Madhuranagarilo Episode 192: పండు కళ్ళు తిరిగి కింద పడుతాడు. మధుర ఇంక ధనుంజయ్ పండుని లేపడానికి ప్రయత్నిస్తారు. కాని పండు లేవడు. ధనుంజయ్, పండు కి ఏమై ఉంటుంది ఎందుకు లేవట్లేదు, నాకు భయంగా ఉంది అని అంటుంది మధుర. కంగారు పడకు మధుర డాక్టర్ కి ఫోన్ చేస్తాను ఉండు వాడికి ఏం కాదు అని అంటాడు ధనుంజయ్.

కట్ చేస్తే, రాధ శ్యామ్ గురించి ఆలోచిస్తుంది, నన్ను అడగకుండా నా మెడలో తాళి కట్టాడు, ఏ కష్టం వచ్చిన శ్యామ్ గారిని దాటి నన్ను దాటాలి అని అన్నాడు, నా కోసం చాలా చేస్తున్నారు, నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారు, నేను ఎంత కోపంగా ఉన్న, నేను ఎంత ద్వేశించిన నన్ను కోరుకుంటున్నారు, శ్యామ్ గారి ప్రేమను నేను ఎందుకు అంగీకరించకూడదు, నన్ను ప్రేమించే వాళ్ళను నేను ఎందుకు ఇష్టపడకూడదు, ఇన్నాళ్లు ఆయన మీద కోపంగా ఉన్న ఇప్పుడు ఆయన అంటే ప్రేమ ఉంది, ఆయనకి చెప్పేస్తాను మీరు అంటే నాకు ఇష్టం అని, ఆయన చాలా సంతోషిస్తారు, ఆయన ఆనందానికి హద్ధులు ఉండవు, ఇన్ని రోజులు బాధ పడివుంటారు కాని ఇప్పుడు బాధకు మించిన సంతోషం ఉంటుంది.

నేను చెప్పిన తర్వాత ఆయన కళ్ళలో సంతోషం చూడాలి, ఆయన ప్రేమ కాదని నేను ఇంక దూరం పెట్టలేను, ఆయన ఉన్న ఇప్పుడు నేను ఉండ లేకపోతున్నాను, ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో నేను చెప్పేస్తాను ఇలా ఉండడం నా వాళ్ళ కాదు శ్యామ్ గారు, మీరు ఎలా ఇంత ద్వేషన్ని భరించారు శ్యామ్ గారు, ప్రతి రోజు నన్ను సంతోష పెట్టడానికి మీరు చాలా చేసారు, కాని నేను మాత్రం మిమ్మల్ని బాధ పెడుతూ వచ్చాను,మీ బాధను పోగొట్టే మాటను ఏ రోజు మీకు చెప్తాను, ఇక నుండి మనం మంచిగా కలిసి ఉండాలి, మన మధ్య ఎలాంటి మనస్పర్ధాలు రాకూడదు, మిమ్మల్ని ఎప్పటికి నేను దూరం చేసుకోను అని రాధ అనుకుంటుంది. రాధ శ్యామ్ కి ఫోన్ చేస్తుంది.

చెప్పు రాధ ఈ టైం లో ఫోన్ చేసావ్ అంటాడు శ్యామ్. మీరు ఎక్కడికి వెళ్ళకండి, రిసార్ట్ పక్కన ఉన్న టెంపుల్ కి రండి అని చెప్తుంది. ఎందుకు ఏమైనా ఉంటే చెప్పు ఇప్పుడు అని అంటాడు శ్యామ్. మీరు రండి నేను చెప్తాను తొందరగా రండి అని అంటుంది రాధ. కట్ చేస్తే, రాధ వాళ్ళ నాన్న రాధ ఇంక రుక్మిణి ఉన్న ఫోటో ని చూస్తాడు. ఆ ఫోటోను చూస్తూ రాధ గురించి ఆలోచిస్తూ ఉంటాడు.ఇంతలో వాళ్ళ భార్య వచ్చి ఏమైంది అండి ఎందుకు ఆ ఫోటో వంక అలా చుస్తునారు అని అడుగుతుంది. నా కూతుర్లు ఇద్దరు, వాళ్లిద్దరూ ఎప్పుడు ఒకరు అంటే ఒకరికి ఇష్టం, ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు, కాని ఇప్పుడు ఇద్దరి కూతుర్లు నాకు దూరం అయిపోయారు, నా పెద్ద కూతురిని వాడు చంపేశాడు, ఇప్పుడు నా చిన్న కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, దాన్ని ఏం చేస్తాడో అని అంటాడు రాధ వాళ్ళ నాన్న.

ఎందుకు అలా చేస్తాడు అండి, అలా ఏం జరగదు మీరు ఏమి కంగారు పడకండి అని రాధ వాళ్ళ అమ్మ అంటుంది. ముందు నా పెద్ద కూతుర్ని చేసిన వాడు, ఇప్పుడు నా చిన్న కూతుర్ని చేయడు అని ఎలా అంటావ్, ఒకసారి చేసాడు మరోసారి చేయడని నమ్మకం ఏంటి అని రాధ వాళ్ళ నాన్న అంటాడు.మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అని అంటుంది రాధ వాళ్ళ అమ్మ. వాడు అలాంటి వాడే నా కూతుర్ని ఏం చేస్తాడో ఏంటో, నా ఇద్దరి కూతుర్ల జీవితం నాశనం చేసాడు అని రాధ వాళ్ళ నాన్న అంటాడు. బాగానే చూసుకుంటున్నాడు కదా ఇంక ఎందుకు కంగారు పడతారు అని రాధ వాళ్ళ అమ్మ అంటుంది.

ఇప్పుడు మంచిగా ఉన్నాడు తర్వాత ఎలా ఉంటాడో ఎవరికీ తెలుసు వాడిని నేను నమ్మను అని రాధ వాళ్ళ నాన్న అంటాడు. కట్ చేస్తే, డాక్టర్ వచ్చి పండుని చూస్తుంది, ఇంజక్షన్ ఇస్తుంది. ఏం అయింది అని మధుర అడుగుతుంది. డాక్టర్ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది. రాధ చెప్పిన విషయం గుర్తు చేసుకుంటుంది. రాధ ఎవరికీ ఈ విషయం గురించి చెప్పకండి అని అంటుంది.అది గుర్తుకు వచ్చి డాక్టర్ పండుకి ఏం కాలేదు కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్తుంది.

పొద్దున నుండి వాడు బయటే ఉన్నాడు అని ధనుంజయ్ అంటాడు.అందుకే ఎలా జరిగింది అని డాక్టర్ చెప్తుంది. పండు లేచి ఇప్పుడు నేను వెళ్లి ఆడుకోవచ్చు కదా అని అడుగుతాడు. కొంచం నీరసంగా ఉన్నావ్ కదా ఇప్పుడు రెస్ట్ తీస్కో అంటుంది డాక్టర్. సరే అని అంటాడు పండు. కట్ చేస్తే,రాధ గుడికి వెళ్తుంది, అమ్మవారికి దండం పెట్టుకొని, అమ్మ ఈరోజు నేను ఆయనకి చెప్పేస్తాను అని అంటుంది. కట్ చేస్తే, మధుర డాక్టర్ ఎందుకు అంత సేపు ఆలోచించింది అని ధనుంజయ్ ని అడుగుతుంది. ఏం లేదు అని ధనుంజయ్ అంటాడు. చెప్పు రాధ ఏదో చెప్పాలి అన్నావ్ అని శ్యామ్ అంటాడు. అది ఏంటి అంటే అని సిగ్గు పడుతుంది రాధ. ఇంతలో రాధ కు రుక్మిణి ఫోన్ చేస్తుంది. నేను మీ అక్క ని అని చెప్తుంది. రాధ షాక్ అవుతుంది.