Madhuranagarilo October 2 ఎపిసోడ్ 172: రాధా నేను ఇలా చేయడం నీ దృష్టిలో తప్పే కావచ్చు కానీ తప్పలేదు నేను నీ మెడలో తాళి కట్టి ఉండకపోతే ఇంటికి వెళ్ళాక అమ్మ సంయుక్త మెడలో నా చేత తాళి కట్టించేది నా మీద నీకు ప్రేమ లేకుంటే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావనే నాకు కిరణ్ స్వప్న చెప్పి ఉండకపోతే బలవంతంగా నీ మెడలో తాళి కట్టే వాడిని కాదు నీకు నామీద ప్రేమ ఉంది కాబట్టి ఇల చేయవలసి వచ్చింది నేను ఇలా చేయడం వల్ల నువ్వు చాలా బాధపడతావ్ అని నాకు తెలుసు కానీ ఎందుకు చేయాల్సి వచ్చిందో ఒకసారి ఆలోచించు నోరు జారితే క్షమాపణ చెప్పి సరిదిద్దుకోవచ్చు కానీ జీవితమే చేజారి పోతే మళ్ళీ తిరిగి రాదు అందుకనే మన జీవితాలు చేజారి పోకూడదని ఇలా చేశాను దీని నువ్వు ప్రేమ అనుకుంటావో మోసం అనుకుంటావో కానీ నీ ఇష్టం ఒక్కటి మాత్రం నిజం నువ్వే నా బలం నువ్వే నా బలహీనత నువ్వు లేకుండా నేను బ్రతకలేను అర్థం చేసుకో రాదా అని శ్యామ్ అంటాడు.

ఏంటి సార్ అర్థం చేసుకునేది సర్దిద్దుకోలేనంత తప్పుని చేసి అర్థం చేసుకో రాదా అని అంటారు హద్దులు దాటి ప్రవర్తిస్తే అపార్థం చేసుకోవడం తప్ప అర్థం చేసుకోవడానికి ఏమీ ఉండదు సార్ మీ రీజన్స్ మీకు ఉండొచ్చు ఇంతకంటే మార్గం మీకు కనపడకపోవచ్చు ఇలా చేయడమే కరెక్ట్ అని మిమ్మల్ని మీరు సమర్ధించుకోవచ్చు కానీ నేను మాత్రం అలా సరిపెట్టుకోలేను మీరు చేసిన ఈ దారుణమైన తప్పుని ఒప్పు అని కన్విన్స్ కాలేను ప్రతి ఆడపిల్లకి పెళ్లి విషయంలో కొన్ని ఆలోచనలు ఉంటాయి పెళ్లికి సంబంధించి కొన్ని కలలు ఉంటాయి ఇంతకాలం మీ మీద గౌరవం ఉండేది ఆడవాళ్ళని ఏమాత్రం బాధ పెట్టని మంచి మనిషి అనే గౌరవం ఉండేది ఇప్పుడు మీరు చేసిన పనికి ఆ గౌరవం పోయింది ఇలా చేసినందుకు జీవితంలో మిమ్మల్ని క్షమించలేను సార్ క్షమించలేను అని రాదా అంటుంది.

ఓకే రాదా నిన్ను ఇంత కష్టం పెట్టినందుకు నన్ను క్షమించ వద్దు నిన్ను ఇంత బాధ పెట్టినందుకు నన్ను గౌరవించొద్దు కానీ నీ మీద ప్రేమతోనే ఇదంతా చేశాను అని గ్రహించు రాధా చివరిగా ఒకటి చెప్తాను నేను చేసింది తప్పే అనిపిస్తే ఈ పవిత్రమైన ఈ గుడిలో నేను నిన్ను పెళ్లి చేసుకునేలా చేసే వాడే కాదు ఆ భగవంతుడు మనుషుల నిర్ణయాల్లో తప్పులుంటాయి ఏమోగానీ భగవంతుని నిర్ణయంలో తప్పులు అస్సలు ఉండవు దయచేసి అర్ధం చేసుకో రాదా ఇంతకుమించి నేను చెప్పేదేమీ లేదు అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే ఇంటి దగ్గర మధుర వాళ్లు శ్యామ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.ఇంతలో రాధ శ్యామ్ కారులో నుంచి దిగుతారు. వాళ్ళని చూసిన సంయుక్త షాక్ అవుతుంది సంయుక్త ఏమైందమ్మా అలా అరిచావు అని మధురం ఉంటుంది నన్నెందుకు అడుగుతారు అటు చూడండి అని రాదని శ్యామ్ ని చూపెడుతుంది సంయుక్త వాళ్ళను చూసి షాక్ అవుతుంది మధుర. రాధా శ్యామ్ లోపలికి వస్తూ ఉండగా మధుర ఆగండి ఏంటి శ్యామ్ ఇలా చేశావు అని మధుర అంటుంది. రే శ్యామ్ నువ్వు ఇలా చేసావ్ ఏంట్రా ఇదేనా నువ్వు మీ అమ్మానాన్నలకి ఇచ్చే గౌరవం అని ధనుంజయ్ అంటాడు.

ఏంటి మధుర ఇది ఇప్పుడు నా కూతుర్ని ఏం చేయమంటావు ఎందుకు నా కూతురు జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు ఇక నా కూతురికి జీవితంలో పెళ్లవుతుందా దాన్ని చేసుకోడానికి ఎవడైనా ముందుకు వస్తాడా అని సంయుక్త వాళ్ళ అమ్మ అంటుంది. చెప్పరా ఆంటీ అడుగుతుంది కదా సమాధానం చెప్పు అని మధుర అంటుంది. నేను నీకు నాన్నకి తప్ప ఇంకెవరికి సమాధానం చెప్పను అని శ్యామ్ అంటాడు. ఎందుకురా ఇలాంటి దిక్కుమాలిన పని చేసావ్ మీ అమ్మ నాన్న చచ్చారు అనుకున్నావా గుండెలు అవిసిపోయేంత బాధ అవుతుంది రా ఒకప్పుడు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఆ పెళ్లి పెటాకులు అయింది అన్నాడు ఇప్పుడేమో చెప్పా పెట్టకుండా ఈ మహా తల్లిని పెళ్లి చేసుకుని వచ్చాడు అని మధుర అంటుంది.

అమ్మ ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా అని శ్యామ్ అంటాడు. నేను ఎన్నోసార్లు రాదని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్తే నువ్వు విన్నావా వినలేదు ఎందుకంటే నీకు అమ్మంటే ఇష్టం లేదు చూశారా అండి నాకు ఇష్టం లేదని చెప్పినా రాదనే పెళ్లి చేసుకున్నాడు అది వాడి నిర్ణయం కానీ నా నిర్ణయం కూడా చెప్తాను వినండి వాడి భార్య రాధా ఇంట్లో అడిగి పెడితే మీ భార్యగా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని మధుర అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది