Madhuranagarilo: ముందు మనం మన ఇంటికి వెళ్లి పోదాం అండి అని రాధ వాళ్ళ అమ్మ అంటుంది. వాళ్లు బయలుదేరుతుంటే, రాధ వచ్చి ఇంకొక రోజు ఉండకూడదా నాన్న అని అడుగుతుంది. ఉండకూడదు అని కోపంతో అరుస్తాడు. అనుకోకుండా రేపు రిజిస్ట్రేషన్ పని పడింది నేను ఇక్కడే ఉంటే నేను లేకపోతే ఇక్కడ జరగదు కదా అని అంటాడు.ఆ పని ఎవరికైనా అప్పగించండి మామయ్య గారు అని శ్యామ్ అంటాడు. ఎవడో ముక్కు మొహం తెలియని వాడికి కూతురును ఇచ్చి పెళ్లి చేసినట్టు ఆ పనిని అప్పగించలేదు కదా అని అంటాడు మురళి. ఇక బయలుదేరుదామా టైం అవుతుంది అని అంటాడు. శ్యామ్ వెళ్తుంటే పలకరిస్తే మురళి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఆయన ఆ పని విషయంలో కొంచెం టెన్షన్ గా ఉన్నారు పట్టించుకోవద్దు అని రాధ వాళ్ళ అమ్మ చెప్తుంది.కట్ చేస్తే,సంయుక్త తన స్నేహితురాలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు, కంగ్రాట్స్ నీ ప్లాన్ సక్సెస్ అయింది అని అంటుంది

సంయుక్త స్నేహితురాలు,నువ్వు అనుకున్నట్టే వ్రతం ఆగిపోయింది.వ్రతం ఆగిపోయినంత మాత్రాన అంతా అయిపోయినట్టు కాదు, శ్యామ్ రాధా విడి పోవాలి, మధుర అత్తయ్యకు తనమీద ఆశయం కలిగేలా చేయాలి, రాధకు శ్యామ్ అంటే కోపం వచ్చేలా చేయాలి, అప్పుడు రాధ శ్యామ్ కి దూరమవుతుంది నేను శ్యామ్ కి దగ్గర అవుతాను అని సంయుక్త చెప్తుంది.కట్ చేస్తే, మధుర వాళ్ళ ఇంట్లో అందరు జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు, మధుర ఒక్కసారి లేచి, అసలు ఇలా జరుగుతుందనుకోలేదు, పంతులుగారు చెప్పినట్టు అరిష్టం జరుగుతుంది ఏమో అని అనుకుంటుంది. అమ్మ ప్రతిదీ అలా అనుకుంటే మనం ముందుకు వెళ్లలేము అని శ్యామ్ అంటాడు. అలా కాదురా నా కోడలికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను అని అంటుంది మధుర. ఏదైనా అరిష్టం జరిగితే నాకే జరుగుతుంది కొబ్బరికాయ కొట్టింది నేను బట్టలు కాలిపోయింది నా వల్ల ఏదైనా జరిగితే నాకే జరుగుతుంది మీరే కంగారు పడకండి అని అంటుంది రాధ.

ఈ ఇంటి కొడుకు ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను అంటుంది మధుర. మీరు మీ కోడలికి ఏదైనా జరిగితే తట్టుకోలేరు నేను కూడా మా అత్తయ్యకి ఏమి జరిగిన తట్టుకోలేను అంటుంది రాధ. మీరెలాగో మీ కోడలు సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు నేను కూడా మా అత్తయ్య సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను, మీరు బాధపడితే నేను తట్టుకోలేను, మిమ్మల్ని సంతోషంగా చూసుకోవడం నా బాధ్యత, అలాగే నన్ను సంతోషంగా చూసుకోవడం కూడా మీ బాధ్యత కాబట్టి మీరు నన్ను సంతోషంగా చూసుకోవాలి అని రాధ అంటుంది. రాధకు ఇష్టం లేకుండా పెళ్లి పెళ్లి చేసుకున్న తను ఒక కొడాలి బాధ్యత తీస్కొని మా అమ్మ నాన్నను చాలా బాగా చూసుకుంటుంది అని శ్యామ్ తన మనసులో అనుకుంటాడు. ఇది నా ఒక్కదాని బాధ్యత కాదు నీ బాధ్యత కూడా అని శ్యామ్ కి చెప్తుంది రాధ.

నాకు ఛాన్స్ లేకుండా నువ్వే చేసేసావు కదా అని అంటాడు శ్యామ్. ఈరోజు గురించి చెప్పట్లేదు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను అని అంటుంది రాధ. సరే భోంచేద్దాం పదండి అని అందరూ తింటారు. రాధ శ్యామ్ గదిలోకి వెళ్తుంది, నేను నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న విషయం పక్కన పెట్టి, నన్ను క్షమించి మా అమ్మ నాన్నను చాలా బాగా చూసుకుంటున్నావ్ అని అంటాడు శ్యామ్. మిమ్మల్ని నేను క్షమించలేదు, ఒక అమ్మాయి మనసు అర్థం చేసుకోకుండా ఎలా పెళ్లి చేసుకోకూడదో అలా చేసుకుని తప్పు చేసింది మీరు, వాళ్ల తప్పేం లేదు వచ్చినా కోడలిని చాలా బాగా చూసుకుంటున్నారు అలాంటప్పుడు నేను చూసుకుంటే తప్పేంటి అంటుంది మిమ్మల్ని ఇప్పటంతలో క్షమించలేను అని రాధ చెప్తుంది.

నువ్వు నన్ను భర్తగా అంగీకరించే వరకు నేను ఒక ఫ్రెండ్ లాగానే ఉంటాను నేనెప్పుడూ ఇబ్బంది పెట్టను అంటాడు శ్యామ్.ఇంతలో పండు వస్తాడు గదిలోకి. అమ్మ పాడుకుందాం రా అంటాడు పండు. ఇది నాన్న రూమ్ మనం వేరే గదిలో పడుకుందాం రా అని రాధ అంటుంది. ఇది కూడా మనమే కదా అమ్మ అంటాడమధ్యలో ఇక్కడ వద్దు నానమ్మ వేరే గదిలో పాడుకుందాం అంటుంది రాధ. నేను ఇక్కడే పడుకుంటాను అంటాడు పండు. వద్దు మళ్ళీ మధ్యలో లేచి అమ్మ కావాలి అంటే కష్టం అని అంటుంది రాధ. సరే పద అని రాధ పండు వెళ్ళిపోతారు. కట్ చేస్తే, తెల్లవారు జామున అందరు కలిసి పండు నీ స్కూల్ కి రెడీ చేస్తారు, మమ్మీ నువ్వు కూడా రా, మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు వస్తారు, నేను వాళ్ళకి పరిచయం చేస్తాను అంటాడు. రాధ వేళ్ళు అమ్మ వాడి ముచ్చట మనకు ఇష్టమే కదా అని మధుర అంటుందుయ్. కట్ చేస్తే, మధుర సంయుక్త దగ్గరికి వెళ్తుంది. అమ్మ సంయుక్త రాధ మా ఇంటి కోడలు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది, దాని కన్న ముందు, నువ్వు పెళ్లి జరగకపోయినా గొడవ చేయకుండా ఉన్నావ్ అని మదుర అంటుంది.