మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కాంబోలో ఈ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి ఇది హ్యాట్రిక్ మూవీ. ఇప్పటికే వీరి కాంబోలో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. ఇవి ప్రేక్షకుల విశేషంగా ఆకట్టుకోవడంతో.. వీరి తాజా ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి.
`ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా అలరించబోతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్‌గా మారింది.
అదేంటంటే.. ఈ చిత్రంలో మహేశ్ బాబు స్పెషల్ ఏజెంట్ పాత్రలో అలరించబోతున్నాడట. అందుకోసమే ఫిట్నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ నేతృత్వంలో మహేశ్ కసరత్తులు షురూ చేసి కండలు పెంచుతున్నాడని ప్రచారం జరుగుతోంది. పైగా నమ్రతా శిరోద్కర్ శనివారం నాడు మహేశ్ షర్ట్ లెస్ ఫొటోలను షేర్ చేసింది.
ఈ పిక్స్ చూశాక మహేశ్ బాబు సిక్స్ ప్యాక్ చూపించడానికి రెడీ అవుతున్నారా అన్న అనుమానాలు రాక మానదు. మరి నిజంగానే త్రివిక్రమ్ మూవీతో మహేశ్ కండలు తిరిగిన దేహంతో స్పెషల్ ఏజెంట్‌గా కనిపించబోతున్నాడా..లేదా.. అన్నది చూడాలి. కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నాడు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!