ్ అంటాడు. సరే రా నువ్వు చూసావు బాగానే ఉంది ఇప్పుడు రాధతో ఆ విషయం చెప్తావా రుక్మిణి విషయం చెప్పి రాదను బాధ పెడతావా నువ్వు బాధపడి తను ఎందుకురా బాధ పెడతావు తనని నువ్వు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా ఈ పరిస్థితుల్లో రాద నిన్ను చూస్తే చాలా బాధపడుతుంది రా తాగిన కాడికి చాలు ఇక ఇంటికి వెళ్ళరా అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. లేదురా రుక్మిణి విషయం రాదకి చెప్పి తనను బాధ పెట్టలేను అలాగని నేను మందు తాగకుండా ఉండలేను బాధని మరిచిపోవాలంటే మందు తాగాలి కదరా మందు తాగితే రాద బాధపడుతుంది తాగకపోతే నేను బాధ పడతాను ఇప్పుడు నన్నేం చేయమంటావు రా అని శ్యామ్ అంటాడు.

భర్త అంటే భార్యని ప్రేమించేవాడు కాదురా బాధ పెట్టకుండా చూసుకోవాలి పెళ్లయిన అమ్మాయికి ఎన్నో ఆశలు కోరికలు ఉంటాయి నువ్విలా మందు తాగి వెళితే రాదా నిన్ను ఏమనుకుంటుంది చెప్పు తానని నువ్వు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు అలాంటప్పుడు రాధమ్మ మనసు బాధ పెట్టకుండా చూసుకోవాలి కదా మందు మత్తులో ఉండి రాధకి రుక్మిణి గురించి చెప్పకు రా తను చాలా బాధపడుతుంది అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. అస్సలు చెప్పను నా మొదటి భార్య గురించి రాధ దగ్గర అసలు ప్రస్తావన తేను అని శ్యామ్ అంటాడు. రే శ్యామ్ రుక్మిణి చూసిన నువ్వు ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోరా అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. నేనెందుకురా అలా చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోవాలి అని శ్యామ్ అంటాడు.

ఎందుకంటే మధుర ఆంటీకి కొడుకువే కాదురా ఇప్పుడు రాధకి భర్తవి కూడా అది గుర్తుపెట్టుకుని రుక్మిణికి ఎదురుపడి తనతో గొడవ పెట్టుకో అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా రాదా పరిగెత్తుకొచ్చి శ్యామ్ చేతిలో ఉన్న మందు బాటిల్ని కింద పడేస్తుంది. ఏంటి సార్ మళ్లీ మందు తాగడం మొదలు పెట్టారా ఎందుకు తాగుతున్నారు అని రాదా అంటుంది. రాధా మందు తాగడం ఆరోగ్యానికి హానికరమే కానీ చేతిలో ఉన్న మందును కింద పడేయడం కూడా హానికరమే తెలుసా అని శ్యామ్ అంటాడు. సరే సార్ పదండి ఇంట్లోకి వెళ్దాం అని రాధా శ్యామ్ ని ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇంట్లోకి రాగానే మధురా ధనంజయ్ బయటికి వచ్చి వీడెప్పుడూ మందు తాగడం మొదలు పెట్టాడండి అని మధురం ఉంటుంది. ఏవండీ పడిపోతున్నారండి రూమ్ లోకి వెళ్దాం పదండి అని రాధా అంటుంది. నేను అంత ఎక్కువ ఏమి తాగలేదు రాదా పడిపోవడానికి అని శ్యామ్ అంటాడు.రాధా శ్యామ్ ని తీసుకువెళ్లే రూమ్ లో పడుకోబెడుతుంది.

రాధా ఏదో బాధలో ఉండి తాగాను నన్ను క్షమించు రాదా నువ్వు అంటే నాకు ప్రాణం రాదా అని శ్యామ్ అంటాడు. రాధా ప్లేట్లో అన్నం పెట్టుకొని వచ్చి శ్యామ్ కు తినిపిస్తుంది. ఆయన మీద నాకు కోపం వుoదని మందు తాగాడేమో రేపు తెల్లారగానే ఆయన మీద కోపం పోయిందని చెప్పాలి అని రాదా అనుకుంటుంది. కట్ చేస్తే నాన్న నేను రాధ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని రుక్మిణి అంటుంది. పండు నిన్ను చూస్తే భయపడతాడు కదా అమ్మ అని వాళ్ళ నాన్న అంటాడు.నేను వెళ్తున్నది పండు వల్ల స్కూలుకి వెళ్లి పండు ని చూసి వచ్చేస్తాను నాన్న అని రుక్మిణి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది