Madhuranagarilo October 3 ఎపిసోడ్ 173: రాధ వాడి భార్యగా ఈ ఇంట్లో అడుగు పెడితే నేను బయటికి వెళ్తాను వాడి భార్యను ఇంట్లో ఉండనిస్తారో నన్ను బయటికి వెళ్ళమంటారో యజమానిగా మీరే ఒక నిర్ణయం తీసుకోండి అని మధుర అంటుంది. మధుర ఏంటి అలా ఆవేశపడుతున్నావ్ అర్థం చేసుకో అని ధనుంజయ్ అంటాడు. ఏంటండీ అర్థం చేసుకునేది రాధా నేను ఓకే ఇంట్లో ఉండడం కుదరదు పెళ్లయిన దాన్ని తీసుకొచ్చి నా ఇంటికి కోడల్ని చేశాడు ఎవరి భార్యనో తెచ్చి నా భార్య అని అంటున్నాడు ఒక బిడ్డ తల్లిని తీసుకొచ్చి ఇంట్లో ఉంచుతాను అంటే నేను ఎలా ఊరుకుంటాను అందుకే నేను వెళ్ళిపోతాను అని మధుర అంటుంది.

అమ్మ రాధా ఎవడి భార్య కాదు నా భార్య అసలు రాధకు పేళ్లే కాలేదమ్మా పండు రాధా కొడుకు కానే కాదమ్మా వాళ్ళ అక్క చనిపోతూ పండును తన చేతిలో పెట్టింది వాళ్ళ బావ ఎక్కడున్నాడో తనకి తెలియదు అందుకని పండుకు తల్లి అయింది రాదా అని శ్యామ్ అంటాడు. సార్ నేను చెప్పేది కాస్త వినండి అని రాదా అంటుంది. ఇప్పుడు నేను చెప్పకపోతే పదిమందిలో నా భార్యను అవమానించినట్టు అవుతుంది రాదా అని శ్యామ్ అంటాడు. అవును మేడం నాకు పెళ్లి కాలేదు పండు మా అక్క కొడుకు అని రాధ అంటుంది.అని నువ్వు చెప్పితే మధుర నమ్మాలా అని సంయుక్త వాళ్ళ అమ్మ అంటుంది.ఒక బిడ్డ తల్లిని పెళ్లి చేసుకొని వస్తే మధుర ఆంటీ ఒప్పుకోదని భలే కాదా క్రియేట్ చేసావ్ శ్యామ్ అయినా సరే ఆంటీ ఒప్పుకోదు అని సంయుక్త అంటుంది.

అవును నువ్వు చెప్పేవన్నీ నిజాలు అని నేను మాత్రం ఎందుకు నమ్మాలి అన్ని ప్రమాణాలు చేశాకే పరీక్షలు పెట్టాకే ఒప్పుకుంటాను ఒరేయ్ విల్సన్ నువ్వు వెళ్లి పండును తీసుకురారా అని మధుర అంటుంది. ఇంతలో పండు అక్కడికి వస్తాడు ఏంటి మీ ఇద్దరి మెడలో పూలదండలు ఉన్నాయి అని పండు అంటాడు. నువ్వు చెప్పింది నిజమే అయితే పండు మీద ప్రమాణం చేయి అని మధుర అంటుంది. శ్యామ్ సారు నేను చెప్పినవన్నీ నిజాలే పండు మీద ఒట్టేసి చెబుతున్నాను అని రాధా అంటుంది. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను రాధా నాకు కోడలు అయ్యిందని నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను నీకు తెలియదు కానీ నీలాంటి కోడలు రావాలని నేను ఎన్నోసార్లు అనుకున్నాను అమ్మ రండి లోపలికి వెళ్దాం అని మధుర అంటుంది.

తొందరపడుతున్నావేమో మధుర ఒక్కసారి ఆలోచించు అని సంయుక్త వాళ్ళ అమ్మ అంటుంది. ఆంటీ చాలా మంచి పని చేశారు నాలాంటి మంచి అమ్మాయిని ఇంటి కోడలు అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఉండండి నేను వెళ్లి హారతి తెస్తాను అని సంయుక్త లోపలకి వెళ్లి హారతి తెచ్చి వాళ్ళ ఇద్దరికీ హారతి ఇస్తుంది ఇప్పుడు లోపలికి రండి అని సంయుక్త అంటుంది. ఇదేంటి ఇలా మారిపోయావు అని వాళ్ళ అమ్మ అంటుంది. నేను ఇలా మారకపోతే ఆంటీ ఇంటికి మళ్ళీ రావడానికి మనకు అవకాశం వచ్చేది కాదు అప్పుడు శాశ్వతంగా శ్యామ్ ని నేను కోల్పోవాల్సి వచ్చేది అందుకే ఇలా గేర్ మార్చాను అని సంయుక్త అంటుంది.

కట్ చేస్తే ఇలా ఎలా ఒక్కరోజులో మార్పులు జరుగుతాయి అని పండు అంటాడు. దేని గురించి పండు నువ్వు అంటున్నది అని రాదా అంటుంది. అదే అమ్మ నిన్నటి వరకు ఈ ఇల్లు మనది కాదు కానీ ఇప్పుడు మనది మా ఫ్రెండ్ నాకు నాన్న అయ్యాడు నాని నాకు గోరుముద్దలు తినిపిస్తుంది ఇవన్నీ ఒక్క రోజులో ఎలా మారిపోయాయి అని పండు అంటాడు. ఈ మార్పు నీకు నచ్చిందా లేదా పండు అని శ్యామ్ అంటాడు. చాలా బాగా నచ్చింది అని పండు అంటాడు. ఎంత వింతగా ఉంది చూడండి నా పెళ్లి నాకే తెలియకుండా జరిగింది అని రాదా అంటుంది. అంతే రాదా కొన్ని మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి అని శ్యామ్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది