Madhuranagarilo Today Episode సెప్టెంబర్ 12: ఎందుకు వెళ్ళవో ఎలా వెళ్ళవో అది చూస్తాను అని బ్యాంక్ చెక్ ని చింపేసి వెళ్ళిపోతుంది మధుర. ఇంతలో శ్యామ్ అక్కడికి వచ్చి రాధా ఏమైంది ఇంత పరధ్యానంలో ఉన్నావు అని శ్యామ్ అంటాడు. ఏమీ లేదు సార్ అని రాదా అంటుంది. ఆ సంయుక్త ఏమైనా అందా లేదంటే అమ్మ ఏమైనా తిట్టిందా చెప్పు రాదా అని శ్యామ్ అంటాడు. అదేమీ లేదు సార్ నన్ను ఎవరూ తిట్టలేదు అని రాధా అంటుంది. ఇంతలో కాలనీ వాళ్ళందరూ వచ్చి శ్యామ్ సార్ కృష్ణాష్టమి వేడుకలు ఎక్కడ చేద్దాం ఎప్పుడు మొదలు పెడదాం అని అంటారు. ఆ విషయం గురించే రాధ తోటి మాట్లాడదామని ఇలా వచ్చాను అని శ్యామ్ అంటాడు. అవునా అయితే రాధమ్మ ఏమంటుంది అని వాళ్ళు అడుగుతారు.

ఎప్పుడు ఎలా చేస్తారో అలాగే చేయండి అని రాదా అంటుంది. కృష్ణుని విగ్రహం పెట్టి ఉట్టి కొట్టి పూజలు చేసి చేయమంటుందా అని అంటారు.ఇంతలో పండు వచ్చి ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటాడు. ఏమీ లేదు పండు కృష్ణాష్టమి వేడుకలు ఎల చేద్దాము అని అనుకుంటున్నాము నువ్వు కృష్ణుడి వేషం వేయొచ్చు కదా అని ఆ కాలనీ వాళ్లు అంటారు. అవును పండు, నువ్వు కృష్ణుడి వేషం వెయ్యి అని రాదా అంటుంది. కృష్ణుడి వేషం వేయొచ్చు కదా అని అనగానే సరిపోతుందా కృష్ణుడికి కావలసిన వస్తువులన్నీ తేవాలి కదా వెళ్లి తీసుకురా అని పండు అంటాడు.

ఇప్పుడేనా నేను బయటికి వెళ్లినప్పుడు తెస్తానులే పండు అని రాదా అంటుంది. అప్పుడు తెస్తా ఇప్పుడు తెస్తా కాదు ఇప్పుడే వెళ్లి తీసుకురా వెళ్ళు అని పండు అంటాడు. సరే రాధా పండు అంతలా అంటున్నాడు కదా మనం వెళ్లి కృష్ణుడికి కావాల్సిన సామాన్లు అన్ని తీసుకొద్దాం పద అని శ్యామ్ అంటాడు.మీరెందుకు సార్ నేను వెళ్లి తీసుకొస్తాను లే అని రాదా అంటుంది. ఏంటి నువ్వు తెచ్చేది ఇక్కడ కృష్ణుని వేషం అమ్మ అంటే మగవాళ్ళకే తెలుస్తుంది ఆడవాళ్ళ కాదు ఫ్రెండు నువ్వు కూడా వెళ్లి అమ్మతో పాటు తీసుకురా అని పండు అంటాడు. అవునా అయితే మా ఆడవాళ్లకు తెలియనిది మీ మగ వాళ్లకు తెలుసా బాగా అని రాధా అంటుంది. అవును మీకన్నా మాకే తెలుసు ఏమంటావు ఫ్రెండు అని పండు అంటాడు.

అవును ఫ్రెండు అని శ్యాం అంటాడు.మీరిద్దరు ఇప్పుడు షికారుకు వెళ్తారా ఉండండి మీ పని చెప్తా అని సంయుక్త వెళ్లి కారు టైర్ గాలి తీస్తుంది.. నేను వెళ్లి తాళం తీసుకొస్తాను ఉండు అని శ్యామ్ వెళ్ళిపోతూ ఉండగా టైర్ పంచర్ అయ్యి నట్టు కనపడుతుంది అయ్యో టైర్ పంచర్ అయింది ఇప్పుడు ఎలా బండి కూడా లేదే అని అటు ఇటు చూసి రాధా నీ స్కూటీ ఉంది కదా దాని మీద వెళ్దాం పద తాళం ఇటు ఇవ్వు అని స్కూటీ ఎక్కి వాళ్ళిద్దరూ వెళ్లిపోతారు . స్కూటీ మీద వాళ్ళిద్దరు వెళ్ళిపోతుండగా మధుర చూసి పొద్దున వాకింగ్ కి వెళ్ళాడు ఇప్పుడు షికారుకు వెళ్తున్నారు ఈ రాదని ఎలా ఈ కాలనీ నుంచి పంపించేయాలి అని మధుర అనుకుంటుంది. అక్కడే దూరంగా నిలబడి చూస్తున్న సంయుక్త వాళ్ళిద్దరూ స్కూటీ మీద వెళ్లడం అత్తయ్య చూసింది కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనం వెళ్లి కొంచెం పెట్రోల్ పోస్తే ఇంకా బాగుంటుంది అని సంయుక్త వెళ్లి అత్తయ్య ఇదేమి బాగోలేదు అని అంటుంది. అవును సంయుక్త ఇదేమి బాగోలేదు అసలు రాదా ఎందుకు ఇలా చేస్తుంది ఏదో ఒకటి చేసి రాదని ఇక్కడ నుంచి పంపించేయాలి అని మధుర అంటుంది.

అంటే అత్తయ్య వాళ్ళిద్దరూ స్కూటీ మీద వెళ్లడం మీరు చూశారా అని సంయుక్త అంటుంది. చూశాను కాబట్టే కోపం తో రగిలి పోతున్నాను శ్యామ్ ని కొంగుముడి వేసుకొని తిరుగుతుంది రాధా ఎంత చెప్పినా బ్యాంకు చెక్కు ఇచ్చిన ఇక్కడి నుండి వెళ్లనుంటుంది అని మదురా అంటుంది. కోట్ల ఆస్తి తన సొంతం అవుతుంటే లక్షలకు ఎందుకు ఆశపడుతుంది అత్తయ్య అని సంయుక్త అంటుంది. అంతేనంటావా ఈ ఇంటికి కోడలు అయ్యి ఈ ఆసినంత తను గుప్పెట్లో పెట్టుకోవాలని ఇక్కడి నుండి వెళ్లిపోవట్లేదా అని మధురం అంటుంది. అవును అత్తయ్య నేనం టే నా అదృష్టం కొద్ది శ్యామ్ నాకు భర్త కాలేదని సరిపెట్టుకొని వేరే పెళ్లి చేసుకుంటాను కానీ పాపం మీరు మీ కొడుకు దూరమైపోతే మీరు ఏమైపోతారు అని సంయుక్త అంటుంది. అ మాటలు విన్న ధనుంజయ్ సంయుక్త ఏం మాట్లాడుతున్నావ్ అసలే హార్ట్ పేషంటు తన దగ్గర ఏం మాట్లాడాలో నీకు తెలియదా తనను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నావ్ నువ్వు కేవలం తన ఫ్రెండ్ వాళ్ళ కూతురు మాత్రమే ఇంకా ఈ ఇంటి కోడలు కాలేదు అర్థమైందా అది గుర్తుపెట్టుకుని ఉంటే మంచిది అని ధనుంజయ్ అంటాడు. నేను అత్తయ్య ను రెచ్చగొట్టాలని అలా మాట్లాడలేదు మామయ్య సో సారీ క్షమించు అత్తయ్య తప్పైపోయింది అని అక్కడనుండి వెళ్ళిపోతుంది సంయుక్త. ఏంటండీ మీరు అలా మాట్లాడారు తను ఎంత బాధ పడుతుంది అని మధుర అంటుంది. కొందరిని దూరం పెట్టాలంటే బాధపడిన పర్వాలేదు మధుర అలాగే మాట్లాడాలి నువ్వు పూర్తిగా సంయుక్త మాయలో పడిపోయావు రా దా ఏం చెప్పినా వినట్లేదు రాధా మీద ఉన్న కోపంతో సంయుక్త ని ఇష్టపడుతున్నావు కానీ శ్యామ్ కి ఇష్టం లేకుండా ఎలా పెళ్లి చేస్తావు అది ఆలోచించు ముందు అని ధనుంజయ్ అంటాడు. కట్ చేస్తే రాదా నవ్వుతుంది. ఏంటి రాధా ఎందుకు నవ్వావు చెప్పు అని శ్యామ్ అంటాడు. ఏమీ లేదు సార్ ఏదో గుర్తుకు వచ్చింది నవ్వాను అని రాదా అంటుంది.

ఆ ఏదో నాకు చెప్పు నేను కూడా నవ్వుతాను అని అంటాడు శ్యామ్.ఏమీ లేదు సార్ ఒకసారి పండుకి ఐస్క్రీమ్ ఇప్పిస్తే అంతా షర్ట్ మీద పోసుకున్నాడు అది గుర్తొచ్చి నవ్వొచ్చింది అని రాదా అంటుంది. ఓహో అవునా అయితే ఇప్పుడు నిజం చెప్పు అని శ్యామ్ అంటాడు. ఏంటి సార్ నేను అబద్ధం చెప్పానా అని రాదా అంటుంది. అవును రాదా నేను ఫీల్ అవుతాననే నువ్వు చెప్పట్లేదు కానీ ఏదో ఉంది అ ఏదో నాకు చెప్పు అని శ్యామ్ అంటారు. మీరు కొంచెం కూడా ఫీల్ అవ్వను అంటే చెబుతాను అని రాదా అంటుంది. అవును రాదా నేను ఏమీ ఫీల్ అవ్వను ఆ విషయం ఏంటో చెప్పు అని శ్యామ్ అంటాడు. ఏమీ లేదు సార్ ఒకసారి పండు నేను నువ్వు స్కూటీ మీద వెళ్తున్నప్పుడు మీరు డ్రైవింగ్ ఎలా చేశారో గుర్తు చేసుకోండి అని అంటుంది రాదా. రాధా అప్పుడు అలా తో లేను కానీ ఇప్పుడు అలా ఊగుతూ తూగుతూ తోలట్లేదు కదా అని శ్యామ్ అంటాడు. ఓకే సార్ వెళ్దాం పద అని రాదా అంటుంది. రాధా ఐస్ క్రీమ్ తింటావా అని శ్యామ్ అంటాడు. నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమని మీకు ఎలా తెలుసు అని రాదా అంటుంది. నువ్వు నా మనసులో ఉన్నప్పుడు నీకు ఏది ఇష్టమో నాకు ఆ మాత్రం తెలియదా అని శ్యామ్ అంటాడు. అవునా అయితే పదండి ఐస్ క్రీమ్ తిందాం అని ఐస్ క్రీమ్ షాప్ లోకి వెళ్లి కూర్చొని రాధా నీకేం కావాలో చెప్పు అని శ్యామ్ అంటాడు. నేను నీ మనసులో ఉన్నప్పుడు నాకు ఏ ఐస్ క్రీమ్ అంటే ఇష్టమో మీకు ఆ మాత్రం తెలియదా అని రాదా అంటుంది. ఓహో వెయిటర్ రెండు స్ట్రాబెరీ తీసుకురా అని శ్యామ్ అంటాడు.

నాకు స్ట్రాబెరీ ఇష్టమని సార్ కు ఎలా తెలుసు అని రాదా షాక్ అవుతుంది. ఏంటి రాధా నువ్వు స్ట్రాబెరీ తినాలని మనసులో అనుకున్నావా అని శ్యామ్ అంటాడు. లేదు సార్ వెన్నెల ఐస్ క్రీమ్ తినాలి అనుకున్నాను అని రాదా అంటుంది. ఓహో అవునా అయితే ఇప్పుడు నిజం చెప్పు అని శ్యామ్ అంటాడు. అవును సార్ నేను స్ట్రాబరే తినాలి అనుకున్నాను అని రాదా అంటుంది. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఐస్క్రీమ్ తింటారు రాధ ముక్కుకి ఐస్ క్రీమ్ అంటుకుంటుంది రాదా ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకుంటే సరిపోతుంది ముక్కుకు ఎందుకు పెట్టుకున్నావు అని శ్యామ్ కర్చీప్ తీసి తుడుస్తాడు. సార్ ఎంతసేపు తుడుస్తారు ముక్కు అరిగిపోతుంది అని రాదా అంటుంది. ఓ సారీ సారీ అని ఖర్చుకి తీసి జోబులో పెట్టుకుంటాడు శ్యామ్. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది