Madhuranagarilo november 14 episode 209: అలాంటి కొడుకును కన్నందుకు వాళ్లకు బుద్ధి చెప్పాల్సిందే అని మధుర ఉంటుంది. చెప్తాను అత్తయ్య ఈరోజు ఫోన్ నెంబర్ దొరికింది ఇంక కొన్ని రోజులకు ఇల్లు దొరుకుతుంది కదా అప్పుడు అక్కడికి వెళ్లి వాడికి వాడి తల్లిదండ్రులకి బుద్ధి తప్పకుండా చెప్తాను అని రుక్మిణి అంటుంది. కట్ చేస్తే, రుక్మిణి ఫోన్లో అన్నమాట గుర్తుకు తెచ్చుకొని శ్యామ్ మళ్ళీ మళ్ళీ బాధపడుతూ ఉంటాడు. అసలు ఆ రాక్షసి ఇక్కడికి ఎందుకు వచ్చింది నన్ను ఎందుకు టార్గెట్ చేసింది ఏం కావాలి తనకి, అనవసరంగా తన గురించి ఆలోచిస్తూ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టాను వెంటనే వెళ్లి వాళ్లకు సారీ చెప్పాలి నన్ను చూడడానికి రాధ వాళ్ళ అక్క వచ్చింది ఆవిడతో మాట్లాడాలి ఇంటికి వెళ్ళాలి అనుకొని శ్యామ్ ఇంటికి బయలుదేరుతాడు. ఏంటండీ వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఈమధ్య ఇంటికి రాగానే అడగండి అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో రోజు రోజుకి వీడి అలవాట్లు మారిపోతున్నాయి అని మధుర అంటుంది. ఇంతలో శ్యామ్ రానే వస్తాడు. ఏ శ్యామ్ ఎక్కడికి వెళ్లావు రా పొద్దున వెళ్లావు ఇప్పుడా వచ్చేది అసలేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని మధుర అంటుంది.

సారీ అమ్మ ఏదో ఆఫీస్ వర్క్ లో పడి మర్చిపోయాను క్షమించండి అని శ్యామ్ వెళ్లిపోబోతాడు. ఏంట్రా అలా వెళ్ళిపోతున్నావ్ అన్నం తినవా అని మధుర అంటుంది. అమ్మ నేను ఇప్పుడు అన్నం తినే మూడులో లేను మీరు తినండి అని శ్యామ్ వెళ్ళిపోతూ ఉంటాడు. రేయి శ్యామ్ నీతోనేరా మాట్లాడేది అలా ఏమీ పట్టించుకోనట్టు వెళ్ళిపోతావ్ ఏంటి మధ్యాహ్నం లంచ్ టైం కి వెళ్లి నైట్ డిన్నర్ టైం కి వస్తున్నావు అసలు ఏం చేస్తున్నావురా ఆఫీసులో వర్క్ అయితే ఇంతలా ఎందుకు డిస్టర్బ్ అవుతావు ఏదైనా పర్సనల్ ప్రాబ్లమా మాకు చెప్పరా అని ధనుంజయ్ అంటాడు. నేను ఏమీ చెప్పలేను అని శ్యామ్ వెళ్ళిపోతాడు. ఏంటండీ వీడు రోజురోజుకీ ఇలా తయారవుతున్నాడు ఆఫీస్ పనిలో డిస్టర్బ్ అయితే పర్సనల్ లైఫ్ ని ఎందుకు డిస్టర్బ్ చేస్తాడు ఏదో జరిగిందండి అందుకే వాడు అలా మాట్లాడుతున్నాడు అని మధుర అంటుంది.

పర్సనల్ ప్రాబ్లం ఏమున్నాయి అత్తయ్య ఏదైనా ఉంటే చెప్తాడు కదా నేను అడిగి తెలుసుకుంటాను కానీ మీరు అన్నం తినండి అని రాధ అంటుంది. కట్ చేస్తే,శ్యామ్ తన గదిలో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రాధ వచ్చి ఏంటండీ మీరు ప్రవర్తించే తీరు నాకేం నచ్చట్లేదు ఎందుకిలా చేస్తున్నారు నిజంగా మీరు ఆఫీసు వర్క్ లో ప్రాబ్లమా లేదంటే పర్సనల్ ప్రాబ్లమా నాకు చెప్పండి నేను అర్థం చేసుకుంటాను అని రాధ అడుగుతుంది. అదేమీ లేదు రాధ కానీ మనం ఫారన్ వెళ్తున్నాము అని శ్యామ్ అంటాడు. ఏంటండీ ఇంత అర్జెంట్గా మనం పారానికి వెళ్లాల్సిన అవసరం ఏముంది అని రాధ అడుగుతుంది. ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను రాధ మనం ఫారన్ వెళ్తున్నాం అంతే అని శ్యామ్ అంటాడు. అయితే నేను రాను అని రాధ గట్టిగా చెప్తుంది. అంటే విషయం ఏంటో చెప్తే కానీ నువ్వు నా వెంట రావా సీత అడవులకే భర్త వెనకాల వెళ్ళింది నువ్వు ఫారన్ కి రాలేవా నా వెనకాల నువ్వు వస్తున్నావు నా మాటని గౌరవిస్తున్నావు అంతే అని శ్యామ్ అంటాడు. అది కాదండి అని రాధ చెప్పబోతోంది.

ఇంకేం చెప్పొద్దు రాధ భర్తగా ఇది నా ఆర్డర్ అని శ్యామ్ గట్టిగా అంటాడు. శ్యామ్ అలా కోపంగా గట్టిగా అనే సరికి రాధ ఏమి మాట్లాడకుండా కిందికి వచ్చి అత్తయ్య ఆయన ఆఫీసులో వర్క్ గురించి అలా టెన్షన్ పడటం లేదు పర్సనల్గా ఏదో ఉంది మనకు చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడేమో అని రాధ అంటుంది. మనకు తెలియని పర్సనల్ ప్రాబ్లం ఏమీ ఉంటాయమ్మ అని మధుర అంటుంది. ఏమో అత్తయ్య నాకు తెలియదు కానీ ఆయన ఫారాన్ కి వెళ్ళిపోదాం అంటున్నాడు అని రాధ చెప్తుంది. అంటే నువ్వు చెప్తుంటే రాధ ఒకటి అనిపిస్తుంది వాడికి ఫారాన్ లో ప్రాబ్లం ఉందేమో అని ధనంజయ్ అంటాడు. వాడు ఒకసారి ఫారాన్ వెళ్లి ఏడేళ్లకు తిరిగి వచ్చాడు ఇప్పుడు మళ్లీ ఫారన్ కి వెళ్లడమేంటండీ ఏదైనా ప్రాబ్లం ఉంటే పండుని రాధని ఇక్కడే వదిలేసి ఒక్కడు వెళ్లి ప్రాబ్లం సాల్వ్ చేసుకొని వస్తాడు కానీ ముగ్గురు ఎందుకు వెళ్తారు చెప్పండి అని మధుర అడుగుతుంది.

నువ్వు చెప్పింది కూడా కరెక్టే కానీ వాడు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలియదు అని ధనంజయ్ అంటాడు. ఇప్పుడు వాడు ఫారన్ కి వెళ్తే నేను చచ్చిపోయాక వస్తాడేమో అని మధుర బాధపడుతుంది. ఎందుకు అత్తయ్య అలాంటి మాటలు మాట్లాడతారు ఏం జరిగింది అసలు అడిగి తెలుసుకుందాం లేండి మేము ఫారన్ కి వెళ్ళాము ఇక్కడే ఉంటాము అని రాధ అంటుంది. కట్ చేస్తే, ఇంతలో తెల్లవారింది అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. శ్యామ్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి రేయ్ పండు నీ పెద్దమ్మని పిలుచుకు రారా మాట్లాడదాం అని అంటాడు. ఉంటే కదా వచ్చేది నేను పిలిచిన రాదు ఎందుకంటే తనకు ఫోన్ వచ్చింది వెళ్ళిపోయింది అని పండు అంటాడు.

ఏంటి సారు ఇంత ఆనందంలో ఉన్నాడు ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా అని మధుర అడుగుతుంది. ఆల్మోస్ట్ ప్రాబ్లం తీరిపోయినట్టే అమ్మ ఎందుకంటే ఫారన్ వెళుతున్నాము కదా అని శ్యామ్ అంటాడు. ఇప్పుడు ఫారన్ కి వెళ్లడమేంట్రా అని ధనంజయ్ అంటాడు. నాన్న ఇప్పుడు నేను ఉన్న పరిస్థితులు ఏమీ చెప్పలేను అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే,రుక్మిణి ఎక్కడికి ఎమ్మెస్ సుందరం అడ్రస్ దొరికిందా అని వాళ్ళ అమ్మ అడుగుతుంది. దొరికిందమ్మా ఫోన్ నెంబర్ అని రుక్మిణి చెప్తుంది. అయితే అతని ఏం అడగాలనుకుంటున్నావు అని వాళ్ళ అమ్మ అంటుంది. చెప్పాను కదా అమ్మ పండుకు తండ్రిగా నాకు భర్తగా ఉంటే సరే సరే లేదంటే వాడి అంతు చూస్తాను అని రుక్మిణి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది