Madhuranagarilo October 19th ఎపిసోడ్ 187: ఇటు రండి పక్కకు వచ్చి కూర్చోండి అని రాదా అంటుంది. నేను రాను అని శ్యామ్ అంటాడు. ప్లీజ్ సార్ ఇలా రండి వచ్చి కూర్చోండి నా భుజం మీద చేయి వేయండి అని రాధా అంటుంది. రాధా ఎలా ఉన్నారు శ్యామ్ ఎక్కడ అని మధుర ఉంటుంది. ఇక్కడే ఉన్నాను అమ్మ అని శ్యామ్ అంటాడు. మి ముచ్చట్లు అయిపోయాయా నాకు ఫోన్ ఇస్తే నేను మాట్లాడాలి మా డాడీ తో అని పండు. ఇదిగో తీసుకోరా అని మధుర ఫోన్ ఇవ్వగానే హలో డాడీ ఎలా ఉన్నావు అని పండు అంటాడు. రేయ్ పండు నేను నీతో మాట్లాడను రా అని రాదా అంటుంది. ఎందుకమ్మా అని పండు అంటాడు.

నేను పక్కనే ఉన్న గాని మీ డాడీ తో ముందు మాట్లాడుతాను అంటున్నావు కదా అందుకు అని రాదా అంటుంది.సారీ అమ్మ అని పండు అంటారు. అత్తయ్య పండు మిమ్మల్ని ఏమైనా విసిగిస్తున్నాడా అని రాధా అంటుంది. ఏమి విసిగించట్లేదమ్మా చాలా పొద్దు పోయింది ఇక పడుకోండి అని మధుర అంటుంది. కట్ చేస్తే ఇంతలో తెల్లవారింది శ్యామ్ లేచి చూస్తే రాద మిద ఎండ పడుతుందని కిటికీ దగ్గర అడ్డంగా నిలబడతాడు. రాధ లేచి చూసేసరికి శ్యామ్ కనబడతాడు ఏంటి నా బెడ్ పక్కన నిలబడ్డారు అని రాదా అంటుంది.నీ బెడ్డు పక్కన నిలబడలేదు రా దా నికు ఎండ పడుతుందానీ కిటికీ అడ్డంగా నిలబడ్డాను అని శ్యామ్ అంటాడు.

నా మీద ఎండ పడితే ఏమవుతుంది నేనేమన్నా సుకుమారిన అని రాదా అంటుంది.నీ మీద ఎండే కాదు రాదా ఇంకేది పడనివ్వను నువ్వంటే నాకు అంత ఇష్టం అని శ్యామ్ అంటాడు. మేడం మీరు త్వరగా రెడీ అయితే అందరినీ బస్సులు ఎక్కించుకుని తీసుకువెళ్లి ఇంపార్టెంట్ అయిన ప్లేస్ లన్ని చూపిస్తారు అని ఆ లాడ్జిలో పని చేసే అబ్బాయి అంటాడు. కట్ చేస్తే రాదా వీళ్ళందరూ కూడా మనలాగే హనీమూన్ కి వచ్చారు అని శ్యామ్ వాళ్లకు పరిచయం చేస్తాడు.

హనీమూన్ కి వచ్చిన జంటలు అందరూ వచ్చేసారా అని బస్సు డ్రైవర్ అంటాడు. ఇక్కడ ఏముందని చూపించడానికి అందర్నీ తీసుకువచ్చారు అని అక్కడ ఉన్న వాళ్ళలో ఒక అతను అంటాడు. ఇక్కడికి వచ్చిన హనీమూన్ జంటలందరికీ స్వాగతం సుస్వాగతం ఇక్కడ రెండు గంటల్లో బెస్ట్ కపుల్ పోటీ పెడుతున్నాం ఇక్కడికి వచ్చిన జంటలో బెస్ట్ జోడి ఎవరో తెలిసిపోతుంది ఇక్కడికి వచ్చిన వాళ్లల భార్య బోర్డు మీద తనకు నచ్చినవి రాస్తుంది కళ్ళు మూసుకొని తన భార్య ఏమి రాసిందో కనిపెడితే బెస్ట్ కపుల్ గిఫ్ట్ గెలుచుకుంటారు ఇంతవరకు ఇక్కడికి వచ్చిన వారిలో ఎవరు గెలుచుకోలేకపోయారు ఈసారైనా గెలుచుకుంటారో లేదో చూద్దాం అని అంటాడు. మేమందరము రెడీ అని హోటల్ మేనేజ్మెంట్ అంటుంది . ఓకే అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము అని మొదలు పెడతారు.అందరూ పోటీలో గెలవలేక పోతారు. ఇక మీరే మిగిలారు రండి సార్ అని శ్యామ్ వల్లని పిలుస్తాడు హోటల్ మేనేజర్.

రాధ వెళ్లి బోర్డు మీద తనకి ఇష్టమైనవి అన్ని రాస్తుంది.నీ భార్యకు ఇష్టమైన కలర్ ఏది అని మేనేజర్ అంటాడు. వైట్ అని శ్యామ్ సమాధానం చెప్తాడు. సూపర్ గా చెప్పారు సార్ అని మేనేజర్ మీ భార్యకి ఇష్టమైన ప్రదేశం ఏది అని అంటాడు. కొడైకెనాల్ అని శ్యామ్ అంటాడు. ఇది కూడా కరెక్టే మీ భార్యకు ఇష్టమైన ఫుడ్ ఏది అని మేనేజర్ అంటాడు.ఉలవచారు అని శ్యామ్ సమాధానం చెప్తాడు. చప్పట్లు చప్పట్లు అనే మేనేజర్ సంబర పడిపోతూ మీ భార్యకు ఇష్టమైన సినిమా ఏది అని అంటాడు.

మాయాబజార్ అని శ్యామ్ అంటాడు. మీ భార్యకు ఇష్టమైన వ్యక్తి ఎవరు అని అంటాడు. వ్యక్తి కాదు సార్ వ్యక్తులు ఒకటి వాళ్ళ అక్క ఒకటి పండు అని శ్యామ్ సమాధానం చెప్తాడు మీరు ఈ పోటీలో గెలిచారు ఇన్నాళ్ళ నుంచి ఎవరు గెలవ లేకపోయారు అని మేనేజర్ అంటాడు. గెలిసిన సంతోషంలో శ్యామ్ ఉండగా అక్కడికి వచ్చిన వాళ్లలో ఒక అతను మీ భార్యకి ఇష్టమైన వాళ్ళు మీరే కదా నీ పేరు రాయకుండా వేరే వాళ్ళ పేరు రాసింది ఏంటి సార్ అని ప్రశ్నిస్తాడు. ఆ మాటకి శామ్ ఏమీ మాట్లాడకుండా నిలబడిపోతాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది